ఈమద్య మరీ నల్లపూసైపోయినా కుర్ర హీరో వరుణ్ సందేశ్ తన ఉనికిని తెలియచేయటానికి 'చమ్మకు చెల్లో .." అంటూ ఈ వారం దియేటర్లకు వచ్చాడు. విజయాల లెక్కల్లో వెనక పడ్డాడుకాని చేతిలో ఉన్నా సినిమాలా లెక్కల్లో మాత్రం ఘనంగానే ఉన్నా వరుణ్ హిట్ కోసం మొహంవాచిపోయిన్నాడు. ప్రయోగాలతో విమర్శకుల ప్రశంశాలే కాని ప్రేక్షకుల చప్పట్లు కొట్టించుకోవటంలో కాస్తా దూరాన్ని మైంటైన్ చేస్తున్నా నీలకంఠ ఈసారైనా కోలుకుని వరుణ్ కు హిటానందాన్ని అందించగలిగాడో..? లేదో..? మన సమీక్షలో చూద్దాం.
కధ :
యువ జంట హన్షు(సంచిత),శ్యామ్ (వరుణ్)ల ప్రేమ కధే ఈ చమ్మకు చెల్లో ..! టీనేజ్ లో ఫ్రెండ్ షిప్ గా మొదలైన ఈ జంట బందం పరిస్థితుల ప్రభావానా ప్రేమగా రూపుదాలుస్తుంది. తరవాత వారి పెళ్ళికి పెద్దలు కూడా ఒప్పుకుంటారు. కాని ట్విస్ట్ లేకపోతే ప్రేమకధలో కిక్ ఉండదు కాబట్టి... ఓ ట్విస్ట్ ఆ ప్రేమికుల మద్య ఉన్నా ప్రేమను పరీక్షిస్తుంది. ఆ పరీక్షను హీరో హీరోయిన్ ఏ విధంగా నెగ్గారు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ :
'చమ్మకు చెల్లో ....!' ఈ టైటిల్ లో ఉన్న చమక్కు , గమ్మత్తు సినిమా మొత్తంలో టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదు. సర్లే నీలకంఠ సినిమా కదా చమక్కులు గిమక్కులు వద్దులే అని సర్దుకుపోదాంలే అనుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నీలకంఠ మార్కు అక్కడక్కడ కనిపిస్తుంది తప్పించి మొత్తంగా మైమరపించదు.ఎప్పుడు విభిన్న కధంశాలతో ప్రయోగాలు చేసే నీలకంఠ ప్రేమకధ చేస్తున్నాడని తెలిసి అయన స్టైల్ అఫ్ మేకింగ్ ను ఇష్టపడే వారు ఆనందించారు.కాని ఈ సినిమా అటువంటి అంచనాలను ఒక్క శాతం కూడా అందుకోలేక అందరి ఆశలను ఆవిరి చేసింది.ఏదో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకునే నీలకంఠ ఈ సినిమాలో అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకపోవటమే చాలా నష్టాన్ని కలిగించింది అని చెప్పవచ్చు.
సినిమాకు ఆత్మ లాంటి కధనంలో కూడా వైవిద్యం లేకుండా నీలకంఠలాంటి దర్శకుడి చిత్రంలో వినోదాన్ని ఆశించటం అత్యాశే అవుతుంది. ప్రేమకు మానసిక పరిపక్వత అనే అంశాన్ని జోడించి రియాలిటికి దగ్గరగా స్వచ్చమైన ప్రేమకదను చూపించాలని ప్రయత్నించిన నీలకంఠ అందుకు అనుగుణంగా ముచ్చట గొలిపే రొమాన్స్ , చక్కిలిగింతలు పెట్టె నవ్వులు, సున్నితంగా డిస్ట్రబ్ చేసే భావోద్వేగాలు వంటి విషయాలకు తన స్క్రీన్ ప్లే లో పెద్ద పీట వేయకపోవటంతో ఈ సినిమాను ప్రేమకధ అని బలవంతంగా నమ్మలేకాని ప్రేమలో ఉన్న అనుభూతిని మాత్రం ఆస్వాదించలేం .
సినిమాలో కేథరీన్ పాత్ర మినహా మరే అంశము ఆకట్టుకోదు. సినిమా మొదటి సగాన్ని భరించటం కష్టమే. హీరో హీరోయిన్ ల మద్య ప్రేమ తాలూకు సంకేతాలు మొదలయ్యే సన్నివేశాలు కొన్ని తప్పించి ఫస్ట్ హాఫ్ అంత విసుగు పుడుతుంది. రెండో సగం కూడా ఇంచు మించు మొదటి సగంలానే ఉంటుంది. కాకపోతే కేథరీన్ ప్రెజెన్స్ చాలావరకు వెన్నెల కిశోర్ కామెడీ కొంతవరకు ప్రేక్షకులకు ఊరటనిస్తుంది. వారిద్దరూ మినహా సినిమాలో కనిపించే అన్ని పాత్రాలు మూసా తత్వాన్ని తగిలించుకుని నిరాశపరుస్తాయి. కధ ప్రకారం హీరోయిన్ మనస్థత్వమే స్క్రీన్ ప్లే కు ప్రాణం. కాని అలాంటి విషయాన్నీ ట్విస్ట్ లు, ముగింపు కొరకు మాత్రమే ఉపయోగించుకుని సినిమాలో ఫీల్ కు అవకాశం లేకుండా చేశారు. మాటల్లో కూడా నీలకంఠ మార్క్ పూర్తిగా కరువైంది. కిరణ్ వారణాసి పాటలు , నేపధ్య సంగీతం సినిమాకు ఏ విధంగాను ఉపయోగపడే సూచనలు కనిపించవు. మిగత అన్ని సాంకేతిక విభాగాలు సాదారణమైనా పనితనాన్ని మాత్రమే ప్రదర్శించాయి.
వరుణ్ ను నీలకంఠ కూడా హ్యాపీ డేస్ బాయ్ గానే గుర్తించటం భాదాకరం. వరుణ్ మూస నటనతో బోర్ కొట్టించాడు. సంచిత బానే ఉంది, ముఖ్యంగా ఆమె స్మైల్ ఆకట్టుకుంది. నటన పరంగా పర్వాలేదనే చెప్పాలి. స్త్రెక్చర్ విషయంగా ఈ అమ్మాయిలో మరిన్ని దిద్దుబాటు చర్యలు అవసరం. కేథరీన్ షో ను స్టీల్ చేస్తుంది. అందానికి తగ్గట్టు పర్ఫెక్ట్ బాడీ స్టర్క్చార్ తో చూపు తిప్పుకోనివ్వదు. డైలాగులు , నటన విషయంగా తప్పులు ఉన్నప్పటికీ ఆమె అందాన్ని చూసి వాటిని మన్నించేయవచ్చు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు నవ్విస్తాడు. బ్రహ్మాజీ హీరో తండ్రిగా ఆనలేదు. మిగత నటులు రొటీన్ గా పర్వాలేదనే అనిపించారు.
కొసమెరుపు:
చమ్మకు చెల్లో .. అనే పేరులో ఉన్నా స్పార్క్ సినిమాలో కనిపించక పోవటంతో వరుణ్ సందేశ్ పరాజయాల పరంపరకు మరో కొనసాగింపుగా మాత్రమే ఈ సినిమా పేరు దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మారుతీ టాకీస్ రేటింగ్ : 2.25/5

No comments:
Post a Comment