సింహాద్రి సూపర్ హిట్ అయిన తరవాత స్టూడెంట్ పాత్రల సంగతి పక్కనుంచి, స్టూడెంట్ పాత్ర పోషించాటానికి అనువైన వయసులోనే తానున్నాడు అనే సంగతినే దాదాపు మర్చిపోయిన యంగ్ టైగర్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రోత్సహంతో స్టూడెంట్ గా తన కెపబులిటిని ఒకసారి చెక్ చేసుకోవటానికి సిద్దం అవుతున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో జూనియర్ రఫ్ అండ్ టఫ్ విద్యార్ధి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఆ క్యారెక్టర్ తిన్నగా ఉండటం, తీరిగ్గా కుర్చుని చదువుకోవటం మినహా మిగత అన్ని పనులు చేస్తుందంటా...! పక్కా హైదరాబాది యూత్ ను తలపించేలా కనిపించనున్న యన్ టిఓడు మనెవ్వరి ఊహలకందని పంచ్ డైలాగులు మాట్లాడతాడని... అలానే అందరు ఊహించేలా డాన్సులు, ఫైట్లు చేస్తాడని ఊరిస్తున్నాడు హరీష్.
స్టూడెంట్ నెంబర్ వన్, ఆది,సుబ్బు,నాగ చిత్రాలలో విద్యార్ధిగా విలక్షణత చాటినప్పటికి హిట్లు మాస్ ను అలరించే సినిమాలకు పడటం మూలంగా మాస్ జనాలలోనే ఎక్కువ అభిమానులను సంపాయించుకున్నాడు NTR. మాస్ మంత్రం అన్నివేళలా మంచిది కాదని గ్రహించి రాజమౌళి చొరవతో మొదలుపెట్టిన యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు బృందావనంతో ఓ కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు. కాని ఆ సినిమా తరవాత వచ్చిన చిత్రాలు యన్ టి అర్ అభిమానులను నిరాశపరచటంతో పాటు, యూత్ లో ఫాలోయింగ్ కు కూడా గండి కొట్టాయనే చెప్పాలి. ఈ పరిస్థితికి ఎదుర్కోవటానికి 'బాద్ షా ' రూపంలో మెరుగైన ట్రీట్ మొదలైందనే అనుకోవాలి. ఇప్పుడు NTR ను స్టూడెంట్ గా చూపించాలనుకుంటున్నా హరీష్ శంకర్ నిర్ణయం కూడా యూత్ లో NTR వెయిట్ ను పెంచేదుకు దోహదపడేలా కనిపిస్తుంది. ఎదెలా ఉన్నా NTR చానాళ్ళ తరవాత యూత్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించబోతున్నడని తెలిసి నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment