శర్వానంద్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాని.. హీరోగా పరిశ్రమలో నాటుకుపోవటానికి అవసరమైన సత్తా ఉన్నా సినిమా ఇంత వరకు పడలేదనే చెప్పాలి. తనకు ఉపయోగపడేలా ఉండే సినిమా కోసం వేచి ఉండటం కాకుండా తన రాతను తానే వ్రాసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారి 'కో అంటే కోటి' సినిమాను నటిస్తూ నిర్మించి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కొత్తగా అనిపించిన ప్రచార చిత్రాలు,పాటలు సినిమా ఫై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్స్ లో శ్రీ హరి , శర్వానంద్ చెప్పిన వన్ లైన్ డైలాగులు, చిత్రంగా వినిపించిన బ్యాక్ స్కోర్ సినిమా మీద అంచనాలకు దారి తీసింది. అలా ఊహించని విధంగా ఏర్పడిన ఈ వాతావరణాన్ని ఆలస్యం చేయకుండా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంగా చక చక సినిమాను పూర్తీ చేసి గబ గబ దియేటర్లకు పట్టుకొచ్చాడు శర్వానంద్. సినిమా విజయం మీద కో అంటే కొండంత ఉన్న నమ్మకంతో తానే సొంతంగా విడుదల చేశాడు. మరి శర్వా ఆశలను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చిందో మన సమీక్షలో చూద్దాం.
కధ :
ఎవరు మంచోడవమని చెప్పలేదని... బతకటమే కష్టం అయినప్పుడు బొంగులోది మంచోడేంటి..? చెడ్డోడేంటి...? ఎలాగైనా బతికేయ్యాలంతే..! అనే సిద్దాంతానికి కట్టుబడి బతకటానికి బలుపు ఉండాలనే నిర్ణయానికి వచ్చి దొంగతనాలు చేసుకుంటూ బతికేస్తుంటాడు అనాదైనా వంశీ(శర్వానంద్ ). చొర కళకు సంబంధించి ఎంత పెద్ద బిల్డింగ్ నైన అవలీలాగా ఎక్కేయటం మనోడి ప్రత్యేకత. ఆ టాలెంటే మనోడు హీరోయిన్ వల్ల ప్రభావితమై మంచిగా మారాలనుకున్న మారనివ్వదు. దర్శకుడు ఆడిన వింత నాటకం వల్ల ఒక నేరాస్తుడిగానే తెల్లరిపోవాల్సిన హీరో జీవితంలోకి సత్య(ప్రియ ఆనంద్) రూపంలో హీరోయిన్ వస్తుంది. దాంతో బ్యాక్ అండ్ వైట్ అనుకున్న జీవితం సత్య రాకతో ఈస్ట్ మన్ కలర్ లోకి మారిందని వంశీకి అర్ధం అవుతుంది.
కాకపోతే ఈ సినిమాను లవ్ స్టోరిగా కాకుండా క్రైమ్ థ్రిల్లర్ గా కట్టింగ్ ఇచ్చిన దర్శకుడు ఆ మాటను నెరవేర్చుకోవటానికి మాయ(శ్రీ హరి) రూపంలో ఓ ప్రధాన పాత్రను ప్రవేశపెట్టి సినిమాకు న్యాయం చేసే పనిలో పడతాడు. సింగల్ గా చిల్లర దొంగతనాలు చేసుకునే మాయ విసిగి పోయి ఓ బ్లాక్ బాస్టర్ దొంగతనం చేసి జీవితంలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఆ కలను నిజం చేసుకునే పనిలో భాగంగా చిన్నా, బుజ్జిలతో పాటు బలవంతంగా వంశీని కూడా తన టీమ్ లో కలుపుకుంటాడు. ఆ తరవాత చాలా కష్ట పడి దొంగతనాన్ని పూర్తిచేస్తారు. కాని దొంగలించిన ఆ డబ్బు చుట్టూ బోల్డన్ని ప్రమాదాలు దాగుంటాయి . ఆ ప్రమాదాలు సృష్టించిన పరిణామాలు వంశీని దాదాపు చావు వరకు తీసుకెళ్తాయి. కాని వంశీ తెలుగు సినిమా హీరో కాబట్టి ఆ ప్రమాదాలతో ఎలా ఆడుకున్నాడు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ:
ఈ సినిమాలో కొన్ని శెబాష్..! అనిపించే అంశాలు ఉన్నాయి. కొన్ని చెత్ ..! అనిపించే అంశాలు ఉన్నాయి. కాకపోతే సినిమా విజయానికి అవసరమైన విభాగాలే ఎక్కువ నెగిటివ్ సైడ్ ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారి అయ్యాయి. అసలు సినిమాకు సంబంధించి పెను ప్రమాదాన్ని సృష్టించింది దర్శకుడు అనీష్ కురువిల్లా. ఎందుకంటే ట్రైలర్స్ ను, పోస్టర్స్ ను ఓ రేంజ్ లో తాయారు చేసి భీభత్సం చేశాడు . కాని వాటిలో చూపించినంత విషయాన్నీ సినిమాలో చూపించకపోవటంతో డామేజి ఘనంగానే జరిగిందని చెప్పాలి.
