మగధీర తరవాత కాజల్ కనిపిస్తే చాలు కళ్ళలో మెరుపు, మనసులో మురుపు చటుక్కున ప్రత్యక్షం అయ్యేవి. కాని ఈ మద్య ఎందుకనో ఆమె చూస్తుంటే ఎప్పుడు చూసే కాజలేగా అని రొటీన్ గా అనిపించటంతో పాటు కొద్దిపాటి పరిశీలనకే అమ్మడిలో ఏదో తగ్గుతుంది అని అనిపించక మానదు.
మనసు ఉండబట్టక ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తే... ఆమె నవ్వులో పళ్ళు తప్ప జీవం కనిపించటం లేదు. ఒంటి ఒంపుల్లో వన్నె తగ్గి వాడిపోయిన అంజలినా జోలిలా కనిపిస్తుంది. ఆమెకు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నా తరవాత మారిన రూపు కాజల్ లో ఇప్పుడే కనిప్సిస్తుంది. ముఖంలో కళ తప్పింది.... మనిషిలో తాజాదనం తగ్గింది.... మొత్తంగా కాజల్ అమ్మాయి నుండి ఆంటీగా మారిపోయే రోజులు దగ్గర పడ్డాయని అనిపిస్తుంది.
అందుకు ఫ్రెష్.. ఫ్రెష్... నిదర్శనం సారోచ్చారు సినిమాలో కాజల్ కనిపిస్తున్నా తీరే...! కావాలంటే ఆ సినిమాలోని ఈ ఫోటోలను ఓ సారి జాగ్రత్తగా గమనించండి మీకే అర్ధం అవుతుంది. నప్పని డ్రస్సు లనో.. మేకప్ అనో... వంకలు చెప్పటానికి వీలులేదు ఎందుకంటే ఏదో తెలియని విచారం కాజల్ ముఖం మీద తాండవం చేస్తున్నట్టు ఆమె ఎక్స్ ప్రేషన్స్ సాక్షం చెబుతున్నాయి. దాని కారణంగానే అరువు తెచ్చుకున్న అందాలు కూడా ఆమెను అందంగా చూపెట్టలేకపోతున్నాయి. ఈ సినిమా వరకు అయితే పరవాలేదు ఎందుకంటే రవితేజ కాబట్టి శృతిలో కలిసిపొద్ది. కాని తరవాత వచ్చే రామ్ చరణ్ 'నాయక్', యన్ టి అర్ 'బాద్షా' సినిమాలలో కనుక అమ్మడు ఇదే అవతారంతో దర్శనం ఇస్తే సహించటం చాలా కష్టం అవుతుంది.


No comments:
Post a Comment