కొత్త పనోడు పొద్దెరెగడంటా..! అలానే ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కొత్త నిర్మాత సంగతి. నిర్మాతగా అనుభవం లేకపోయినా కలసి వచ్చిన అర్హతతో వరస పెట్టి స్టార్ హీరోలు, స్టార్ దర్శకులతో సినిమాలు చేసుకుంటూపోతున్నా ఆ నిర్మాత వ్యవహార శైలి మిగత నిర్మాతలను చిన్న బుచ్చుతుంది.
నిర్మాతని తండ్రితో పోలుస్తారు. తండ్రి అంటే ఎంత గౌరవంగా ఎంత సమర్ధవంతంగా ఉండాలి...? అలా కాకుండా బాబూ..సామీ...జిందాబాద్..!అంటూ అనవసరపు హడావిడి చేయటం ఎంతవరకు సబబు. అభిమానం విలువైనది..అవసరం పడినప్పుడు ఓ పద్దతిగా దానిని ప్రకటించాలి.అంతే కాని అతి చేస్తే నక్క వినయం అని అనుకునే ప్రమాదం ఉంది.
ప్రొడక్షన్ మేనేజర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించి నిర్మాతగా ఎదిగి ఈ సంవత్సరం అంతటికి పెద్ద విజయాన్ని దక్కించుకున్న ఆ నిర్మాత తనకు అవకాశం ఇచ్చిన హీరో మీద అభిమానం కురిపించటంలో తప్పులేదు. కాని దానికి ఓ పద్దతి ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికి ప్రొడక్షన్ మేనేజర్ లా వ్యవహరించటం కనకపు సింహాసనం.. అనే సామెతను గుర్తుకు తెస్తుంది. అలానే స్థాయికి తగ్గట్టు ప్రవర్తించక పోవటం అనవసరపు అనుమానాలకు తావిస్తుంది ఆ ఫై లేనిపోని తంటాలు. అసలు ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ...సదరు నిర్మాత గారు ఈ మద్య ఓ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ లో తన భజనా ప్రతాపాన్ని డిఫరెంట్ స్టైల్ లో చాటుతున్నాడు. ఆ టాలెంట్ ను తట్టుకోలేకే... ఈ స్పందన. చివరిగా ఆయనకు చేస్తున్నా మనవి ఏమిటంటే... కొత్త నిర్మాతగారు కాస్తా మీ స్థాయికి తగ్గట్టు హుందాగా ఉండండి సార్ ...!

No comments:
Post a Comment