Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 13, 2012

కొసరుకే ఇంత హడావిడైతే.... ఇక అసలుకు ఎంతో ...?


ఈ యేడాది మొదట్లో  బీభత్సమైన రచ్చ చేసి మెగా అభిమానులను ఉత్సాహపరిచిన చిరుతనయుడు రామ్ చరణ్ వచ్చే యేడాదిని కూడా అంతే  ఘనంగా ప్రారంభించటానికి ఈ సంక్రాంతికి నాయక్ చిత్రంతో సిద్దం అవుతున్నాడు. అంటే దానర్ధం మెగా కొలువులో అలుపెరగని సందడికి నగారా మ్రోగినట్టే..! ఈ సందడికి అంకురార్పణగా ఈ నెల 17 న పాటలను విడుదల చేయటానికి సిద్దం అయ్యారు 'నాయక్' రూపకర్తలు. ఈ లోపే ఆ అల్బుమ్ కు సంబందించిన రెండు పాటల ప్రోమోస్ బయటకు వచ్చాయి. వాటిని విని మెగా అభిమానులు వేస్తున్నా చిందులు వర్ణనకు అందటం లేదు.

"కత్తి లాంటి పిల్లా...! కొసమెరుపులా ... " , "ఎవ్వరమంటే ఎలురే ...!, నులకమంచం నెల్లూరే.." అంటూ తమన్ కట్టిన ట్యూన్ లు వింటుంటే అభిమానులు ఆవేశపడటంలో తప్పులేదని పిస్తుంది. ఈ రెండు ముక్కలను విని మెగా అభిమానులు సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్స్ లో అప్పుడే  సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పుడే పరిస్థితి ఇంత హడావిడిగా ఉంటే ... రేపు పాటలు విడుదల అయిన తరవాత ఎలా ఉంటుందో... అని ఎవరికీ తోచిన అంచనాలను  వాళ్ళు వేసుకుంటున్నారు. మీరు కూడా పాటలు విడుదల అయ్యే లోపు  క్రింద ఉన్నా ఆ ప్రోమోస్ ను ఓసారి విని ఒక  అభిప్రాయానికి రండి...! 

'కత్తిలాంటి పిల్లా ...' సాంగ్ ప్రోమో ...


'ఎవ్వరమంటే ఎలురే ...' సాంగ్ ప్రోమో...

No comments:

Post a Comment