Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 13, 2013

'మిర్చి' చేసిన స్టార్


ఖడ్గం సినిమాలో కృష్ణ వంశీ చెప్పించినట్టు 'ఒక్క ఛాన్స్..ఒకే ఒక్కచాన్సు .." అన్నా మాటకు నిజజీవితంలో ఏంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సినీ ప్రపంచంలో ఒక్క ఛాన్స్ ..! ఎన్నో జీవితాలను మార్చేసింది. అప్పటి వరకు అతను  ఎవరో కూడా సరిగా  తెలియని వ్యక్తీ సరైనా ఛాన్స్ ఒకటి తగిలి రాత్రికి రాత్రే పెద్ద స్టార్ గా ఎదిగిపోయినా సంఘటనలు ఈ రంగుల ప్రపంచంలో కోకొల్లలు. తాజాగా  ఒక్క ఛాన్స్ ప్రభావంతో ఆంద్ర రాష్ట్రమంతట పాపులారిటి సంపాయించుకున్నా పేరు 'కొరటాల శివ'.

దశాబ్దానికి ఫైగా సినీ పరిశ్రమతోనే మమేకమై మాటల రచయతగా పయనం సాగిస్తున్నా శివను పరిశ్రమ గుర్తించినంతగా ప్రేక్షకులు గుర్తించలేదు. కాని దర్శకుడిగా తోలి అవకాశాన్నే నూరు శాతం సద్వినియోగం చేసుకున్నా శివకు బ్రహ్మరధం పడుతున్నారు తెలుగు సినీ ప్రియులు. ఇక సినిమా పరిశ్రమ సంగతైతే చెప్పనే అవసరం లేదు. శివతో సినిమాలను చేయటానికి టాలీవుడ్ నిర్మాతలందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినా చర్చల పరిణామాలను బట్టి శివ ముందు రామ్ చరణ్ తోనూ తరవాత NTR తో సినిమాలను చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 

దర్శకుడిగా సినిమాకు పనిచేసే అన్ని విభాగాల ఫై అవగాహనా తో కూడినా పట్టు కలిగి ఉండటం, భావోద్వేగాలను అవసరం మేర బాలన్సుడ్ గా కధలో చొప్పించే నైపుణ్యం, మంచి పాటలను ఎంచుకుని వాటిని మనసుకు హత్తుకునేలా అందంగా తెర ఫై ఆవిష్కరింపచేసే టాలెంట్ కొరటాల శివకు ప్రధానమైనా బలాలు. వాటిని విస్మరించకుండా శివ ఎన్ని విన్యాసాలు చేస్తే అన్ని హిట్లు కొడతాడు. చూద్దాం...! చాలా మందిలాగా ఈ మురిపాన్ని తోలి చిత్రానికే పరిమితం చేస్తాడో... లేక  కొంతమందిలాగా తన మార్క్ ను టాలీవుడ్ ఫై ముద్రిస్తాడో....! 

No comments:

Post a Comment