Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, February 11, 2013

మెగా హీరో ఎంట్రీకి 'గొల్లభామ'..?


మెగా సంస్థానం నుండి మరో యువ మెగాస్టార్ ఎంట్రీకి పావులు కదుల్తున్నా సంగతి తెలుగు సినిమాతో పరిచయం ఉన్నా వారందరికి తెలిసిందే..! మెగా తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ అరంగేట్రానికి శుభ ఘడియలు దగ్గర పడ్డాయనే సంకేతాలు ఈ మద్యనే సూచనా ప్రాయంగా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా టైటిలే అంటూ బయటకు వచ్చిన 'గొల్లభామ' కొత్త సంచలనాలకు అవకాశం ఇస్తుంది.

సాఫ్ట్ సినిమాల దర్శకుడిగా రీసెంట్ గానే ముద్రేయించుకున్నా శ్రీకాంత్ అడ్డాలా వరుణ్ చెయ్యి పట్టుకుని తోలి చిత్రాన్ని దాటించేందుకు రంగం సిద్దం అయ్యిందని నిర్ధారణపూర్వకమైన సమాచారం ప్రచారంలో ఉంది. సేతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు అంటూ టైటిల్ తోనే సగం జనాలను కట్టిపడేసినా శ్రీకాంత్ తన మలి చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్ పోట్టుకోబోతున్నట్టు ఛాంబర్ లో పేరును నమోదుచేయించి ఆ సమాచారాన్ని బయటకు పోక్కించి సినిమా ప్రియులలో ఆసక్తి కలిగించాడు. దాంతో వరుణ్ తోనే అతని చిత్రం ఉండొచ్చు కాబట్టి ఆ సినిమా కోసమే ఈ పేరు అనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయానికి బంధించి నిజానిజాల త్వరలోనే వెల్లడి కావచ్చు. 

కాకపోతే ఈ విషయం తెలిసి మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన వారందరి బుర్రలను తోలుస్తున్నా సందేహం ఒకటే .. అరేంజ్ లాంటి సాఫ్ట్ పేర్లను సరిగా రీసివ్ చేసుకోలేక పోయిన మెగా అభిమానులు గొల్లభామ లాంటి సంప్రదాయక పేరును ఎంతవరకు తలకేక్కించుకుంటారో ... అని. చూద్దాం... సినిమా మొదలవటానికి ఇంకా టైం ఉందిగా ఈ లోపు ఏమి జరుగుతుందో...? అన్నట్టు ఈ  సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై నిర్మింప చేయాలనీ నాగబాబు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు  అతి త్వరలో అధికారికంగా బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి. 

No comments:

Post a Comment