ట్రైలర్స్ లో హీరో చెప్పిన డైలాగులను బట్టి మనోడో... కరుడుగట్టిన నేరస్తుడనుకుంటాం..! కాని తప్పు చేస్తున్నాను.. తప్పుచేస్తున్నాను... అని మదనపడుతూ బోడి బుజ్జి బుజ్జి దొంగతనాలు చేసుకునే చిల్లర దొంగకు ఇంత బిల్డప్ అవసరమా... అని అనిపిస్తుంది సినిమా చూశాక ...! అలానే హీరో సినిమాఅంత కూడా ఎక్కడ డేరింగ్ గా ఉన్నట్టే అనిపించడు. ఫై పెచ్చు ప్రతి పనిని మొహమాట పడుతూ ఇబ్బందిగా చేసినట్టు అనిపిస్తుంది. ఇలా ఈ ఒక్క పాత్రే కాదు ఒక్క హీరోయిన్ పాత్ర మినహా సినిమాలో కనిపించిన ప్రతి ప్రధానమైన పాత్ర ఇవే లక్షణాలతో కనిపిస్తుంది. అన్నిపాత్రలను చాలా గ్రాండ్ గా పరిచయం చేసిన దర్శకుడు వాటిని అంతే గొప్పగా సినిమాఅంత చూపించలేక పోయాడు.
ఇక కధ విషయానికి వస్తే... బాట్ మాన్ సినిమాల దర్శకుడు క్రిస్టోఫర్ నొలెన్ ఏ ముహూర్తాన 'డార్క్ నైట్ ' సినిమా గురించి ఆలోచించాడో కాని.. ఆ సినిమాను ఏదో విధంగా అనుకరించటానికి ఇప్పటికి ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. కొన్ని సొంత తెలివితేటలూ వాడినప్పటికీ 'కో అంటే కోటి' లో ప్రధాన పాయింట్ ఏదైతే ఉందో అది జోకర్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ నుండి దర్శకుడు స్పూర్తి పొందాడని ఈజీ గా అర్ధం చేసుకోవచ్చు. ఆ ఫై ఆ పాయింట్ ను నేటివిటికి అనుగుణంగా మలచటంలో నాన్-లోకల్ అయిన అనీష్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. పట్టణ వాతావరణానికి(హైదరాబాద్) గ్రామీణ వాతావరణాన్ని(గోదావరి జిల్లాలోని గ్రామం ) అనుసందనిస్తూ అతను చేసిన పొరపాట్లను ఈ సినిమాలో స్పష్టంగా గమనించవచ్చు.
