'బహుబలి' చిత్రాన్ని బ్రహ్మాండం గుర్తించతగ్గ చిత్రంగా మలచటానికి దర్శకధీరుడి ప్రయత్నం మొదలైంది. ఏ పనిని మొదలు పెట్టినా భగీరదుడితో సమానంగా కృషి చేసే రాజమౌళి 'బహుబలి' చిత్రీకరణకు సంబంధించి అనువైనా లోకేషన్స్ కోసం యావత్భారత దేశాన్ని జల్లెడ పడుతున్నాడు. కర్ణాటకలో మొదలైనా ఈ అందమైనా ప్రాంతాల వేట కేరళ మీదుగా పయనించి ఇప్పుడు రాజస్తాన్ చేరుకుంది.
ఈ ప్రయాణానికి సంబంధించి రాజమౌళి ఇప్పటివరకు పంచుకున్న అనుభవాలను మనము పరిశీలిద్దాం...
మగధీర రోజులను తలపిస్తున్నాయంటూ లోకేషన్స్ వెతుకులాట గురించి మురిపంగా చెబుతున్నా రాజమౌళి ఆయన సహచరులతో కలసి ప్రస్తుతం రాజస్తాన్ లో ఉన్నారు. ఫైన ఫోటోలో కనిపిస్తున్నా చెట్టును రాజస్తాన్ జీవనదారిగా చెబుతున్నారు. కెజ్ధా అనే ఈ చెట్టు పూలు, పళ్ళను కోకిన్ తయారీలో ఉపయోగిస్తారని, ఆకులు ఒంటెలకు ఆహారం అని, అలానే కలపను ఫర్నిచర్ తయారిలోను ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు.
కేరళలోని కలడి టౌన్ సమీపంలో ఉన్న పెరియార్ నది పరివాహ దృశ్యాలను బందించిన రాజమౌళి కన్ను.
కేరళ లోని అట్టిరపల్లీ వాటర్ ఫాల్స్ ను పరిశీలిస్తున్నా రాజమౌళి.
రాజుల, రాజ్యాల నేపద్యంగా జానపద చిత్రంగా బహుబలిని ఆవిష్కరించటానికి రాజమౌళి మొదలు పెట్టిన సరికొత్త సాహసంలో ప్రభాస్, రానా , అనుష్కలు కూడా భాగం తీసుకున్నారు. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.




No comments:
Post a Comment