బొమ్మరిల్లు సినిమా విడుదల తరవాత ఓ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారు మొగిపోయింది. ఆ పేరు దర్శకుడు భాస్కర్ ది. ఆ సినిమా చూసి భాస్కర్ ను పొగడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. ఆ సినిమా తరవాత మరో రెండు సినిమాలు చేసినాకూడా ఇప్పటికి అతని టాలెంట్ కు కొలమానంగా బొమ్మరిల్లు సినిమానే పరిగణిస్తూ బొమ్మరిల్లు భాస్కర్ గా అతన్ని పిలవటం పరిపాటి అయ్యింది. బొమ్మరిల్లు ఘన విజయం సాదించటానికి కానివ్వండి.. 'పరుగు' పరవాలేదనిపించటానికి కానివ్వండి... మొన్నిమద్యనే వచ్చిన 'ఆరెంజ్' పరాజయం పాలవ్వటానికి కానివ్వండి... భాస్కర్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణమే అందుకు కారణం.
అదేమంటే భాస్కర్ తన పనికి సంబంధించి ఓ పట్టాన సంతృప్తికి రాలేడు. కధ కాని, సీన్ కాని ఎంత బాగా అనిపించినా సర్దుకుపోకుండా చివరి నిమిషం వరకు ఇంకా బెటర్ కోసం ప్రయత్నిస్తుంటాడు అని అతన్ని దగ్గరిగా పరిశీలించిన వారు చెబుతారు. దాంతో ఒకోసారి బాగోని సన్నివేశాలు బాగుపడొచ్చు.. మరోసారి మంచిగా ఉన్నవి చెడిపోవచ్చు. అలా భాస్కర్ తత్వానికి నిదర్శనంగా ఒక పక్క 'బొమ్మరిల్లు' ఉంటే , మరో పక్క అరేంజ్ ఉంది. కాని ఆ పద్ధతినే తన సక్సెస్ సూత్రంగా నమ్ముతున్న భాస్కర్ తన తరవాతి చిత్రం ఒంగోలు గిత్తలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు సాఫ్ట్ సినిమా లతో ప్రేక్షకుల మనసులో సాఫ్ట్ కార్నెర్ సంపాయించుకున్న భాస్కర్ తొలిగా ఒంగోలు గిత్త అంటూ గుంటూరు మిర్చి ఘాటును రుచి చూపించటానికి సిద్దం అవుతున్నాడు. మాస్ సినిమాలలో లాజిక్కులు కంటే మాజిక్కులకే విషయం ఎక్కువ. సో... 'చెక్కిఫయింగ్' (రామ్ మొన్ననే ట్విట్టర్ లో దర్శకుడు నిర్మాతతో కలిసి సినిమాను 'చెక్కిఫయింగ్' చేస్తున్నాడు అని వ్రాశాడులే..!) అంటూ సినిమా గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా సూటిగా సుత్తిలేకుండా సినిమాను రూపొందిస్తే చూసి ఆనందిస్తామని రామ్ ను ఇష్టపడే మాస్ అభిమానులు భాస్కర్ కు తెలియజేస్తున్నారు.

No comments:
Post a Comment