దక్షిణ భారత సినీ పరిశ్రమలలో నటుడు అనిపించుకున్న ప్రతివాడు మణిరత్నం చేతిలో ఓ సారి నలగాలని ఆశపడతాడు ..అది నిజం. కాని మణిరత్నం మాత్రం ఎవరినిపడితే వాణ్ణి పట్టుకుని సానబెట్టాడు. కధ డిమాండ్ చెయ్యాలి... స్క్రిప్ట్ పట్టుపట్టాలి.. ఇవే ప్రధానాంశాలు ఆ తరవాత కొత్తోడవని.. పాతోడవని అదృష్టం వాణ్ణి వెంటాడుతు వస్తుంది ఆ ఫై వాణ్ణి వెతుక్కోవలసింది చుక్కల్లోనే,,,! ఇప్పుడు ఆ అదృష్టం న్నిన్నటితరం నటుడు కార్తిక్ కొడుకు గౌతమ్ కు పట్టింది.
కడలి అని పేరు పెట్టి మణిరత్నం ఓ ప్రేమ కధ తెర కేక్కిస్తున్నాడని తెలిసి మణిరత్నం మార్క్ రొమాన్స్ ను ఆస్వాదించే ప్రతిఒక్కరు మురిసిపోయారు. ఇప్పుడు ఆ మురుపు తీరే సమయం దగ్గర పడింది. ఇప్పటికే రెహమాన్ 'నింజ్జకల్లె ..' పాటతో సినిమా మీద ఆశలను చిగురింప చేశాడు. తాజాగా ఇప్పటివరకు దాపెట్టిన హీరోను బయటకు తీసుకు వచ్చి మరింత ఉత్సాహాన్ని పెంచారు. హీరో ను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో గౌతమ్ స్టైలిష్ గా కనపడుతూ ఆకట్టుకుంటున్నాడు.
కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే... ఇప్పటివరకు మణిరత్నం రూపొందించిన ప్రేమ కధ సినిమాలలో హీరోలు చాల సాఫ్ట్ గా , కూల్ గా , సింపుల్ సిటీ కి మేనల్లుడిలా కనిపించేవారు. కానీ ఈ కడలి సినిమాలో హీరో అందుకు పూర్తీ భిన్నంగా చాలా స్టైలిష్ గా కనపడుతున్నాడు. కాని ఇది పోస్టర్ వరికేనో... సినిమాలో కూడా ఉంటుందో.. తెలియాలి. ఇక పొతే ఓ పద్దతి గా వాయిదాల ప్రకారం పబ్లిసిటీ చేస్తున్నా ఈ సినిమా రూపకర్తలు రాధా కూతురు తులసిని ఎప్పుడు బయటకు తెస్తారో... వేచి చూడాలి.

No comments:
Post a Comment