తెలుగు బుల్లి తెర ఫై రియాలిటీ షోల ఒరవడికి ఒక ఊపు తీసుకొచ్చి యాంకర్లకు స్టార్ డమ్ కట్టబెట్టిన ఓంకార్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 'జీనియస్' చిత్రంతో ఈవారం దియేటర్లకు వచ్చాడు. జీనియస్ అనే టైటిల్ , చిన్ని కృష్ణ కధ , పరుచూరి బ్రదర్స్ మాటలు ఇలా కొన్ని వెయిట్ ఉన్న అంశాలు సినిమాకు ఉన్నప్పటికీ.. దర్శకుడిగా ఓంకార్ ఎలా చేశాడో... చూడాలన్నదే ఈ సినిమాకు సంబందించిన ప్రత్యేకమైన అంశంగా మారింది. ఇంతకు మునుపు కూడా చాలామంది టివి నేపద్యం నుండి వచ్చి వెండి తెర ఫై రాణించలేక వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఈ బుల్లి తెర జీనియస్ సినిమాలలో రాణించటానికి ఆశపడుతూ వేసిన తోలి అడుగుతో ఎంతవరకు సఫలం అయ్యాడో మన సమీక్షలో చుద్దాం.
కధ :
నివాస్(హవిష్), జీవా(వినోద్) , యాసిర్(అశ్విన్ ) అనే ముగ్గురు స్నేహితుల కధ ఈ జీనియస్. విద్యార్ధులైన ఈ ముగ్గురు వారికిష్టమైన రంగాలలో జీనియస్ లు అనిపించుకోవల్సింది పోయి... వ్యక్తులను గుడ్డిగా అభిమానించి జీవితాలను నాశనం చేసుకుంటారు. తమకు జరిగింది మరే విద్యార్ధికి జరగకూడదు.. అలానే అభిమానం అనే అపనమ్మకంలో ఉన్న విద్యార్ధులను హెచ్చరించే ఉద్దేశంతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చూడతారు. అలా వీళ్ళు మొదలుపట్టిన పని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది.
అసలేం జరుగుతుందో.. తెలుసుకోవటానికి టఫ్ పోలీస్ శరత్ చంద్ర రంగంలోకి దిగుతాడు. అప్పటికే జీవా , యాసిర్ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. మిగిలి ఉన్నా నివాస్ ను పట్టుకోవటంతో సమస్యకు కారణాలేంటో ఫ్లాష్ బ్యాక్ సాక్షిగా అందరికి తెలుస్తాయి. అ ఫై శరత్ చంద్ర మూలంగా చేయలేకపోయిన పనిని జైలు నుండి తప్పించుకున్నా నివాస్ పూర్తిచేయటంతో సినిమా ముగుస్తుంది.
విశ్లేషణ:
కమర్షియల్ మాస్ చిత్రాల రచయతగా స్టార్ హోదాను అనుభవిస్తున్నా చిన్ని కృష్ణకు ఇన్నాళ్ళకు తన కధతో ఓ మెసేజ్ ఇవ్వటానికి పూనుకున్నాడు. అది కూడా అభిమానం వెర్రితలలు వేసి అన్యాయంగా ఆత్మార్పణ చేసుకుంటున్నా విద్యార్ధుల గురించి. ఆలోచన బానే ఉంది కాని దానిని చెప్పిన విధానం బాగాలేదు. ఎందుకంటే ఎవరు మమల్ని అభిమానించండి అని అడగరు. పలానా వ్యక్తీ చేస్తున్న పని నచ్చి అతన్ని మెచ్చి అభిమానిస్తారు. అలాంటి అభిమానిస్తున్నా వ్యక్తీ తప్పు చేస్తే శిక్షగా అతన్ని చంపెయ్యటం కరెక్ట్ అనిపించలేదు.
