Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 24, 2012

ఈసారి శ్రీనువైట్ల టార్గెట్ ఎవరో...?



 దుబాయ్ శ్రీను చిత్రంలో ఫైర్ స్టార్ 'సల్మాన్ రాజు' గాను , 'దూకుడు' లో సినిమా హీరో కావాలనుకునే ఔత్సాహిక వృద్దుడిగా విభిన్నా గెట్ అప్స్ లో కనిపించి హస్యప్రియులను సమ్మోహన పరిచిన యం యస్ నారాయణ తాజాగా యన్ టి అర్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్నా' బాద్షా ' లో సినీరంగానికి చెందిన ఓ సుపరిచిత అవతారంలో కనిపించనున్నడని సమాచారం.

ఓ నమ్మకమైన వ్యక్తీ చెప్పిన వివరాల ప్రకారం యం యస్ తెలుగు సినిమా దర్శకుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. యం యస్ నారాయణను దర్శకుడిగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విని హీరోగా పెట్టి శ్రీను వైట్ల ఓ అద్భుతమైన కామెడి సీక్వెన్స్ ను చిత్రికరించాడని చెబుతున్నారు. ఇక్కడి వరకు అంత బానే ఉంది, కాని అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీను వైట్ల సినీ పరిశ్రమలో తనకు ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకునే సల్మాన్ రాజు, బొక్క వెంకట రావు (దూకుడు) , కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలకు  ప్రాణం పోసాడనేది అందరికి తెలిసిన విషయమే..! 


మళ్లీ  ఇప్పుడు అదే తరహాలో యం యస్ చేత దర్శకుడి వేషం వేయిస్తున్నా శ్రీను వైట్ల ఈసారి ఎవరిని టార్గెట్ చేసి ఆ పాత్రకు పురుడుపోశాడో... తెలుసుకోవటానికి ఎవరి శక్తి మేర వాళ్ళు బుర్రలకు పదును పెడుతున్నారు. కొందరు ఊహలకు తట్టిన దాని ప్రకారం అప్పలరాజు సినిమాతో తెలుగు సినిమాను ఆడిపోసుకున్నా రామ్ గోపాల్ వర్మనే శ్రీను ఫ్రెష్ టార్గెట్ అయ్యుండొచ్చు అని అనుమానపడుతున్నారు. ఈ విషయాన్నీ కొంతవరకు సమర్దించవచ్చు.ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో తన మీద జోకులేసుకోవటానికి ఫుల్లుగా అవకాశం ఇస్తుంది ఆయనే కాబట్టి...!   

No comments:

Post a Comment