ఓ విషయంగా ఒక వ్యక్తీ ఎంత పనిమంతుడైనప్పటికి... ఓ సరైన పరీక్ష ఎదురైనప్పుడే తన పనిని లోకానికి చాటే అవకాశం అతనికి దొరుకుతుంది. అది కూడా అల్లాటప్పది కాకుండా బలమైన సవాల్ తారస పడితే ఆ పోటి మహా రంజుగా ఉంటుంది. యుక్తితో ముందుకెళ్తూ తన శక్తినంత కూడదీసుకుని జటిలమైన సవాల్ మెడలు వంచి లొంగదీసుకున్నప్పుడే ఊహించని పేరు, ప్రతిస్థ దక్కుతాయి. అక్కడితో ఆగకుండా ఎన్ని ఎక్కువ సవాళ్ళను ఎదుర్కుంటూ పోతుంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. ఇప్పుడు ఈ విషయాన్నీ ఆచరణలో పెడుతూ శ్రద్దగా కృషి చేస్తున్నాడు చిరుతనయుడు.
స్టార్ హీరోగా మగధీర సినిమాతోనే తనకంటూ ఒక పోజిషన్ను సెట్ చేసుకున్న రామ్ చరణ్ తాజాగా నాయక్ చిత్రంలో ఒక సవాల్ కు ధీటుగా సమాధానం చెప్పి తన స్టామినాను గ్రాండ్ గా చాటుకున్నాడు. దాని గురించి మాట్లాడుకోవటం అనధికారమే అయినప్పటికీ చెర్రి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోవటమే విషయాన్నీ బయట పెట్టడానికి కారణంగా భావించాలి. ఇంతకీ అదేమంటే నాయక్ సినిమాలో 'లైలా ఓ లైలా ' పాట. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ఓ సరైన మ్యూజిక్ ప్లేయర్ లో సరిపడా సౌండ్ పెట్టుకుని వింటుంటే... మన అనుమతి లేకుండానే మన కాళ్ళు రామ్ చరణ్ అయిపోయి రాంప్ ఎక్కేస్తాయి. అంత సూపర్ గా ఈ డాన్సు నెంబర్ కు ప్రాణం పోసాడు తమన్. వింటేనే ఇలా ఉంటే ఇక చూస్తే ఎలా ఉంటుందో అని ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఓ అంచనాకు వచ్చేస్తారు.
మాములుగా అయితే సినిమా విడుదల వరకు ఈ సస్పెన్సు కొనసాగేది. కాని టెక్నాలజీ తెచ్చిపెట్టిన సౌకర్యం, నిర్వాహకుల అసమర్ధత ఆ పాటను ముందే ఆస్వాదించే అవకాశాన్ని కల్పించాయి. పాటలు విడుదలైన తరవాతి రోజే ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయిన ఈ పాట సంచలనమే సృష్టించింది. ఈ పాటలో రామ్ చరణ్ చేసిన డాన్సు కైతే వీపరీతమైన స్పందన వచ్చింది. పాటల విడుదల సందర్బంగా చరణ్ మాట్లాడుతూ తమన్ మ్యూజిక్ తో తన డాన్సు కి టఫ్ కాంపిటేషన్ ఇచ్చాడు అని చెప్పాడు. లైలా పాటను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తమన్ పాటకు , చరణ్ డాన్సు కు మద్య పోటి చాలా రసవత్తరంగా జరిగింది. ఇద్దరు ఎక్కడ తగ్గలేదు. వింటున్నప్పుడు ఈ పాట క్రెడిట్ ను తమన్ కే ఇవ్వలనిపిస్తుంది. కాని చూస్తున్నప్పుడు రామ్ చరణ్ కు వినాయక్ విజన్ , జానీ మాస్టర్ అదిరిపాటు స్టెప్పులు కలిసి వచ్చి మారు మాట్లాడకుండా క్రెడిట్ మొత్తాన్ని చెర్రికే వ్రాసిచ్చేస్తాం..! పాదరసంలా కదులుతూ , పాములా మెలికలు తిరుగుతూ తన డాన్సు తో పాట మీద పూర్తీ ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా చరణం పూర్తయ్యి బిజియం మొదలయ్యేప్పుడు వచ్చే బీట్ కు చరణ్ వేసిన స్టెప్పులు ... అద్బుతః...!
దొంగచాటుగా వచ్చిన లో క్వాలిటీ వీడియోలోనే పాట ఇంత బాగుంటే... ఇదే పాటను బిగ్ స్క్రీన్ మీద... దద్దరిల్లే సౌండ్ సిస్టం తో చూస్తుంటే.. అబ్బో... ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయటం కష్టమే...!


No comments:
Post a Comment