వ్యక్తీ పూజ తప్పు..., నాయకుణ్ణి అనుసరించకండి.. మీరే నాయకుడిగా ఎదగండి వంటి స్లొగన్స్ ను మాటల వారికే పరిమితం చేశారు. రచయత అభిమానం గురించి చెప్పటానికి ఎంచుకున్న రంగాలు క్రికెట్, రాజకీయం, సినిమా. వీటిలో ప్రతి ఒక్కరికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. అభిమానం వల్ల వంచించబడ్డ కుర్రాళ్ళు ఆయా రంగాల్లో ఉన్నత స్థితికి ఎదిగి మిగత వారికీ స్పూర్తిగా నిలిచేలా ప్రవర్తించి నట్టైతే ఓ రకంగా ఉండేది. అలా కాకుండా మోసాన్ని ప్రతీకారంగా మార్చుకుని పగ తీర్చుకోవటం కోసం వాళ్ళును చంపి వీళ్ళూ చావటంతో మెసేజ్ సరిగా రీచ్ అవ్వలేదనే చెప్పాలి. చిన్ని కృష్ణ అంటే మాస్ రైటర్ కాబట్టి సినిమాలో భారి యాక్షన్ ఎపిసోడ్స్ ,నరుక్కోవాటలు ఉండాలి కాబట్టి సినిమాను అటు వైపు నడిపించారు.
ఒక ఆసక్తికరమైన నోట్ తో మొదలవుతుంది జీనియస్. మొదటి పాట అయిపోగానే వేగం తగ్గి ఆకర్షణ లేని సన్నివేశాలతో మెల్లగా నడుస్తూ మద్య మద్యలో పాటలతో ఇంటర్వెల్ వరకు చేరుకుంటుంది. అక్కడ నుండి అసలైన సినిమా మొదలవుతుంది. సినిమాలో చెప్పాలనుకున్నదంతా రెండో సగంలోనే చెప్పారు. ఓ 40 నిముషాలు మంచి మంచి సన్నివేశాలతో బానే కట్టి పడేస్తారు. కానీ క్లైమాక్స్ లో కమర్షియాలిటికి సందేశాన్ని అట్టించి చేసిన ప్రయత్నం పెద్దగా పేలలేదు. దాంతో ఊహించని అనుభూతితో బయటకు రావాల్సిన ప్రేక్షకుడు పెదవి విరుస్తూ బయటకు వస్తాడు. మొత్తంగా సినిమా కొన్ని మంచి సన్నివేశాలు,మాటలు, పాటల సాయంతో పర్వాలేదనే అనిపిస్తుంది.
కొసమెరుపు :
తన ఫై జరిగే ప్రతికూల ప్రచారాన్ని కూడా పబ్లిసిటీగా ఉపయోగించుకునేంత తెలివిగల ఓంకార్ అన్నయ్య .. ఇప్పుడు పరవాలేదులే అనిపిస్తున్నా ఈ జీనియస్ ను ఎంత తెలివిగా ప్రచారం చేసుకుంటాడు అన్నదాని బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
రేటింగ్:
విభాగాలు
|
రేటింగ్
| |||||
అభినయం :
హవిష్ ఆకట్టుకోలేక పోయాడు. నువ్విలా సినిమాలో చూపించినంత ఇజ్ ఈ సినిమాలో చూపలేకపోయాడు. నా పేరు శివ ఫేం వినోద్ పదునైన చూపులతో చక్కటి బాడీ లాంగ్వేజ్ తో బాగున్నాడు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాగానే చేశాడు. సనూష స్క్రెన్ ప్రేజెన్స్ బాగుంది. బాగా నటించింది కూడా. శరత్ కుమార్ హుండ అయిన పాత్రలో గ్రాండ్ గా కనిపించి మెప్పించాడు. జయప్రకాశ్ రెడ్డి రెగ్యులర్ పాత్రే అయిన తన ఉనికిని తెలియజేశాడు . బ్రహ్మానందం గబ్బర్ సింగ్ ను అనుకరిస్తూ సందడి చేశాడు. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బానే చేశారు.
