Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, December 14, 2012

Yeto Vellipoyindi Mansu Movie Review



'ఈగ' సినిమాలో ముచ్చటగా కనిపించిన నాని, సమంతాలా యువ జంటకు మంచి మార్కులే పడ్డాయి, కాని కధ ఆడిన వింత నాటకం కారణంగా వారిద్దరూ ఆ సినిమాలో రొమాన్స్ పండించలేకపోయారు. అందుకని ఇప్పుడు ఆ కొరతను తీర్చటానికి 'ఏటో వెళ్లి పోయింది మనసు' అంటూ ఈ వారం సినిమా హాళ్ళకు వచ్చారు. ఇళయరాజా అందించిన ఒక్క పాటతోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగేంత ప్రచారాన్ని సంపాయించుకుంది ఈ సినిమా. దానికి తోడూ గౌతమ్ మీనన్ బ్రాండ్ మార్క్ రొమాన్స్ , ఆసక్తిగా కనిపిస్తున్న నాని సమంతాలా పాత్రలు ప్రధానంగా యువతను విపరీతంగా ఆకర్షించాయి. పబ్లిసిటీ కూడా వినూత్నంగా సాగటం ఈ సినిమాకు చాలా కలిసొచ్చింది.

దర్శకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఎదుగుతున్న గౌతమ్ తన మొదటి హిందీ చిత్రం (ఏం మాయ చేసావే రీమేక్ ) తో బాగా నష్టపోయాడు. ఇప్పుడు ఒకే సారి రెండు బాషలలో ఈ సినిమాను రూపొందించి ఆ నష్టాన్ని భర్తిచేసే పనిలో ఉన్నాడు. అలానే నానికి  ఈసినిమా విజయం చాలా  కీలకం ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ రేంజ్ అతని మార్కెట్  కెపాసిటీని నిర్ణయించే అవకాశం ఉంది. ఇక అసలు ముఖ్య విషయం ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సి కళ్యాణ్ గురించి.. చందమామ తరవాత అయన చెయ్యి పెట్టిన ప్రతి సినిమా ఒకదానికి మించినది ఒకటిగా పరాజయాలు పాలయ్యాయి. ఆ పరంపరకు ఈ సినిమా అయిన అడ్డుకట్ట వేస్తుందేమో... చూడాలి. ఎవడి భాదలు ఎలా ఉన్నప్పటికీ సినిమా చూడటానికి  వచ్చే ప్రేక్షకుడికి అల్టిమేట్ గా  కావాల్సింది వినోదం. మరి ఆ విషయంగా ఈ  ఏటో వెళ్లి పోయింది మనసు జనాలను ఎటు వైపుకు నడిపించిందో మన సమీక్షలో చూద్దాం .   

కధ : 

ఒకరి కోసం ఒకరుగా పుట్టారేమో...! అని అనిపించే నిత్య ఎలవర్తి , వరుణ్ కృష్ణల జీవితంలో చోటు చేసుకున్నా రసవత్తరమైన  ప్రేమ కధే .. ఈ ఎటో వెళ్లి పోయింది మనసు సినిమా. వాళ్ళిద్దరికీ  ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే స్నేహం రూపంలో ప్రేమ అనే నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. ఆ ఫై వయసు పెరిగే కొద్ది ఆకర్షణ, ఇగో , పంతం,భాద్యతలు వంటి ఎత్తుపల్లాలను దాటుకుని, ఆ అడ్డులు నేర్పిన అనుభవాలను పునాదులుగా చేసుకుని పరిపూర్ణమైన మనసుతో వరుణ్ నిత్యాలు అందమైన ప్రేమ సౌధాన్ని ఎలా నిర్మించుకున్నారు అన్నదే సింపుల్ గా చెప్పాలనుకుంటే ఈ సినిమా కధ.

