Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 10, 2012

సిరిమల్లి నీడలో చిన్నోడు, పెద్దోడు


సహజంగా మన రాష్ట్రంలో చాలా కుటుంబాలలో ఇద్దరు మగపిల్లలు ఉంటే వారిలో పెద్దవాణ్ణి  పెద్దోడా .. అని, చిన్నవాణ్ణి చిన్నోడా.. అని పిలవటం పరిపాటి. కుటుంబ సభ్యులే కాకుండా చుట్టాలు,పక్కాలు ,తెలిసినోళ్ళు అందరు అలానే పిలుస్తారు. ఇక వాళ్ళుండేది పల్లెటూరు అనుకోండి అక్కడుండే వాళ్ళు  పలానవాళ్ళ చిన్నోడు..  పెద్దోడు అనే కానిచ్చేస్తారు.. అసలు పేర్లతో పని లేకుండా.. ! ఇప్పుడు ఈ సంగతిని ఏంతో ఆత్మీయంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి ఆపాదించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డలా..!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ , వెంకటేష్ అన్నదమ్ములా నటిస్తున్నరన్నా విషయం మనందరికీ తెలిసిందే..! ఈ సినిమా ఉమ్మడి కుటుంబం నేపద్యంగా అందులో ఉన్న ఆత్మీయతలు, అనుబందాలు , ప్రేమల చుట్టూ అల్లుకున్నా పొదరిల్లుగా చెప్పుకుంటున్నారు. ఈ విశేషాలలో భాగంగానే అన్నదమ్ములుగా నటిస్తున్నా హీరో పాత్రలకు ప్రత్యేకంగా పేర్లు పెట్టకుండా సినిమా మొత్తం చిన్నోడు .. పెద్దోడుగానే చలామణి చేయించారంటా...! అసలు పేరు పెట్టి పిలిచే వారు బయటివారు అయ్యుంటారు... కోసరు పేరు పెట్టి పిలిచే వారు స్నేహితులై ఉంటారు... కాని ముద్దు పేరు పెట్టి పిలిచేది మాత్రం..బంధువులే. అలాంటి ముద్దు పిలుపులో మనవాడు అన్నా ఆప్యాయత ఉంటుంది. ఈ హింట్ ను  బట్టి  అర్ధం అవుతుంది ఏమంటే ఈ సిరిమల్లె చెట్టు వెలకట్టలేని అనుభూతులతో సిద్దం అవుతుందని....! 

సినిమాకు సంబంధించి ఒక్కో విషయం తెలుసుకునే కొద్ది దాని ఫై ఆసక్తి అంచలంచలుగా పెరిగిపోతుంది. మరీ ఈ ఆశల పందిరి ఏ  తీరం చేరుతుందో... జనవరి 11 న తేలనుంది. 

   
    

No comments:

Post a Comment