|
2.5/5
| |||||
దర్శకత్వం :
ఓంకార్ దర్శకుడిగా పాస్ మార్కులు వేయించేసుకున్నాడు.సినిమా ఎలా తియ్యాలి. ఎవరితో... ఏ పని ఎంతవరకు చేయించుకోవాలి అన్నా విషయాల మీద అతనికి పూర్తీ అవగాహనా ఉంది. సహాయ దర్శకుడిగా అనుభవం లేక పోయినప్పటికీ ఇప్పుడు వస్తున్నాచాలా మంది దర్శకుల కంటే బాగా సినిమాను తీశాడు. ముందు మంచి టీం ను ఎంచుకున్నాడు. తరవాత కన్ఫ్యూజన్ కు అవకాశం ఇవ్వకుండా క్లారిటి తో తానూ చెప్పాలనుకుంది చెప్పేశాడు.
|
3/5
| |||||
రచన
| ||||||
కధ:
కధ వస్తువులో విషయం ఉంది కానీ చెప్పిన విధానంలోనే నిబద్దత లోపించింది. (2.75/5)
| ||||||
కధనం:
విస్సు కధనాన్ని ఆసక్తికరంగా మలచలేక పోయారు. మొదటి సగంలో చాల అనవసరమైన సన్నివేశాలు పడ్డాయి. కధ మొత్తాన్ని రెండో సగానికే పరిమితం చేశారు. హీరో హీరోయిన్ ల మద్య ప్రేమ సన్నివేశాలు సరిగా రాలేదు. క్లైమక్స్ ను ఆసక్తిగా రూపొందించలేదు. (2.5/5)
|
2.75/5
| |||||
మాటలు :
పరుచూరి బ్రదర్స్ వ్రాసిన మాటలు చాలా చోట్ల బాగానే పేలాయి. ముఖ్యంగా సినిమా హీరో లా మీద , రాజకియ్యాల ఫై వేసిన సెటైర్లు ఆకట్టుకున్నాయి. (2.75/5)
| ||||||
సంగీతం
| 3/5 | |||||
పాటలు :
జోష్వా శ్రీధర్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. కాకపోతే పాటలను సినిమాకు వెళ్ళే ముందు మూడు నాలుగు సార్లు వినుంటే సినిమా హాలులో బాగా ఎంజాయ్ చేయిస్తాయి. (4/5)
| ||||||
నేపధ్య సంగీతం:
చిన్నా అందించిన నేపధ్య సంగీతం సో..సో..గా ఉంది. (2.5/5
| ||||||
డాన్సులు:
దినేష్ మాస్టర్ నేతృత్వంలో అన్ని పాటలు బాగా వచ్చాయి. రెండు ఐటెం పాటలూ ఆకట్టుకుంటాయి. (3/5)
| ||||||
సాంకేతికం
|
2.75/5
| |||||
కెమెరా:
దివాకరన్ సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. ముఖ్యంగా లడక్ లో చేసిన డ్యూయెట్ ను చాలా అద్భుతంగా చూపించాడు. (3/5)
| ||||||
ఎడిటింగ్ :
యం అర్ వర్మ ఎడిటింగ్ కధకు తగ్గట్టు బాగుంది. (3/5)
| ||||||
ఆర్ట్ :
అశోక్ ఆర్ట్ పనితనం పర్వాలేదు. (2.5/5)
| ||||||
ఫైట్స్ :
దీలిప్ సుబ్బరాయన్ పోరాటాలు బాగానే ఊపు తెప్పిస్తాయి. (2.75/5)
| ||||||
తులాభారం
|
2.5/5
| |||||
హెచ్చులు :
| ||||||
తగ్గులు:
| ||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 2.75/5
| ||||||
కొసమెరుపు :
తన ఫై జరిగే ప్రతికూల ప్రచారాన్ని కూడా పబ్లిసిటీగా ఉపయోగించుకునేంత తెలివిగల ఓంకార్ అన్నయ్య .. ఇప్పుడు పరవాలేదులే అనిపిస్తున్నా ఈ జీనియస్ ను ఎంత తెలివిగా ప్రచారం చేసుకుంటాడు అన్నదాని బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

No comments:
Post a Comment