అందుకు ఉదాహరణగా ప్రతినాయకుడి గురించి చెప్పుకోవచ్చు. విలన్ కు ఫెడ్రిక్ అని పేరు పెట్టి వెదుర్లంకలొ మోలిపించి.. కర్నూల్ లో నడిపించి.. హైదరాబాద్ ను గడగడ లాడించే వాడిలా చూపించాడు. కాని అతని వాలకం చూస్తుంటే ఈ మూడు ప్రాంతాలకు చెందిన వాడులా కాకుండా హాలీవుడ్ నుండి పారిపోయోచ్చిన బాపతులా కనపడతాడు, అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకింత ప్రత్యేకంగా చెప్పటం అంటే విలన్ ని క్రురంగా చూపించాలనుకున్నప్పుడు కళ్ళు ముసుకు చూపించేయాలంతే..! అలా కాకుండా అక్కడ పుట్టాడు .. ఇక్కడ పెరిగాడు.. ఎక్కడో పెరుకుతున్నాడు అంటూ లేని పోనివి ఎత్తుకుని అసలుకే ఎసరు తెచ్చుకోకూడదు. ఇలాంటి ప్రయోగాలను పెక్కుగా చేసి సినిమాలో కనిపించే ఏ పాత్ర ఫై ప్రేక్షకులు మనసు పెట్టకుండా చూసుకుని సినిమా ఫై ఆసక్తి కలగకుండా చేశాడు. ఇలా పేపర్ ఫై జరగాల్సిన పనిలో చాలా వరకు తప్పులు చేసుకుంటూ పోయిన దర్శకుడు సాంకేతికంగా అన్ని విభాగాలను చక్కగా ఉపయోగించుకుని సినిమాను చాలా అందంగా తెరకెక్కించాడు. మొత్తంగా కధ కధనాల పరంగా సినిమా నిరాశ పరిచినప్పటికీ టెక్నికాలిటీ పరంగా అభినందించతగింది.
రేటింగ్ :
విభాగాలు
|
రేటింగ్
| |||||
అభినయం :
శర్వానంద్ వంశీ పాత్రలో బాగానే చేశాడు. కాకపోతే తనే నిర్మాతగా మారి పోషించాల్సినంత గొప్ప పాత్ర అయితే మాత్రం కాదు. శర్వానంద్ రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు. అతని టాలెంట్ ను కొన్ని ప్రత్యేకమైన పాత్రలతోనే కొలవగలం. ఈ విషయన్ని శర్వ గుర్తెరిగి మంచి స్క్రిప్ట్స్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ ఆనంద్.. ఈ సినిమాకు ఒక సేవింగ్ గ్యాస్. మిగత వాళ్ళందరిని పక్కన పెట్టేసి ప్రియనే రెండు గంటలు పాటు చూపిస్తూ ఉంటే బాగుంటుంది అన్నంత బాగుంది. సత్య పాత్రలో ముద్దొచ్చేలా నటించింది. పాటల్లో ఆమెను చూస్తూ చూపు తిప్పుకోబుద్ది కాదు. మాయగా శ్రీ హరి తన స్టైల్ లో అదర గొట్టేశాడు. ఆ పాత్రలో ఉన్న వేరియేషన్స్ ను చాలా అద్భుతంగా పోషించాడు. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బానే చేశారు.
|
2.75/5
| |||||
దర్శకత్వం :
కధ ములుగానే ఉన్నా వెరైటీ కధనంతో తన టాలెంట్ ను చాటుకోవాలని చూసిన అనీష్ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. కధ , కధనాలా పరంగా రాణించలేకపోయినప్పటికీ టెక్నికల్ గా మాత్రం కొత్త సినిమాను చూపించాడు. పాటలను మాత్రం చాలా బాగా చిత్రీకరించాడు.
