Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 8, 2013

Prabhas Mirchi Movie Review
















Mirchi Voice Review

గత సంవత్సరం రెబెల్ సినిమాతో అభిమానుల్లో అంతులేని నిరాశను నింపిన ప్రభాస్ ఆలస్యం చేయకుండా ఆ విషాదానికి తెరదించి తక్షణ ఉత్సాహాన్ని వారికి కలగాజేయాలనే ఉద్దేశంతో 'మిర్చి' సినిమాతో ఈ వారం దియేటర్లకు వచ్చాడు. కొత్తగానూ, ఫ్రెష్ గాను కనిపిస్తూ కావలసినంత ప్రచారాన్ని కూల్ గా సంపాయించుకున్న 'మిర్చి' అంతే కూల్ గా జనాల దగ్గరకి వచ్చింది. 

ఈ సినిమా తరవాత ఏడాదిన్నర వరకో,రెండేళ్ళవరకో ప్రభాస్ వెండి తెర మీద  కనిపించే అవకాశం లేదు అన్నా అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ సినిమా ఫై అయన అభిమానులు బోల్డంత ఆసక్తిని కనబరుస్తున్నారు. బాహుబలి పుణ్యమా అని కలక్షన్లు,రికార్డులు గట్రా వంటి అంచనాల పరిది నుండి మినహాయింపబడ్డ మిర్చి, ఓ రెగ్యులర్ ఎంటర్ టైనర్ లా వినోదం పంచితే చాలు అని అందరు భావించారు. మరి ఈ భావానుభుతిని నెరవేర్చటంలో  మిర్చి ఎంతవరకు సఫలం అయ్యిందో మన సమీక్షలో చూద్దాం.

కధ : 

ఇటలీ లో ఉంటున్నా జై (ప్రభాస్) కు మానస(రిచా)తో పరిచయం స్నేహాన్ని దాటి ప్రేమ పట్టాలెక్కుతుంది. తనతో ఉంటూ కూడా ఆనందాన్ని అనుభవించటానికి ఇష్టపడని మానస జీవితంలో సంతోషాన్ని నింపటానికి ఇండియా వచ్చి, పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ నీడలో కరుడుగట్టిన ఆమె ఫ్యామిలిని మార్చే పని మొదలు పెడతాడు జై . బండరాళ్ల లాంటి ఆ మనుషులను మార్చటం కష్టమే అయినప్పటికీ మానస అన్నాతో మొదలు పెట్టి ఒక్కొక్కరిగా కుటుంబంలో అందరిని మారుస్తాడు. కాని మానస బాబాయి ఉమాని మాత్రం మార్చలేకపోతాడు. మారిన కుటుంబ సభ్యులు మానసను జై కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అందుకు ఒప్పుకొని జై మానసతో తానూ వారి కుటుంబ శత్రువు దేవా (సత్యరాజ్) కొడుకునని బయటపెడతాడు.  శత్రువై వుండి ఈ కుటుంబాన్ని జై ఎందుకు మార్చాలనుకున్నాడు ..? అసలు జై గతం ఏమిటి..?  అన్న ప్రశ్నలకు సమాదానలే ఈ సినిమా మిగిలిన కధ .

విశ్లేషణ : 

ఓ కాకలు తీరిన మాటల రచయత దర్శకత్వం వహిస్తే సినిమా ఎలా ఉంటుందో .. అలానే ఉంది మిర్చి...! అంటే బలమైన మాటలను పునాదులుగా వేసుకునే కొరటాల శివ ఈ సినిమాకు జీవాన్ని తీసుకొచ్చాడు. దర్శకత్వం పరంగా కొన్ని లోపాలు కనిపించినప్పటికీ మొదటి ప్రయత్నం కాబట్టి మెచ్చుకోతగిన విధంగానే ఉందని చెప్పాలి ముఖ్యంగా సాంకేతిక విభాగాల నుండి శివకు అందిన సహకారం మాత్రం అద్భుతం. అతనే వాటిని సమర్ధవంతంగా వాడుకున్నాడో .. లేక నాకు ఇలా కావాలి అని చెప్పి పూర్తీ స్వేఛ్చ వాటికి ఇచ్చాడో కాని .. టెక్నికల్ గా చూడ ముచ్చట కనిపించి ముద్దోచ్చేస్తుంది. 

