సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాటలు.. టైటిల్ ట్రాక్ మినహా మిగతావి ఓ మాదిరిగా వినివిపిస్తున్నా.... చూడటానికి మాత్రం లక్షణంగానే కనిపిస్తున్నాయి. ఉన్న ఆరు పాటల్లో సందర్భానుసారంగా అనిపించే పాటలైతే పచ్చ తోరణాలతో, రంగుల లోగిళ్ళతో సంప్రదాయబద్దంగా ఏంతో ముచ్చట గొలుపుతున్నాయి. ఇక వెంకటేష్ మహేష్ గురించయితే చెప్పనే అవసరం లేదు.... వాళ్ళిద్దరూ కనిపిస్తున్నా ప్రతి ఫ్రేము కన్నుల పండవగా ఉంది.
అంజలి, సమంతా కూడా చూడ ముచ్చటగా ఉన్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ రెగ్యులర్ తల్లి తండ్రుల్లానే కనిపిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్రైలర్ లో వెంకటేష్ , మహేష్ పాత్రాల గురించి చిన్నపాటి హింట్ ఇచ్చారు. వెంకటేష్ కొంచెం సీరియస్ మైంటైన్ చేస్తుంటే మహేష్ కొంటెగా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాటం కాదు కాని చూస్తేనే బావుంటుంది... ఆలస్యం చేయకుండా క్రింద ఉన్న ట్రైలర్స్ ను చూసెయ్యండి.

No comments:
Post a Comment