సినిమా ఫై పెట్టుకున్నా అన్ని అనుమానాలను నిజం చేసి సరి కొత్త రికార్డ్ సృష్టించాడు మిస్టర్ పెళ్లికొడుకు. ఊహామాత్రంగా పెంచుకున్నా అన్ని అంచనాలను పొల్లుపోకుండా అందుకుని అప్పలరాజు తరవాత ఆ రేంజ్ సినిమా ఈ మిస్టర్ పెళ్లికొడుకే అని హీరోగా తనకున్న ఏకైక అట్టర్ ప్లాప్ కు మరో తోడూ తెచ్చుకున్నాడు సునిల్.
ఈ సినిమా ప్రధానంగా తెలియజేసింది ఏమిటంటే.... విషయం ఉన్నా హిందీ సినిమాలను రీమేక్ చేయటం ఇప్పుడున్నా తెలుగు దర్శకుల వల్ల కాదని..! లాజిక్ లేని కామెడీ సినిమాలు తీసి జబ్బలు చరచుకునే వాళ్ళేకాని సున్నితమైనా అంశాలను సుతిమెత్తగా ప్రేక్షకులకు తెలిజేప్పగలిగే సత్తా వారికి లేదని...! బ్లేడ్ బాబ్జి లాంటి సినిమాలతో పేరడీ హాస్యాన్ని పండించి హిట్లను వెనకేసుకున్నా దేవి ప్రసాద్ తనకు సంబంధం లేని విషయాన్నీ చర్చించాలని ప్రయత్నించి ఈ పెళ్ళికొడుకును అర్ధం లేని సినిమాగా తాయారు చేశాడు. మొదటి తప్పుగా తెలుగు నేటివిటికి అంతగా సరిపడని నేపద్యాన్ని కధ వస్తువుగా ఎంచుకుని మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాను ముంచటానికి శ్రీకారం చుట్టాడు దేవి ప్రసాద్, ఆ తరవాత కధ డిమాండ్ ప్రకారం కాకుండా కధకు ఏ మాత్రం సూట్ అనిపించని హీరో హీరోయిన్ లను పెట్టుకుని మొదటి తప్పుకు తోడును తెచ్చాడు. అలా మొదలైనా తప్పుల తతంగం సినిమాలోని అన్ని విభాగాలకు వ్యాపించి ఈ సినిమా ఫై ఆశలు పెట్టుకున్నా వారి దుంపతెంచింది.
సునీల్ కూడా కధదేముందిలే జానాలు నా డాన్సులు చూడటానికి వస్తున్నారు అన్నా భ్రమలో ఉన్నాడేమో అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని ఈ సినిమా ఫలితం తెలియజేస్తుంది. ఎందుకంటే సునీల్ కామెడీ చాలా వరకు డాన్సులతో కొంతవరకు మెప్పించినంతగా నటుడిగా సెంటిమెంట్ తో కాని మరే ఇతర భావోద్వేగపరంగా కాని నొప్పించింది లేదు, మెప్పించింది లేదు...! అలాంటిది ఈ సినిమాలో సెంటిమెంట్, రొమాన్స్ వంటి అంశాలను ట్రై చేసి దారుణంగా విఫలం అయ్యాడు. ఇక డాన్సుల విషయానికి వస్తే వీపరీతంగా కష్టపడ్డాడు. కాని పాటలు బాగోకపోవటంతో ఆ కష్టం అంత బూడిదలో పోసిన పన్నిరైంది. అలానే నటన అనే పదానికి ఇంకా స్పెల్లింగ్ దిద్దుతున్నా ఇషా చావ్లాకు ఓ మంచి పాత్రను ఇచ్చి ఆ పాత్ర పరువు తీశారు. తను వెడ్స్ మను లో ఆ పాత్రను కంగన డీల్ చేసిన విధానం అద్భుతం, కధలో చేర్చిస్తున్నా అంశానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది ఆమె, కంగన చేసిన ఆ పాత్రను నిజ జీవితంలో కనిపించే మనుషులతో ప్రేక్షకులు పోల్చుకోగాలిగారు కాబట్టే ఆ సినిమా అంత విజయం సాదించగలిగింది. కాని ఈ సినిమాలో ఇషా ప్రవర్తన చిరాకు పుట్టిస్తుంది.
అంతే కాదు దర్శకుడు కనీసం తన ట్రేడ్ మార్క్ కామెడీని సినిమాలో ఇమడ్చాలేకపోవటం కూడా ఈ సినిమాకు జరిగిన పెద్ద అన్యాయంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పేదేమిటంటే... ఈ పెళ్ళికొడుకు అన్ని తీరులుగా నిరాశ పరిచేవాడేకాని ఏ రకంగాను వినోదాన్ని పంచేవాడు కాదని...! చివరిగా సునీల్ కు ఓ ఉచిత సలహా... చిరంజీవిని ఒట్టి డాన్సులు మాత్రమే చూసే మెగాస్టార్ అని అనలేదు..... మంచి కధలు దొరకటం, వాటికి తగ్గట్టు తన టాలెంట్ ను ప్రదర్శించటం జరిగింది కాబట్టే ఆయన మెగాస్టార్. డాన్సులు పరంగా చిరంజీవే తనకు స్పూర్తి అని చెప్పే సునీల్ మిగత అన్ని అంశాలు కలిస్తేనే హీరో అనిపించుకోగలం అని అర్ధం చేసుకుని ఈ సినిమా ఫలితాన్ని పాఠంగా తీసుకుని మూసతనానికి టాటా చెప్పి...సరికొత్తగా ప్రణాళికలు వేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు కృషి చేయాలనీ...!

No comments:
Post a Comment