Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, December 26, 2012

రెండో అడుగు రాజమౌళిది...!


పాతికేళ్ళ క్రితం ఆగిపోయిందనుకుంటున్నా మల్టి స్టారర్ సంస్కృతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మళ్లీ  జీవం పోస్తుంది తెలుగు సినీ పరిశ్రమ. వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సంకల్పం , అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిబద్దత ఆ ప్రయత్నం తోలి అడుగు వేయటానికి దోహదపడ్డాయి. తెలుగు వాళ్ళకు పరిచయమే అయిన మరుగున పడిపోయిన ఈ కల్చర్ ను మరో అడుగు ముందుకు తీసుకువెళ్ళే భాద్యతను భుజానకెత్తుకునే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చారిత్రక నేపద్యంలో ప్రభాస్ హీరోగా ఏంతో ప్రతిస్థాత్మకంగా రూపొందించ తలపెట్టిన త్రిబాష  భారి చిత్రంలో ఈ విషయానికి చోటు కల్పించనున్నాడు. అది కూడా తెలుగు స్టార్ హీరోలు పాటిస్తున్నా సంప్రదాయానికి విరుద్దంగా..! ఏదో గెస్ట్ అపిరెన్స్  అంటే కొద్దిగా బెండ్ అవుతారు కాని వేరే హీరో సినిమాలో నెగిటివ్ పాత్ర అనే పదాన్ని వినటానికి కూడా ఇష్టపడరు మన సూపర్ స్టార్లు. అలాంటిది స్టార్ ఫ్యామిలి నుండి వచ్చి కొంగొత్త స్టార్ గా ఎదుగుతున్నా దగ్గుబాటి వారి వారసుణ్ణి ప్రతినాయక లక్షణలున్నా పాత్రలో చూపించాలనే ఉద్దేశంలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆలోచన కేవలం గాలి వార్తలకే పరిమితం కాకుండా ఓ ఆకారాన్ని తీసుకుని తెర మీద ఆవిష్కరింపబడితే.. తెలుగు సినీ పరిశ్రమలో మరో కొత్త శకానికి నాంది పలికినట్టు అవుతుంది. 

కృష్ణం వందే జగద్గురుం ఫలితం నిరాశపరిచినా నటుడిగా తన నిబద్దతను నిరుపించుకున్నా రానా కు మంచి పేరు కట్టబెట్టింది. ఆ గొప్పను చూసుకుని స్నేహితులో, శ్రేయోభిలాషులో ఇచ్చే ఫ్రీ అడ్వైజ్ లను స్వీకరించి వెనకడుగు వేయకుండా ఆ  మద్య ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు 'మంచి పాత్ర దొరికితే విలన్ గా కూడా నటిస్తా..!' అనే స్టేట్మెంట్ కు కట్టుబడి ముందుకు వస్తే తెలుగు సినిమా చరిత్రలో  కొత్త సంచలనానికి శంకుస్థాపన జరిగినట్టే...! ఆ ఫై జరగాల్సిన దాన్ని రాజమౌళి చూసుకుంటాడు. ఎందుకంటే రాజమౌళి సినిమాలలో హీరోలు ఎంత పాపులర్ అవుతారో.. అంతకు మించి విలన్లు పేరు తెచ్చుకుంటారు. అందుకు తాజా నిదర్శనం 'ఈగ' సుదీప్.  

ఇది ఒక పక్కే... మరో పక్కఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఛత్రపతి సినిమాలో కాట్రాజు , ప్రభాస్ కొట్టుకునే సన్నివేశం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో... మనం మర్చిపోగలమా...! అలాంటిది ఆరడుగుల పైన ఎత్తుతో, దృడమైన శరీరాలతో దిట్టంగా కనిపించే రానా , ప్రభాస్ ఒకరితో ఒకరు తలపడుతుంటే ఎలా ఉంటుందో... ఒకసారి ఊహించుకోండి...! తెరలు చిరిగిపోతాయి.. దియేటర్లు పగిలిపోతాయి. సో... ఈ ప్రయత్ననికి ఎవరు అడ్డుతగలకుండా.. అన్ని సక్రమంగా జరగి సినిమా బయటకు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం...!                  

    
  

No comments:

Post a Comment