దేవుడంటే..సాయం..! సాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే అని మొన్ననే కృష్ణం వందే జగద్గురుం సినిమాలో చెప్పారు . ఇప్పుడు ఆ వాక్కును నిజం చేయటానికి విక్టరీ వెంకటేష్ రూపంలో దేవుణ్ణి వెతుక్కుంటున్నారు ఆ సినిమా రూపకర్తలు.
అదెలా అంటే వెంకటేష్ ఈ సినిమాలో ఓ నిమిషం పాటు కనిపిస్తాడు అది ఓ పాటలో.... అంతకు మించి కధతో గాని , కధనంతో గాని ఆయనకు ఎటువంటి సంబందము ఉండదు. కాని సినిమాలో నటించిన ఇతర తారాగణం లేకుండా గెస్ట్ రోల్ లో కనిపించిన వ్యక్తీ ఫోటోతోనే సన్ సేషనల్ హిట్ అంటూ పైన చూపించిన పోస్టర్ను విడుదల చేయటం అసలు ఈ సినిమా ఆడుతుందా ..? అటకెక్కిందా ..? అనే అనుమానాలకు అవకాశం ఇస్తుంది.
నిజంగా సినిమా ఆడుతుంది అనుకుంటే సినిమాలో కష్టపడి నటించిన వాళ్ళకి కదా పేరు రావాల్సింది..? అలా కాకుండా మెరుపులా కనిపించి వెళ్ళే వ్యక్తిని పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవటం ఏమిటి ..? ఇక అటకెక్కింది అని అనుకోవాల్సి వస్తే వెంకటేష్ కున్న ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నమే ఈ పోస్టర్ విడుదలలో కనిపిస్తుంది అని భావించాలి.
కాని ఇవన్నీ ఒట్టి పనికిరాని సందేహలే..! అసలు 'అతిధిదేవోభవ' అంటే అతిధి దేవుడుతో సమానం అన్నారు పెద్దలు. అందుకనే రెస్పెక్ట్ గా పోస్టర్ వేశాం అని ఈ సినిమా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇక దేవుడన్నాక ఏంతో కొంత సాయం చెయ్యాలి కదా..! అదే వెంకటేష్ బాబు చేస్తున్నారు. అది అలా కలిసొచ్చిందంతే..! అని సర్దికూడా చెప్పుకోవచ్చు. అప్పుడు మనం విని ఊరుకోవాలి అంతే కాని లాజిక్కులు అడక్కూడదు . ఆఫై దీనినే కృష్ణ మాయ కాదు... కాదు... క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) మాయ...అని అర్ధం చేసుకోవాలి ...!

No comments:
Post a Comment