'కేక' పెట్టించిన కెవ్వు కేకతో దాదాపు నాలుగేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న తేజ ఇప్పుడు ఓ రేంజ్ డాష్ సృస్టించటానికి ఈ వరం నీకు నాకు డాష్ ..డాష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఫై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంతో హీరో, హీరోయిన్ లతో పాటు 42 మంది కొత్త వాళ్ళు నటులుగా పరిచయం అయ్యారు. వారితో పాటు పరుచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ,తీర్ధ , సునీల్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. రామస్వామి మాటలు వ్రాసారు. యశ్వంత్ నాగ్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రసూల్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ చేసారు. స్టార్ హీరోలను డైరెక్ట్ చెయ్యలేను అని చెప్పే స్టార్ డైరెక్టర్ తేజ మళ్లీ స్టార్లు లేకుండానే తన స్టార్ డమ్ ను తిరిగి తెచ్చుకోవటానికి చేసిన డాషు.. ప్రయత్నమే ఈ నీకు నాకు డాష్ డాష్. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర డాష్ డాష్ చేసి తేజ డాష్ ను నెరవేర్చిందో మన డాష్ లో.... అదే మన సమీక్షలో చూద్దాం.
కధ :
మంచితనానికి పోయి ఒకడి అప్పుకు హామీ ఉన్న పుణ్యానికి మన హీరో శివ కు ఆ అప్పు తీర్చే భాద్యత మెడకు చుట్టుకుంటుంది. ఆ అప్పు తీర్చటానికి ఒక సంవత్సరం పాటు పనిచేయాలని చెప్పి తనతో పాటు తీసుకెళతాడు అప్పిచ్చినవాడు. ఇంతకీ ఆ పనేంటి అంటే బాపినీడు అనే మద్యం మాఫియ లీడర్ కల్తి మద్యం తాయారు చేసే చోట ఖాళీ సీసాలను కడిగి వాటిల్లో మందు నింపటం. మన శివ అక్కడికి వెళ్ళేప్పటికి వీడిలాంటి బాపతు అప్పు బాదితులందరూ అక్కడ పునరావాసం పొందుతూ ఉంటారు శ్రమ చేస్తూ....! అక్కడ శివకు తూఫాన్ బాబు తగులుతాడు... ఇద్దరు కలిసి సందడి చేస్తూ ఉంటారు. అక్కడే పనిచేస్తున్న మరో అప్పు బాదితురాలు గాయత్రీ అక్కడే బోలెడన్ని ప్రేమదాలున్నా సినిమాటిక్ పద్దతిలో శివాని ప్రేమలో పడేస్తుంది. ఒకానొక వీక్ మూమెంట్ లో ఇద్దరు కార్యం కూడా కానిస్తారు. తరవాత శివ చేసిన పొరపాటు వల్ల నాగేంద్ర అనే కుర్రాన్ని చంపేస్తాడు బాపినీడు. తప్పు తెలుసుకున్న శివ నాగేంద్ర కుటుంబాన్ని కాపాడే పాణిని భుజాన కేత్తుకుంటాడు. అలానే గాయత్రీ కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో ఆ పరిస్థితుల నుండి బయట పడటానికి బాపినీడు దాచుకున్న నల్ల డబ్బు దొంగలించి గాయత్రీ తో సహా పారిపోతాడు. ఇక ఆ ఫై శివ , గాయత్రిలను పట్టుకోవటానికి బాపినీడు ఏమి ప్రయత్నాలు చేసాడు...? వాటిని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కున్నారు.. అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