కధ ,సినిమా మొదటి సగం రొటీన్ గా అనిపిస్తాయి కాని రెండో సగంలో  శివ చేసిన ట్రీట్మెంట్ కు ప్రభాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తోడై సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. నెమ్మదిగా సినిమాను మొదలు పెట్టి ఒకదాని తరవాత ఒకటిగా కధలోని కీలక అంశాలను బయట పెడుతూ అంచల వారిగా సినిమా ఫై ఆసక్తిని కలిగించే విధంగా స్క్రీన్ ప్లే ను రూపొందించుకున్నా శివ మొదటి సగం లో హీరో చేతులు కట్టేయటంతో చాలా సన్నివేశాలు బోరింగ్ గా నడిచాయి. కాకపోతే ఆ గ్యాప్ ను వినటానికి పసందుగా, చూడటానికి కన్నుల పండవగా ఉన్న పాటలు చాలా వరకు, బ్రమ్మి కామెడీ కొంతవరకు ఫిల్ చేశాయనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు ఎంచుకున్న పేలవ మంత్రం అదిరిందనిపించాల్సిన ఇంటర్వెల్ బాంగ్ ను నీరు గార్చింది. 

దాంతో శివ దర్శకత్వ అరంగేట్రం ఫై అనుమానాలు బయలుదేరతాయి. కాని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ షాకింగ్ గా సెకండ్ హాఫ్ లో తన కలానికి ఉన్న రెండో వైపు సామర్ద్యాన్ని సమర్ధవంతంగా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రధానంగా తండ్రిని కామెంట్ చేసినప్పుడు శత్రువుల ఫై ప్రభాస్ విరుచుకు పడే సన్నివేశాలు రోమలను నిలబెడతాయి. అలానే తన పెళ్లి జరుగుతున్నప్పుడు శత్రువులా యటాక్ ను ప్రభాస్ ఎదుర్కునే ఎపిసోడ్ అయితే ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంది. అలా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఉద్వేగభారితమైనా భావోద్వేగాలతో భలే పసందుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రోటీనాతి రొటీన్ గా ఉండి కాస్తా నిరాశ పరుస్తుందికాని ప్రస్తుత ట్రెండ్ సూత్రం ప్రకారం అలా తప్పించి ..వేరేలా సినిమాను ముగించటానికి ఆస్కారం లేదనే విషయాన్నీ గ్రహించి మనమే సర్దుకుపోవాలి. ఓవర్ అల్ గా సినిమా మాత్రం ఎటువంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా మొత్తం మాస్ ఆడియెన్స్ ను లాభాలు తెచ్చే మేరా క్లాస్ ఆడియన్సు ను అలారించేలానే కనపడుతుంది. 

రేటింగ్ : 


                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం :
  ఫుల్ లెంగ్త్  ప్రభాస్ మార్క్ ఎంటర్ టైనర్ గా మిర్చిని అభివర్ణించ వచ్చు. సినిమా సినిమాకు ప్రభాస్ లో యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ లెవల్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ అందచందాలు హీరోయిన్ లను డామినేట్ చేశాయి. ముఖ్యంగా ప్రభాస్ కాస్ట్యూమ్స్ సూపర్ గా కుదిరాయి. డాన్సులు రెగ్యులర్ గానే ఉన్నాయి కాని , ఫైట్స్ మాత్రం చినగోట్టేశాడు. అబ్బో.. పెళ్లి జరుగుతున్నప్పుడు వచ్చే యాక్షన్ ఘట్టంలో అయితే ప్రభాస్ లో నరసింహ స్వామిని చూస్తాం. ప్రభాస్ కోసమైతే ఈ సినిమాను ఎన్నిసార్లైనా చూడొచ్చు. అనుష్కది అతడులో త్రిష పాత్రను పోలి ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రమే కనిపించే అనుష్క పాత్ర కొద్దిసేపే ఉన్నట్టు అనిపిస్తుంది కాని బావుంది. కాటుక కళ్ళా పాటలో ఆమె చాలా అందంగా కనిపించింది. బోద్దమ్మాయి రిచా పోను పోను మోద్దమ్మాయి అయిపోతుంది. ఆవిడా నటనేమిటో..? డాన్సు లేమిటో ..? అసలు ఆవిడా హీరోయిన్ ఏమిటో అని అనిపిస్తుంది. సత్య రాజ్ చాలా చాలా మంచి పాత్రలో కనిపించాడు. సూపర్ గా దేవా పాత్రను పోషించాడు. అయన ఒద్దికైనా నటన , బాలన్సుడ్ హావభావాలు ఆ పాత్రకు బోలెడంత హుందాతనాన్ని తీసుకొచ్చాయి. బ్రమ్మి కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. రఘు బాబును సరిగా వాడుకోలేదు. మిగత నటులు వారి పాత్రలకుఅనుగుణంగా బాగానే చేశారు.       








