పవిత్ర అనే పేరు పెట్టుకుని వేశ్య వృత్తిని నైపుణ్యంతో నిర్వహిస్తునట్టు కనిపిస్తున్నా కధానాయకి రొటీన్ గానే సొసైటీ ఫై సెటైర్లు వేయటానికి సిద్దం అయ్యింది. కొన్ని గంటల క్రితమే బయటకు వచ్చిన పవిత్ర సినిమా ఫస్ట్ లుక్ టీజర్స్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
పడుపు వృత్తిని, శ్రేయ అందాలను ఆసరాగా చేసుకుని నేటి సమాజంలో జనాలందరికీ అలవాటైపోయిన కొన్ని సామజిక తప్పులఫై సిలబస్ తయారుచేసుకుని, దానిని శ్రేయతోనే ప్రైవేట్ గా స్పెషల్ క్లాసులు చెప్పించటానికి ఈ పవిత్ర సినిమా దర్శకుడు జనార్ధన మహర్షి రెడీ అయినట్టు ఈ ట్రైలర్స్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. టీజర్స్ తో అనుకున్నంత ఆసక్తి కలిగించలేకపోతున్నా ఈ పవిత్ర రేపు వెండి తెర మీద ఏమి చేయనుందో.... వేచి చూడాలి.
శ్రేయ 'పవిత్ర ' టీజర్స్ .....
No comments:
Post a Comment