అందాల నటి శ్రేయ తీరు, తెన్నూ.. వంపు,సోంపు ఇవన్నీ చూసి కుర్ర మనసున్నా ప్రతిఒక్కరు ఏం ఊహిస్తారో.. ఏం ఆశిస్తారో... ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అందులోను ఈ మద్య అవకాశాలు తగ్గేప్పటికి.. బూతుపాటలకు, ఎంగిలి ముద్దులకు సై అంటున్న అమ్మడి మీద ఎవరికైనా ఎటువంటి అభిప్రాయం ఉంటుందో చెప్పండి..! ఆ కారణాల రిత్య శ్రేయ వేశ్యపాత్రలో నటిస్తుంది అంటే కుర్రాళ్ళు అందాల విందు చేసిందనుకుంటారు కాని కూర్చో పెట్టి మెసేజ్ లు దంచుతుందని ఊహిస్తారా....?
ఫైగా 'పవిత్ర' సినిమాలో వేశ్యగా చేస్తుందని చెప్పి ఒక హస్కి పోజ్ తో పోస్టర్ బయటకు వదిలి .. ఇది బోల్డ్ మరియు గోల్డ్ సినిమా అని చెబితే సహజంగానే నోరూరుతుంది.దాంతో కొంచెం ఆవేశానికి లోనై అవకాశం ఉన్నా చోట హద్దు మీరతారు అది కూడా సహజమే..! అలాంటి వాటిని సమయస్పూర్తితో ఎదుర్కోవాలి లేదా సర్దుకుపోవాలి. అంతేకాని అనేందుకు అవకాశం ఇచ్చి తరవాత రుస రుస లాడితే ప్రయోజనం ఏమిటి..? పోస్టర్ రిలీజ్ తరవాత ట్విట్టర్ లో కొందరు కొంటె పిల్లగాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెడామడలాడిపోయింది శ్రేయ. అక్కడితో ఆగకుండా సినిమాలో శృంగారం లేదు.. సందేశం ఉందని కుండ బద్దలు కొట్టింది. దాంతో సినిమా మీద పెంచుకున్నా ఆశలన్ని బిక్కచచ్చిపోయి బావురుమన్నాయి. దానికి తోడూ ఈ మద్య బయటకు వచ్చిన పవిత్ర స్టిల్స్ నాసిరకనికి కేర్ అఫ్ అడ్రెస్స్ గా కనిపిస్తూ సినిమాలో విషయం లేదు అన్నా సంగతిని చూచాయిగా తెలియజేస్తున్నాయి.
నిజమైన సినిమా వ్యాపారస్తుడు అనుకోకుండా కలిసి వచ్చిన జనాల వీక్ నెస్ ను పబ్లిసిటీ గా మార్చుకుని సినిమా విడుదల వరకు నడిపించి.... తరవాతి సంగతి ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అన్న ఘనంగా రాబట్టుకునేవాడు. కాని ఉత్తముడైన జనార్ధన మహర్షి సినిమా పోస్టర్ కు వచ్చిన స్పందనకే ఉబ్బి తబ్బిబై సినిమాలో ఉన్న అసలు సంగతిని ప్రెస్ మీట్ పెట్టి మరీ చాటింపేశాడు. ఫలితంగా తెలిసిందేమంటే... ' పవిత్ర అనే వేశ్య పాత్రలో నటిస్తున్న శ్రేయ అందరు తక్కువగా చూసే స్థాయి నుండి రాజకీయంగా ఓ శక్తిలా ఎదిగి సమాజంలోని అసమానతల ఫై పోరాడుతుందంటా...!సో.. ఈ పరిణామాలన్నిటిని పరిశీలనలోకి తీసుకుని ఆశవాహులకు చెప్పేదొక్కటే.. ఈ పవిత్రను అవకాశం ఉంటే బుద్ది సరిచేసుకుని పవిత్రంగా చూడండి . అంతే కాని పొరపాటున కూడా అపవిత్రంగా మాత్రం ఆలోచించకండి.
-----------------------------------------------------------------------------------
(23/1/13) చిన్న అప్ డేట్ ....
నిన్న మనం సహృద్భావంతో చర్చించుకున్న సమస్య ఈ రోజు కొంత సీరియస్ నెస్ ను ఆపాదించుకుంది. ఒత్సహికుల ఆగడాలు మీతిమీరాయని తన ట్విట్టర్ అకౌంట్ కు చెల్లు చీటీ వ్రాసేసింది శ్రేయ. "Done with twitter. I'm not on twitter from now on. Crazy stupid people. Can't take all the trash written." అని ఘాటుగా స్పందిస్తూ గుడ్ బాయ్ చెప్పింది.
ఇలాంటి పరిణామం సంభవించకూడదనేదే ఫైనా వ్రాసిన ఆర్టికల్ యొక్క ఉద్దేశం. కాని ఏమి చేస్తాం.. విధి ఆడినా వెరైటి నాటకంలో శ్రేయ తన అభిమానులకు దూరం కావాల్సి వచ్చింది.

No comments:
Post a Comment