Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 7, 2013

సూపర్ హిట్ అనిపించుకున్న నాయక్



మొత్తానికి 'నాయక్' సూపర్ హిట్ అనిపించుకుంది. మెగా పవర్ స్టార్ డాన్సులు,  ఫైటులతో ఆన్ స్క్రీన్ ఫై పడ్డ కష్టానికి... ఎడతెరిపి లేకుండా ప్రచారంలో పాల్గుని ఆఫ్ స్క్రీన్ ఫై పడ్డ కష్టానికి కలిపి భారి ఫలితమే దక్కింది. కేవలం సినిమాలో నటించటమే కాదు సినిమాను హిట్ చేపించే భాద్యత కూడా స్టార్ గా తన ఫైనా ఉంటుంది అన్నా విషయాన్నీ బలంగా నమ్ముతూ శ్రమటోడ్చిన చెర్రి 2013 కు గాను తెలుగు సినిమా పరిశ్రమకు తోలి విజయాన్ని అందించాడు. 

సంక్రాంతికి ఘనమైన ఓపెనింగ్స్ తో మంచి ప్రారంభాన్ని అందుకున్నప్పటికి ఆవరేజ్ గా ఉంది అన్నా మౌత్ టాక్ నాయక్ విజయానికి అడ్డుతగిలింది. పరిస్థితి గమనించి వీపరీతమైన ప్రచారంతో కలక్షన్లు గాడి తప్పకుండా జాగ్రత్త పడ్డ సినిమా రూపకర్తలు మంచి లాభాలను అర్జించుకున్నారు. మొత్తంగా నాయక్ ఫై నాలుగో వారాంతానికి 46 కోట్ల షేర్ వసులైందని తెలుస్తుంది. దీనిని బట్టి నాయక్ 8 నుండి 12 కోట్లు లాభాలను దక్కించుకున్నట్టే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నాయక్ సూపర్ హిట్ క్రెడిట్ మొత్తం చరణ్ కే దక్కుతుందని.. సినిమాను కాపాడుకోవటం కోసం చరణ్ చూపించిన చొరవ ఫలితమే ఈ విజయం అని మెగా అభిమానులు గర్వంగా చెబుతున్నారు. 

No comments:

Post a Comment