Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 17, 2012

తప్పు సరిదిద్దుకున్న నాయక్


'చరిత్ర నాయకులను సృష్టిస్తుంది. కాని ఒక నిజమైన చరిత్ర .... చరిత్రను తిరగ వ్రాస్తుంది..!' అని రెండు రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ లో నాయక్ సినిమా గురించి బిల్డ్ అప్ ఇస్తూ ఇంగ్లీష్ లో చాలా స్టైల్ గా వేశారు. చరిత్ర చరిత్రను తిరగరాయటం ఏమిటా  అని కొద్దిగా అనుమానం కలిగినప్పటికీ  మెగా హీరో కదా మార్చిన మార్చి ఉంటాడులే అని సర్డుకుపోయాం. కాని ఈ రోజు ఆడియో విడుదల కార్యక్రమంలో తెలిసిందేమంటే ఆ కొటేషన్ లో ఓ పొరపాటు జరిగిందని...!

లీడర్ అనే పదం పడాల్సిన చోట హిస్టరీ అనే పదం పడటం మూలంగా ఈ పొరపాటు జరిగిందని తెలిసింది. దాంతో ఆ కొటేషన్ అర్ధం ఇప్పుడు సరిగా వినిపిస్తుంది. 'చరిత్ర నాయకులను సృష్టిస్తుంది. కాని ఒక నిజమైన నాయకుడు .... చరిత్రను తిరగ వ్రాస్తాడు.! అనే సత్తెకాలపు సామెతే అయినా సత్తా ఉన్నా సామెతగా మనం గుర్తించవచ్చు. అలానే నాయక్ ఈ సినిమాతో  చరిత్ర తిరగరాయబోతున్నాడని ఊహించుకోవచ్చు. పొరపాటు చిన్నదే అయినా హీరో రేంజ్ పెద్దది కాబట్టి క్షమించరానిదే. మొత్తానికి పొరపాటును గమనించి డిటైల్డ్ ట్రైలర్ లో సరిదిద్దారు. 

ఆడియో విడుదల సందర్భంగా కనిపించిన సాంగ్ ప్రోమోస్ , ట్రైలర్ లను చూసి నాయక్ సినిమా రూపంలో మాస్ ప్రేక్షకులకు  మాంచి నాన్ - వెజ్ విందు భోజనం రెడీ అవుతుందని భరోసా ఇవ్వవచ్చు. వినాయక మార్క్ లెక్కలతో రూపొందుతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ నాయక్ ను అభివర్ణించవచ్చు.  అలానే తమన్ అందిచిన పాటలలో 'కత్తి లాంటి పిల్లా..', 'యవ్వరామంటే ఎలూరే'  పాటలు వినటానికి బాగున్నాయి. లైలా ఓ లైలా పాటలో చరణ్ డాన్స్ అదరగొట్టాడు. శుభలేఖ.. పాటను  విజువల్ చూసిన తరవాత గాని కామెంట్ చేయటానికి ఆస్కారం లేదు. హే నాయక్ పాట బాగుంది.     


ఫైనా  చెప్పుకున్న తేడాలను కింద ఉన్న వీడియోస్ లో గమనించవచ్చు...

నాయక్ టీజర్ :



నాయక్ ట్రైలర్ :

No comments:

Post a Comment