3.25/5

దర్శకత్వం :




3.25/5

మిర్చి తో శివ విషయం ఉన్నా దర్శకుడిగా గుర్తింపు పొందుతాడు అని చెప్పటానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. చాలా మంది సో కాల్డ్ మాస్ దర్శకుల కంటే శివ బెటర్ అనిపించుకున్నాడు. శివ టాలెంట్ ను ఈ సినిమాలోని  మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని బేరీజు వేయవచ్చు. అవి ఏమిటంటే .. హీరో , అతని తండ్రి పాత్రలను తీర్చి దిద్దినా వైనం, పాటలను చిత్రీకరించిన పద్దతి, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పెళ్లి లో యాక్షన్ ఎపిసోడ్,, చాలు ఇవి చాలు శివ ప్రతిభ ఏంతో తెలుసుకోవటానికి..! అన్నిసాంకేతిక విభాగాలను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. కధలో కొన్ని హిట్ సినిమాలా పోలికలు కనిపిస్తున్నప్పటికీ కధనంలో తన మార్క్ ను ప్రదర్శించి ఉనికిని చాటు కున్నాడు.       



 రచన 



కధ:
రెగ్యులర్ మూసా  కధే..! భద్ర, బృందావనం, ఇలా చాలా సినిమాలా పోలికలు కనిపిస్తాయి.  2.5/5


2.75/5

కధనం:
ఫస్ట్ హాఫ్ , క్లైమాక్స్ సరిగా లేక పోయినా ఫ్లాష్ బ్యాక్ ను మాత్రం పకడ్బందిగా తాయారు చేశారు. 3/5

మాటలు : 
పంచ్ డైలాగులకు పెద్దగా చోటు లేదుకాని కదానుగుణంగా మాటలు బానే అనిపించాయి. 2.75/5


సంగీతం 









3.5/5


పాటలు :
దేవి మ్యాజిక్ కొనసాగుతుంది. పాటలన్నీ అదిరి పోయాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా బాగుంది. ముఖ్యంగా పండగలా పాటైతే అల్టిమేట్ గా ఉంది. 3.5/5


నేపధ్య సంగీతం:
దేవి స్టైల్ లో బానే ఉంది కాని కొత్తగా మాత్రం లేదు. 2.75/5  



డాన్సులు:
ఆరు పాటలను చాలా చక్కగా చిత్రీకరించారు. ప్రతి పాటను ఎంజాయ్ చేస్తాం. ఏదేదో బాగుందే.. పండగలా పాటలు హై లైట్. 4/5  

సాంకేతికం 










3.25/5

కెమెరా
మది సినిమాటోగ్రఫీ సింపుల్ గా అదిరిపోయింది. ప్రతి ఫ్రేం లో అతని మ్యాజిక్ కనిపిస్తుంది. 3.5/5

ఎడిటింగ్ :
కధ ఫీల్ కు  అనుగుణంగా  ఎడిటింగ్ బానే ఉంది. 3/5 

ఆర్ట్ : 
ఎ యస్ ప్రకాష్ కంప్లీట్ మిర్చి వాతావరణాన్ని చాలా కొత్తగా చూపించాడు. డార్లింగే .. పాట సెట్ సూపర్ గా ఉంది. 3/5



ఫైట్స్ : 
ఇంటర్వెల్ బాంగ్ అలరించలేదు కాని .. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన అన్ని ఫైట్స్ బాగా వచ్చాయి. 3/5

తులాభారం







3/5


హెచ్చులు :
  • ప్రభాస్ మ్యాజికల్ పెర్ఫార్మన్స్ 
  • ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు 
  • పాటలు, వాటి చిత్రీకరణ 

తగ్గులు:
  •  మూసా కధ , పూర్ క్లైమాక్స్  
  • కామెడీ సరిగా లేకపోవటం 


                         మారుతీ టాకీస్  రేటింగ్    :  3.25/5



   కొసమెరుపు : 

ఒంగోలు గిత్త వెనకడుగు వేయటంతో ఖాళీగా ఉన్నా బాక్స్ ఆఫీసు పిచ్ ను చెడుగుడు ఆడుకునే అవకాశం మిర్చికి దక్కింది. హిట్ అనిపించుకోవటానికి అవసరమైన హంగు ఆర్భాటాలు పుష్కలంగా ఉన్నా మిర్చి కలక్షన్లను ఓ రేంజ్ లో కొల్లగొట్టే అవకశాలు బాగానే కనపడుతున్నాయి. కాకపోతే ఎ స్థాయిలో ఉంటుంది అన్నా విషయం ఫై రెండు వారాలు గడిస్తే కాని స్పష్టత రాదు. 

No comments:

Post a Comment