Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, December 7, 2012

ఆ టైటిల్ కు అంత డప్పు అవసరమా..?


తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా పయనాన్ని మొదలు పెట్టిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఆ తరవాత తమిళనాడు మీదుగా పయనించి ఇప్పుడు బాలీవుడ్ లో తీస్టేసుకుని కూర్చున్నాడు. వాంటెడ్, రౌడీ రాథోడ్ చిత్రాలతో దక్షిణాది మాస్ మసాలా టేస్ట్ ను బాలీవుడ్ జనాలకి రుచి చూపించి మెప్పించిన ప్రభు ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టొరీ తో వారిని కట్టి పడేయటానికి సిద్దం అవుతున్నాడు. 

అందుకు తొలిసారిగా తానూ దర్శకత్వం వహించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తున్నాడు. ఈ నిర్ణయాన్ని సమర్ధించ వలసిందే.. ఎందుకంటే ప్రభు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటిలో కంటెంట్ పరంగా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేది ఆ సినిమానే..!  గిరీష్ కుమార్ అనే కొత్త నటుడు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి టాలీవుడ్ లో సరి కొత్త చర్చ జరుగుతుంది. అదేమంటే... ఈ సినిమాకు తెలుగు టైటిల్ పెట్టారని వీలైనంత గొప్పలు కొడుతున్నారు. 

దాంట్లో తప్పేముంది సినిమా ఒరిజినల్ టైటిల్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పెట్టుకుంటే మంచిదేగా అనుకోవచ్చు. కానీ మన ప్రభు పెట్టిన టైటిల్ 'రామయ్య వస్తావయ్య..!' అని. ఆ పదాలు తెలుగే అయిన వాటిని వినగానే గుర్తొచ్చేది ఓ హిందీ సినిమా. 1955 లో రాజ్ కపూర్ నటించిన శ్రీ 420 సినిమాలోని 'రామయ్య వస్తావయ్య..!' పాట అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పాపులర్. ప్రభు కూడా సినిమాలో ఉన్న కంటెంట్ కు అనుగుణంగా , ఆ పదాల వల్ల  వచ్చే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ టైటిల్ పెట్టి ఉండొచ్చు. అంతే కాని తెలుగు బాష మీద అభిమానంతో పెట్టి ఉంటాడు అని చెప్పలేం . అందుకని ఇంత  చిన్న విషయానికి 'హిందీ సినిమాకు తెలుగు టైటిల్' అని డప్పులు కొట్టుకోవటం అవసరమా... ? ఆలోచించాలి.  

         

No comments:

Post a Comment