ఎన్టీఆర్ బాగా ఆనందపడిపోతున్నాడు...! ఫైనా కనిపిస్తున్నా ఫోటో చూశారుగా.... అదే రేంజ్ లో తన కొత్త సినిమా బాద్ షా గురించి జరుగుతున్నా ప్రచారాన్ని, అందుకు అనుగుణంగా ప్రేక్షకులలో పెరుగుతున్నా అంచనాలను చూసుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. కాకపోతే ఈ సంతోషం వెనుక నమ్మకంతో పాటు భయం కూడా ఉండటం కొసమెరుపు.
నమ్మకం శ్రీనువైట్ల దర్శకుడుగా ఉండటం అయితే.. భయం ఎందుకంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ ప్రస్తుత మార్కెట్ ను మించి ఖర్చు పెట్టటం..! శ్రీనువైట్ల ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకునే నిర్మాత ఈ సినిమాకు ఇంత బడ్జెట్ ను కేటాయించినప్పటికీ సినిమా అటో ఇటో అయితే ప్రధమంగా అపప్రదను మూటగట్టుకోవాల్సింది జునియరే. ఎందుకటే ఎన్టీఆర్ మార్కెట్ స్టామినాను బట్టి అతని సూపర్ ప్లాపులు కూడా అతి తక్కువ నష్టాలను మాత్రమే పంపిణిదారులకు కలిగించాయి. అలాంటిది ఈ బాద్ షా తో భారి పరాజయాన్ని కనుక చూడాల్సి వస్తే ఎన్టీఆర్ ఇమేజ్ కు డామేజ్ పడుతుందేమో అన్నది చిన్న భయం.
కాని శ్రీనువైట్ల ఫామ్ లో ఉన్నాడు కాబట్టి సినిమాను మినిమం గ్యారంటి వర్గంలో చేర్చవచ్చు అన్నా రిపోర్ట్స్ ను ఆధారంగా చేసుకుంటే ఎన్టీఆర్ గత చిత్రాల రికార్డులను ఈ బాద్ షా తిరగరాయటం ఖాయంగానే కనిపిస్తుంది. ఇలాంటి సానుకూల సంకేతాలతో పాటు సినిమా బాగా వచ్చింది అన్నా ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్స్ ను బట్టి ఎన్టీఆర్ ఫుల్ ఖుషి గా ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం ... ఎన్టీఆర్ సంతోషాన్ని బాద్ షా ఎంత వరకు నిలబెడుతుందో ...!

No comments:
Post a Comment