Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, December 16, 2012

ఆ ఇద్దరిని ముందు వరసలో నిలబెట్టిన దేవరాయ..!


సినిమాలకు హిట్టు.. ఫట్టు ఉన్నట్టుగానే... సినిమాలలో పనిచేసే వాళ్ళకి పేరు రావటం, పేరు పోవటం అనే సంగతులు ఉంటాయి. వాటిని  బట్టే వారి భవిష్యత్తు స్లో గానో , ఫాస్ట్ గానో... మూవ్ అవ్వటమో లేదా ఆగిపోవటమో ... జరుగుతుంది. కాని సినిమాకు పనిచేసే అందరికి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పలేం..! మహా అయితే ఓ సినిమాలో ఇద్దరికో.. ముగ్గిరికో ఆ అదృష్టం దక్కే అవకాశం ఉంది. ఈ మధ్యే విడుదలైన దేవరాయ చిత్రం తో సంగీత దర్శకుడు చక్రి, హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ ఓ ఘనతను దక్కించుకుని ముందు వరసలో నిలుచున్నారు.
 
ముందు వరస అంటే వాళ్ళేదో అద్భుతంగా  టాలెంట్ ను ప్రదర్శించి టాప్ లో నిలుచున్నారేమో .. అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మొదటి స్థానాన్ని ఆక్రమించింది ది వరస్ట్ పెర్ఫార్మన్స్ అనే కేటగిరి కిందా..! దేవరాయ సినిమాలో వీళ్ళా టాలెంట్ ను చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని చాలా మంది వాపోతున్నారు. 50 సినిమాలకు ఫై గా సంగీతాన్ని అందించిన చక్రి నుండి ఈ రేంజ్ ప్లాప్ ఆల్బం ను ఎవరు ఊహించరు అని ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా భాదపడుతున్నారు. ట్యూన్ కు, వాయిద్యాలకు , సాహిత్యానికి ఒకదానికొకటి సంబంధం లేకుండా దేనికదే వాటి శక్తి  మేరా ప్రతాపాన్ని చూపించటం ఎలా సాద్యం అయ్యిందా అని సంగీత ప్రియులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

క మీనాక్షి విషయానికి వస్తే దేవరాయకు మునుపు అమ్మడిది ఒక ఐటెం సాంగ్ (దూకుడు ఫస్ట్ సాంగ్) వయసు. ఆ మాత్రానికే ఆమె ని పెద్ద నటి అనుకుని ఓ ప్రాధాన్యత ఉన్నా పాత్ర కట్టబెట్టటం దర్శకుడి తప్పే అనుకోండి. కాని తెర మీద కనిపించి ఓనమాలు తెలియని నటనతో... భరించలేని ఎక్స్ ప్రేషన్స్ తో జనాలను చావా గొట్టినందుకు ఆమె కు నంబర్ వన్ ఇవ్వాల్సిందే..! అరె..! అమ్మాయి అయ్యుండి  కూడా సిగ్గు పడటం తెలియకపొతే ఎలా చెప్పండి. ఆమె సిగ్గు పడుతుంటే అదుర్స్ సినిమాలో రమప్రభను చూసి బ్రమ్మి 'మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది' అంటాడు చూడండి..! అలాంటి పరిస్థితే మనకు ఎదురవుతుంది. 

చివరిగా చెప్పేదేమంటే...హాలీవుడ్ లో లాగా వరస్ట్ పెర్ఫార్మెన్స్ కు అవార్డులు పెడితే వీళ్ళిద్దరూ ఉన్నా అన్ని అవార్డులను కొల్లగోట్టటం ఖాయం అని ఔత్సాహికులు అనుకుంటున్నారు.    

No comments:

Post a Comment