Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 14, 2013

Okkadine Movie Review

Listen Okkadine Voice Review

హీరోగా కంటికి అనీ అననట్టు కనిపించే నందమూరి వారి చిటికిన వేలు చుట్టం రోహిత్ తెలుగులో హీరోగా స్థిరపడటానికి పడుతున్నా శ్రమలో భాగంగా 'ఒక్కడినే' అంటూ ఈ వారం దియేటర్లకు వచ్చాడు. 'సోలో' ను హిట్ సినిమానే అనిపించుకున్నా నారా వారబ్బాయి ఇప్పుడు మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో మాస్ సినిమాల భరతం పట్టే పనిలో పడ్డాడు. అందుకు తోలి అడుగు ఈ చిత్రం అనే అంశం మినహా ఈ ఒక్కడినే గురించి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచిన దాఖలాలు లేవు. ఆ కోణాన్ని పరిశీలనలోకి తీసుకుని ఈ 'ఒక్కడినే' రోహిత్ కెరీర్ కు ఎంతవరకు తోడ్పాటు నిస్తుందో మన సమీక్షలో చూద్దాం.

కధ  :

 పెద్ద వ్యాపార వేత్త శివాజీ రావు (సాయి కుమార్) కూతురు శైలు పది సంవత్సరాల తరవాత ఇండియాకు వస్తుంది. ఎప్పుడు ఉండే సిటీ లైఫ్ తో విసుగు చెందిన శైలు తన ఫ్రెండ్ సుజాత సాయంతో వైజాగ్ దగ్గరలోని రామాపురం వెళ్తుంది. అక్కడ ఆమెకు సూర్య (రోహిత్) కుటుంబంతో పరిచయం కొత్త అనుభవాలను కలిగిస్తుంది. ఆ క్రమంలో సూర్య శైలు ను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తొలుత ఆలోచనలో పడ్డా తరవాత సూర్య తో జీవితాన్ని పంచుకోవటానికి సిద్ద పడ్డా శైలుకు ఒక ఊహించని నిజం తెలుస్తుంది. అదేమంటే సూర్యతో సహా అతని కుటుంబం మొత్తం 2 సంవత్సరాలా క్రితమే చనిపోయిందని..! ఈ విషయం నిజమే అయితే శైలుతో గడిపినవారు ఎవరు..? అసలు ఈ విచిత్రం వెనుక ఉన్నా రహస్యం ఏమిటి..? అన్నది మిగిలినా కధ . 

విశ్లేషణ:

'కధ ' సినిమాతో దర్శకుడిగా ప్రశంశలు అందుకున్నా శ్రీనివాస్ రాగ ఆసినిమా ప్రభావం నుండి ఇంకా కోలుకోలేదో..? లేక దర్శకుడిగా అటువంటి చిత్రాలను మాత్రమే రూపొందించాలని నిర్ణయించుకున్నాడో.. కాని ఆ సినిమాలో కనిపించిన వాతావరణనాన్నే చాల వరకు ఈ సినిమాలోను చూపించాడు. కాని జోనర్ పరంగా చూసుకుంటే.... ఒక్కడినే థ్రిల్లర్ అంశాలు కలిగిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. సో.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు యాక్షన్ అంశాలను అలరించేలా జోడించటంలో రాగ పూర్తిగా విఫలం అయ్యాడు. అలానే కధ ప్రకారం కధనానికి అవసరమైనా సస్పెన్స్ ను క్రియేట్ చేయటంలో గాని, తరవాత దాని మైంటైన్ చేయటంలో గాని, ఆ ఫై థ్రిల్ కలిగేలా దానిని రీవిల్ చేయటంలో కాని ఎటువంటి రసానుభూతిని ప్రేక్షకులకు కలిగించలేకపోయాడు. 

ఇక కధనానికి, మరో కోణం అయినా యాక్షన్ అంశాల విషయానికి వస్తే దర్శకుడికి వాటి ఫై ఏ విధమైన అవగాహనా లేదని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పేలవమైన యాక్షన్ సన్నివేశాలతోనూ, అనుభూతి కరువైనా భావోద్వేగాలతోనూ సినిమాను మొదటి నుండి చివరి వరకు నడిపించి టన్నుల కొద్ది విసుగును ప్రేక్షకుల మనసుల్లో నింపి బయటకు పంపిస్తాడు దర్శకుడు. సినిమాలో కనిపించే ఒక్క పాత్రను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేదు. మిగత వాటి సంగతెలా ఉన్న కనీసం హీరో పాత్ర వరుకన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సింది. రోహిత్ ఏదో పెద్దా ఉద్దండ నటుడైనట్టు పద్దతిగా వాడుకోకుండా అతను ఏది చేస్తే దానిని కెమెరా తో చుట్టేసి తెర ఫైకి వదిలేశారు. ఫలితం గత రెండు చిత్రాలతో పోలిస్తే రోహిత్ నటన ఈ సినిమాలో చాల నాసి రకంగా కనిపించింది. అసలు సినిమాలో అతని స్వభావాన్ని చూసి హీరోగా ఒప్పుకోవటానికి మనసు అంగికరించదు. మిగత ఆర్టిస్ట్ లు సీనియర్లు కాబట్టి పాత్రల్లో విషయం లేక పోయినా అనుభవంతో లాగేశారు. చివరికి నిత్య కూడా ఒరిజినల్ టాలెంట్ తో సినిమాను నిలబెట్టటానికి కృషి చేసింది. కానీ అనుభవ లేమికి విషయం తగ్గిన దర్శకుడు తోడై రోహిత్ ఇప్పటివరకు సంపాయించుకున్నా కొద్దో..గొప్పో... ఇమేజ్ మొత్తాన్ని ఒక్క ఉతుకులోనే మటుమాయం చేసే పరిస్థితిని తీసుకువచ్చారు. 