|
2.5/5
| |||||
రచన
| ||||||
కధ:
ఈ మద్య అందరు నూరుతున్నా చింతకాయ పచ్చడినే మళ్లీ నూరి బలవంతంగా పెట్టారు. కాకపోతే తాలింపు సరిగా లేకపోవటంతో పచ్చడి చప్పగ్గా అనిపించింది. (2/5)
| ||||||
కధనం:
కధ సింపుల్ గా ఉన్నప్పుడు కధనమే సినిమాకు ప్రాణం అవుతుంది. ఒట్టి ప్రాణం ఉంటే సరిపోదు దానికి ఎక్కువ తక్కువ కాని బాలన్సుడ్ తెలివితేటల కూడా ఉండాలి. కానీ ఈ సినిమాలో తెలివితేటల మోతాదు ఎక్కువ అవటంతో కధనంలో స్పష్టత కరువైంది. ఫస్ట్ హాఫ్ ఆర్ట్ ఫిలింను తలపిస్తుంది. రెండో సగంలో కీలకమైన సన్నివేశాల్లో అవసరమైన ఎమోషన్ మిస్ అయ్యింది. (2/5)
|
2.25/5
| |||||
మాటలు :
గుడ్డు పెట్టె కోడికే తెలుస్తుంది గుండె నొప్పి..! డబుల్ మీనింగే అయినా ఇదే కాస్త సరదాగా అనిపించే డైలాగ్. అక్కడక్కడ పర్వలేదు కాని ఓవర్ అల్ గా ఓకే అనిపిస్తాయి ప్రవీణ్ బోయిన మాటలు. (2.5/5)
| ||||||
సంగీతం
| 3/5 | |||||
పాటలు :
శక్తి కాంత్ పాటలు అన్ని బాగున్నాయి.ముఖ్యంగా 'వరాల వాన ' పాట సింపుల్ గా సూపర్. కాస్త చికాకు అనిపించే సినిమాలో పాటలే ఊరటనిస్తాయి. (3.5/5)
| ||||||
నేపధ్య సంగీతం:
శక్తి బ్యాక్ స్కోర్ కూడా బానే ఉంది. కాకపోతే సన్నివేశాలలో ఎమోషన్ ఇంకా బాగా పండి నట్టైతే బ్యాక్ స్కోర్ కు మరింత బలం వచ్చేది. కుదిరినంత వరకు బాగానే చేసినట్టు. (2.75/5)
| ||||||
డాన్సులు:
చెప్పుకోతగ్గ డాన్సులు లేవు కాని అన్నిపాటలను బాగా చిత్రీకరించారు. (3/5)
| ||||||
సాంకేతికం
|
2.75/5
| |||||
కెమెరా:
రాకేశ్, నవీన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్ ను తెలియజేస్తూ కొత్త అనుభూతిని కలుగజేస్తుంది. (3/5)
| ||||||
ఎడిటింగ్ :
మార్తాండ్ వెంకటేష్ ఎప్పటిలానే బాగా చేశారు. ముఖ్యంగా పాటల్లో అయన పనితనం ఆకట్టుకుంటుంది. (3/5)
| ||||||
ఆర్ట్ :
వినుత్నమైన పని ఏది చేయనప్పటికీ కధ వస్తువుకు తగ్గట్టు వాతావరణాన్ని సృస్టించటంలో మంచి పనితనం చూపించారు. అలానే పబ్లిసిటీ కోసం రూపొందించిన పోస్టర్లను కొత్తగా రూపొందించి ఆకట్టుకున్నారు. (3/5)
| ||||||
ఫైట్స్ :
పోరాట సన్నివేశాలను సరిగా డిజైన్ చేయలేదు. సహజత్వం కోసం ప్రయత్నించారు అని చెప్పుకోవటానికైనా వాటిలో వైవిద్యం కనిపించదు. (2/5)
| ||||||
తులాభారం
|
2.5/5
| |||||
హెచ్చులు :
| ||||||
తగ్గులు:
| ||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 2.5/5
| ||||||
కొసమెరుపు:
ప్రచారాన్ని ఊదరగొట్టి సినిమాలో మేటర్ కు మంగళం పాడటమంటే.. ప్రేక్షకులను ఊరించి ఊసురనిపించటం కిందకే వస్తుంది. కొంచెం అటు ఇటుగా ఈ కో అంటే కోటి చిత్రానికి జరిగింది ఇదే ..! తెలుగు ప్రేక్షకులు క్రిస్మస్ ను పురస్కరించుకుని దయమయుల్లా సర్దుకుపోతే సినిమా గట్టెక్కుతుంది. కాదు కూడదని హార్ట్ అయ్యేరంటే మాత్రం శర్వానంద్ ను ఎవరు కాపాడలేరు.

No comments:
Post a Comment