Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, December 16, 2012

టాలీవుడ్ ఫై చేరన్ ఆటోగ్రాఫ్..!


 ఒక్క నేషనల్ అవార్డు గెలిస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది మూడు నేషనల్ అవార్డులు గెలిస్తే ఎంత గొప్పగా చెప్పుకోవాలి. కానీ చేరన్ ఆ గొప్పలకు పడిపోయే రకం కాదు. తనేం చెప్పాలనుకున్నాడో దానిని సూటిగా చెప్పేయాలి అంతే..! ఆ ఫై వాటికి అవార్డులోస్తాయో... రివార్డులోస్తాయో పట్టించుకునే తత్త్వం కాదు. 

కాని చిత్రమేమిటంటే 15 సంవత్సరాల దర్శకత్వ కెరీర్ లో చేసిన 10 సినిమాలలో 80% కమర్షియల్ గా విజయం సాదించాయి. అలానే 8 సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. అందులో మూడు నేషనల్ అవార్డ్స్.  ఇలాంటి ట్రాక్ రికార్డు చాల తక్కువ మందికి ఉంటుంది.  అలాంటి చేరన్ ఇప్పుడు తెలుగు తెర ఫై మొదటి సారిగా తన ఆటోగ్రాఫ్ చేయటానికి 'ఏమిటో ఈ మాయ ' అంటూ సిద్దం అవుతున్నాడు. 

గతంలో రవితేజ నటించిన 'నా ఆటోగ్రాఫ్' చేరన్ తమిళ ఆటోగ్రాఫ్కు రిమేకే, కాకపోతే ఒరిజినల్ లో కనిపించిన ఫీల్ ఈ  సినిమాలో తగ్గటంతో  తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ భావ రాహిత్యానికి భంగం కలగకుండా 'ఏమిటో ఈ మాయ ' చిత్రంతో చేరన్ తెలుగు ప్రేక్షకులను తనదైన రియలిస్టిక్ ఫీలింగ్స్ తో అలరించాలని ఆశిద్దాం...! 

బస్తి నేపద్యంగా సాగే మెచ్యుర్డ్ లవ్ స్టోరిగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో శర్వానంద్ , నిత్య మీనన్ జంటగా నటిస్తున్నారు. ద్విబాష చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చేరన్ తో కనిసి స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తుండగా జి  వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

      



No comments:

Post a Comment