Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 7, 2013

బ్రమ్మి పోలీస్ కామెడీ



ఏ  పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతూ.. చేసే ప్రతి పాత్రతో నవ్వుల సునామి సృష్టించే మన బ్రమ్మి గతంలో చాలా సార్లు పోలిసుగా కూడా నటించి మనకు చక్కలిగింతలు పెట్టాడు. కాని గత కొంత కాలంగా ఏవో ఒకటి రెండు సినిమాల్లో మినహా పెద్దగా పోలిస్ వేషాల్లో కనిపించలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ కొరతను తీర్చి పోలీస్ కామెడీ తో మరో సారి ఆకట్టుకోవటానికి 'బాద్ షా' ఫ్లాట్ ఫామ్ ను వాడుకుంటూన్నాడని సమాచారం.

NTR  హీరోగా రుపొందుతున్నా  'బాద్ షా' లో బ్రమ్మి పోషిస్తున్నా పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ కొన్నాళ్ళ క్రితమే మొదలైంది. ఆ సినిమా రచయతలు చేసిన ప్రచారాన్ని బట్టి బ్రమ్మి బాద్ షా సినిమాకు వచ్చిన జనాల పొట్టలు చెక్కలు చేయటం ఖాయం అని వార్నింగ్ లు అందాయి. దాంతో ఈసారి ఎటువంటి కొత్త రూపులో కనిపించి నవ్విస్తాడో అని హాస్య ప్రియులంత కుతూహలం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ కుతూహలాన్ని బ్రేక్ చేస్తూ... బ్రమ్మి పొలిసు మామగా  ప్రేక్షకులను నవ్వించబోతున్నాడని తెలుస్తుంది.  

బ్రమ్మి పుట్టిన రోజును పురస్కరించుకుని బాద్ షా సెట్ లో యూనిట్ సభ్యులు జరిపిన చిన్న వేడుకలో ఆయన పోలీస్ డ్రెస్ లో కనపడటాన్ని బట్టి అంచనాలు వేస్తున్నారు కాని బ్రమ్మి పోలీస్ వేషం గురించి బాద్ షా యూనిట్ వైపు నుండి ఎటువంటి అధికారిక ద్రువికరణలేదు. ఆ వేషాన్ని ఓ సందర్భం కోసం వేశాడా ..? లేక సినిమా మొత్తం చేశాడా..? అన్నా విషయం తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే...! 

No comments:

Post a Comment