వయసు పెరిగే కొద్ది మనుషులు పెద్దోళ్ళవుతారు... ఆ ఫై ముసలోళ్ళవుతారు. కాని సినేమా హీరోలు మాత్రం అవకశాలు పెరిగే కొద్ది కుర్రోళ వుతారు...కావాలంటే పసోళ్ళవుతారు. తెలుగులో కంటే బాలీవుడ్ హీరోలలో ఎక్కువగా కనిపించే ఈ పరిస్థితిని మన భీమవరం బుల్లోడు సునీల్ గొప్పగా అనుకరిస్తున్నాడు.
సునీల్ హీరోగా నటిస్తున్నా తరవాతి చిత్రం 'మిస్టర్ పెళ్ళికొడుకు' స్టిల్స్ చూస్తుంటే ఈ విషయంలో నిజం ఎంతుందో అర్ధంఅవుతుంది. డాన్సులతోను, ఫైట్స్ తోనూ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన సునీల్ ఇప్పుడు నయ హెయిర్ స్టైల్ కు కొంగొత్త డ్రస్సింగ్ ను జత చేసి కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. కెరీర్ మొదట్లో లావుగా నల్లగా కనిపిస్తూ నవ్వులు పూయించి కామెడీ నటుడిగా తన వృత్తికి న్యాయం చేశాడు. ఇప్పుడు హీరో అయ్యాడు కాబట్టి తానూ నిజంగా హీరో మేటిరియలే అని నిరూపించుకునే ప్రయత్నాలతో బాగానే ముందుకు పోతున్నాడు. ఇదే కమిట్మెంట్ తో సునీల్ స్పీడ్ తగ్గకుండా దూసుకు పొతే తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటాడు అని అనటం అతిశయోక్తి అనిపించుకోదు.

.jpg)



No comments:
Post a Comment