తేజ ఈ సినిమాతో తన పాత పంధాను అనుకరించటానికి ప్రయత్నించాడు కాని ఆ ప్రయత్నంలో సగం మాత్రమే సఫలం అయ్యాడు అని చెప్ప వచ్చు. సినిమా మొదలవగానే షాపింగ్ మాల్ సినిమా రిమేక్ ఏమో అనే అనుమానం కలుగుతుంది... దానికి బాద్యత మాత్రం ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసిన సురేష్ కొండేటియే కాని వేరే ఎవరు కాదని తేజ అర్ధం చేసుకోవాలి. పొతే సినిమా అసహజంగా మొదలై లాజిక్కులు మరిచి పోయి కొంతసేపు గడిచిపోయిన ఊరట కలిగించే అంశం ఏమిటంటే సునీల్ శెట్టి కామెడీ. దాదాపు మొదటి సగం సగ భాగాన్ని తానే నడిపించాడని చెప్పవచ్చు. కాని కధలో కీలక మలుపు నాగేంద్ర మరణంతో మొదలవుతుంది అక్కడి నుండి ఇంటర్వల్ వరకు ఆ తరవాత రెండో సగం సగం వరకు తేజ లోని పాత తేజ బయటకు వచ్చాడు. ఆ పార్ట్ ను చాల బాగా ప్రెసెంట్ చేసాడు. కధలో ఉత్కంతతను మైంటైన్ చేస్తూ ఆసక్తికరమైన సన్నివేశాలతో బాగా చేసాడు. కాని ఆ తరవాత తేజ ను ఏమి ఆవహించిందో తెలియదు కాని సినిమాలో ఒక్కసారిగా టెంపో మిస్ అయ్యింది. చివరి అరగంట భరించలేని విధంగా తయారైంది. అప్పుడు వరకు బాగున్నా ప్రతి పాత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ చికాకు పుట్టిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులు పెద్దగా థ్రిల్లింగ్ అనిపించవు పైగా అబెట్టుగా అనిపిస్తాయి. అదేంటో పాపం అప్పటిదాకా హీరో హీరోయిన్ కు ఎదురు తిరిగిన కాలం చివరిలో ఒక్కసారిగా కలిసి వచ్చి విలన్లందరూ వారికీ వాళ్ళే కాల్చుకుని అందరు చస్తారు. మొత్తంగా తేజ ఇటివలి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదనే చెప్ప వచ్చు కానీ ప్రేక్షకులను పూర్తిగా డాష్ చేయలేక పోయింది. ఎప్పుడూ తన సినిమాలకు మాటలు కూడా వ్రాసే తేజ ఈ సారి రామస్వామి అనే వ్యక్తీ తో వ్రాయించారు. మాటలు పర్వలేదనిపిస్తాయి కాని పెద్దగా ఆకట్టుకోలేదు. తేజ సినిమాలకు పాటలు కూడా కోట ప్రత్యేకత ఉంటుంది ... ఆ ప్రత్యేకతను కల్పించటంలో యశ్వంత్ నాగ్ అంచనాలను అందుకోలేక పోయాడు. అనూప్ రుబెంస్ నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం , కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కధకు అనుగుణంగా బానే ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తాజా హీరో ప్రిన్సు బాగున్నాడు.. అన్ని విభాగాలలోనూ మంచి ఈజ్ కనబరిచాడు. డాష్ కలిసి వస్తే మంచి భవిష్యత్తు అతని ముందు ఉంది అని చెప్పవచ్చు. నందిత కూడా బొద్దుగా డాష్ , డాష్ గా బాగుంది. పెద్ద పెద్ద కళ్ళతో మంచి నవ్వులతో ఆకట్టుకుంది. గ్లామరస్ అనిపించుకోవాలంటే బాడీ విషయంలో మాత్రం చాల మార్పులు అవసరం. బాపినీడు పాత్ర పోషించిన నటుడు మినహా మరే కొత్త నటుడు గుర్తింపు ఉన్న పాత్రలో కనిపించలేదు. బాపినీడు పాత్ర దారి యజ్ఞం ఫేం విజయ్ కుమార్ ను అనుకరించినట్టు అనిపిస్తుంది. తీర్ధ చిట్టి తల్లి పాత్రలో బాగానే చేసింది కానీ కొన్ని చోట్ల ఆ పాత్రకు అవసరమైన ఆవేశాన్ని ప్రదర్శించటంలో కాస్త వెనక పడ్డట్టు అనిపిస్తుంది. సుమన్ శెట్టి చాల రోజులు తరవాత మంచి పాత్రలో బాగా నవ్వించాడు. వేణు , పరుచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, తదితరులు వారి పాత్రలకు అనుగుణంగా బాగానే చేసారు.
చివరిగా :
ఒక శుక్రవారం సినిమా వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది.... అనేది తేజ అనుభవ పూర్వకంగా నమ్మే విషయం. మరి ఈ శుక్రవారం తేజకు ఏ విధమైన డాష్ ను మిగిల్చిందో... తెలియాలంటే ఒక వారం ఆగితే తెలుస్తుంది.

No comments:
Post a Comment