సాంకేతికంగా అందరు ప్రత్యేకమైనా నైపుణ్యం కలిగిన నిపుణులనే పెట్టుకున్నారు కాని వారిలో ఏ  ఒక్కరితో కూడా సమర్ధవంతమైనా పని రాబట్టుకున్న సూచనలు ఈ సినిమాలో ఎక్కడ కనిపించవు. మొత్తంగా ఒక్కడినే గురించి చెప్పాలనుకుంటే ఇది హీరో ప్రధాన యాక్షన్ చిత్రం. కాని హీరోగారి పేలవమైనా ప్రదర్శన సినిమాను నిండా ముంచేసిందనే చెప్పాలి.  అయినా కాదు.. కూడదు.. తప్పదు అనుకుంటే నిత్య మీనన్ కోసం ఒకసారి ధైర్యం చెయ్యవచ్చు. 

రేటింగ్ : 


                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం :
రోహిత్ అన్ని విభాగాలో నిరాశ పరిచాడు. నిత్య అవకాశం ఉన్న వరకు బాగా నటించింది. నాగబాబు,కోట,సాయికుమార్ తదితరులు వారి పాత్రలకనుగుణంగా బానే చేశారు. బ్రమ్మి , యం యస్ లా కామెడీ రొటీన్ గా ఉంది.  


2.5/5

దర్శకత్వం :
దర్శకుడిలో అపరిమిత అపరిపక్వత కనిపించింది. దర్శకత్వ శాఖ ఫై అతనికి మరింత పరిజ్ఞానం అవసరమేమో అనిపించింది.


2.25/5




 రచన 



కధ:
రెగ్యులర్ రొటీన్ కధే...! కాని వాడుకుంటే మంచి విషయం ఉన్నదనే చెప్పాలి. 2.5/5


కధనం:
సినిమాకు జరగాల్సిన నష్టం ప్రధానంగా ఇక్కడే జరిగింది. ఎంచుకున్నా పాయింట్ కు అనుగుణంగా మెదడుకు పదును పెట్టకుండా మూస బాట పట్టడమే నష్టానికి కారణంగా వివరణ ఇవ్వొచ్చు. 2/5 

2.25/5

మాటలు : 
 చింతపల్లి రమణ గారి మాటల్లో పదును తగ్గింది. మాటలు ఆకట్టుకులేదు. 2/5


సంగీతం 








  2.25/5

పాటలు :
కార్తీక్ పాటలు ఈ సినిమాకు పెద్ద మైనస్. ఒక్క పాట  కూడా బాగాలేదు. 2/5


నేపధ్య సంగీతం:
చిన్న బ్యాక్ స్కోర్ ఓకే ఏదో అలా ఉందంతే ..! 2.5/5



డాన్సులు:
రోహిత్ డాన్సింగ్ మెటిరియల్ కాదు, అందుకు అనుగుణంగానే డాన్సులన్ని ప్రేక్షకుల సహనం ఫై దాడి చేశాయి. 2/5  

సాంకేతికం 








 2.5/5

కెమెరా:
అండ్రూ కెమెరా కన్ను నుండి కళాత్మకత లేని అవుట్ పుట్ నిరాశ పరిచింది. 2.5/5 

ఎడిటింగ్ :
మార్తాండ్ కు కూడా అవకాశం దొరకలేదనే చెప్పాలి. 2.5/5






ఫైట్స్ : 
గణేష్ సమకూర్చిన ఫైట్స్ పరవాలేదనిపించాయి. 2.5/5

తులాభారం







  1/5


హెచ్చులు :
  • నిత్య మీనన్ మాత్రమే ఈ సినిమాకు ఒక్కగానుక్క ప్లస్ 

తగ్గులు:
  • దర్శకత్వం 
  • పాటలు 
  • హీరో నటన 
  • మూస కధ , కధనాలు 


                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  2.25/5


  
కొస మెరుపు : 


తోలి చిత్రం'బాణం'తో విమర్శకుల ప్రశంశలు, మలి చిత్రం 'సోలో'తో హీరోగా పాస్ మార్కులు వేయించుకున్నా నారా రోహిత్ ముచ్చటగా మూడో చిత్రం అయినా ఈ ఒక్కడినే తో డిజాస్టర్ రుచి ఎలా ఉంటుందో చూడబోతున్నాడు అన్నది  మాత్రమే ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోవాల్సిన అంశం.       

No comments:

Post a Comment