సెప్టెంబర్ నాటికే షూటింగ్ కు చెల్లు చీటీ వ్రాసిన 'గుండెల్లో గోదారి' సినిమా నవంబర్ లో విడుదల అవుతుందని అప్పట్లో ప్రచారం బాగానే జరిగింది. కాని నవంబర్ పూర్తయి డిసెంబర్ కూడా అయిపోవచ్చిందికాని సినిమా విడుదల గురించి ఇంకా ఒక స్పష్టత మాత్రం కనపడటంలేదు. మేడం మంచు లక్ష్మిగారేమో సినిమా సంగతి పక్కన పెట్టి సెంటు బుడ్డులు అమ్ముకుంటుంది. ఈ నెలలో కనుక సినిమా బయటకు రాలేదంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సి వస్తుంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఓ ప్రణాళిక ప్రకారమే మంచు ముత్యం విడుదలలో జాప్యం చేస్తుందని అర్ధం అవుతుంది.
నవంబర్ లోనే రావాలనుకున్నా గోదారి ప్రవాహం డమరుకం, కృష్ణం వందే జగద్గురుం రూపంలో అడ్డుకట్టలు పడటంతో ఆగిపోయింది. తరవాత కృష్ణం... యావరేజ్ పెర్ఫార్మన్స్ కారణంగా డిసెంబర్ మొదటి వారంలో కొంత వక్యుమ్ కనపడినప్పటికి క్యాష్ చేసుకోలేక పోయింది. ఇప్పుడు ఇక మిగిలింది ఈ నెల చివరి వారమే..! అప్పుడు రావటానికి కూడా కొంత ధైర్యం చెయ్యాల్సిందే. ఎందుకంటే 21 న వస్తున్నా రవితేజ 'సారోచ్చారు' హిట్ టాక్ తెచ్చుకుంటే దియేటర్లు దొరకటం కష్టమే అవుతుందీ. పొరపాటున రవితేజ డీలా పడ్డా చివరి వారం లో విడుదలైతే వారం తరవాత పండక్కోస్తున్నా పెద్ద సినిమాలతో పెద్ద గండం ఉంది. సినిమా మీద నమ్మకం , పాటలకోస్తున్నా రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని లక్ష్మి రిస్క్ తీసుకోకుండా సేఫ్ గేమ్ అడే అవకాశాలే ఎక్కువని పెద్దలు విశ్లేషిస్తున్నారు.
కాని పిచ్చాపాటి కబుర్లలో మాత్రం దేనికైనా రెడీ వివాదం సమయంలో ప్రత్యర్ధులు మోహన్ బాబు క్షమాపణ చెప్పకపొతే గుండెల్లో గోదారి సినిమా విడుదల విషయంలో కూడా ఆందోళన చేస్తామని సవాలు విసిరారు. అందుకని ఆ గొడవని అందరు పూర్తిగా మర్చిపోయిన తరవాతే విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మంచు వర్గం ఉందని వినపడుతుంది. అలానే ఒకటిగానే కనిపిస్తున్నా విష్ణు బాబు క్యాంపు, లక్ష్మి క్యాంపు వేరు వేరని.. అందుకే ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా తెచ్చిన నష్టాలే విడుదలలో జాప్యానికి కారణం అని మరో మాట వినపడుతుంది. ఏదెలా ఉన్నా ఇళయరాజా పాటలతో సినిమా మీద కొన్ని అంచనాలు పెంచుకున్నా ప్రేక్షకులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మంచు లక్ష్మి గోదారి తల్లికి మోక్షం ఎప్పడు ప్రసాదిస్తుందో వేచి చూడాలి.

No comments:
Post a Comment