విశ్లేషణ : 

ఎప్పుడు సింపుల్ కధలకు తనదైన మార్క్ కధనాన్ని జోడించి చప్పట్లు కొట్టించుకునే దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన అదే పంధాను ఈ సినిమాకు కూడా వర్తింపజేసి ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కధగా చూస్తే ఎటో వెళ్లి పోయింది మనసు అతి సామాన్యమైన కధ . కాని కధనంలో కొన్ని బలమైన సన్నివేశాలు పడి ఇది ఓ మంచి సినిమా అని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చాయి. గౌతమ్ మీనన్ లో మరో చెప్పుకోతగ్గ ప్రత్యేకత ఏమంటే తన ప్రతి సినిమాలో ఫ్రెష్ నెస్ అనే పదానికి ఏంతో కొంత ప్రాధాన్యత ఇస్తాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ఫ్రెష్ సన్నివేశాలు కొన్ని మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఆ రిఫ్రెష్మెంట్ ఎలా ఉంటుందంటే ఎంత బాడ్ మూడ్ లో ఉన్నా కూడా ఆ సన్నివేశాలు చూశాక ఫుల్ కూల్ అయిపోతాం...! 

కాకపోతే ఆ కండిషన్ కొన్ని సన్నివేశాలకే పరిమితం. ఎందుకంటే ఈ సినిమాకు మరో యాంగిల్ కూడా ఉంది. అదేమంటే కొన్ని సన్నివేశాలుంటాయి.... పరం రొటీన్ గా... బోరింగ్ గా... నిమిషాల కొద్ది సాగుతూ సహనాన్ని పరీక్షిస్తాయి. గౌతమ్ మీనన్ సినిమా అంటే ఇవి కూడా ఉంటాయి అని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ సినిమాలో అయన ప్రేక్షకులకు ఇచ్చిన వరం ఏమిటంటే... సాగతీత సన్నివేశాలను కొంత తగ్గించి హుషారైన సన్నివేశాలా మోతాదును పెంచటమే. బోర్ కొట్టే సన్నివేశాలను పక్కన  పెట్టి హుషారైన సన్నివేశాల గురించి మాట్లాడుకోవాలంటే వాటి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 

సినిమా చాలా సరదాగా మొదలవుతుంది. మాములుగా మొదలైన సినిమా హీరోయిన్ పరిచయం తరవాత ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంటుంది. ఆ తరవాత వచ్చే సన్నివేశాలను చూస్తూ ఓ అరగంట  సేపు సినిమాలో ఎంతలా లీనమ్ అయిపోతామంటే... ఫస్ట్ లవ్ , ఫస్ట్ రొమాన్స్,ఫస్ట్ కిస్ వంటి పెర్సనల్ అనుభవాలు (ఉంటే ) మన మీద దాడి మొదలు పెడతాయి. వీటికి ఇళయరాజా గారి పాటలు తోడై మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. కాని ఇంటర్వెల్ ముందు ఓ 20 నిముషాలు కొంత రొటీన్ సీరియస్ మూడ్ లోకి సినిమా వెళ్లి కొద్దిగా చికాకు పెడుతుంది. రెండో సగం గొప్పగా లేక పోయిన పరవాలేదనిపిస్తుంది. కాని క్లైమాక్స్ సహా చివరి అరగంటను భరించటం చాలా కష్టం. క్లైమాక్స్ ను రొటీన్ గా ముగించారు. అసలు దర్శకుడికే క్లైమాక్స్ ను కొత్తగా చూపించాలన్నా ఉద్దేశం ఉన్నట్టే అనిపించదు. అలాంటప్పుడు చివరి పార్ట్ ను అరగంట సేపు లగాల్సి వచ్చిన అవసరం ఏమోచ్చిందో ..? అర్ధంకాదు. మొత్తంగా చెప్పేదేమంటే ఇంటర్వెల్ ముందు ఓ 20 నిముషాలు , క్లైమాక్స్ అరగంటతో మనకు సంబంధం లేదు అనుకుంటే సినిమా చాలా బాగుందనే చెప్పాలి. 

రేటింగ్ : 


                                      విభాగాలు 
 రేటింగ్ 
  అభినయం:








3/5
అందరు ఊహించినట్టు గానే నాని, సమంతాలా జంట చూడ ముచ్చటగా కనిపించి ఆకట్టుకుంది. వారిద్దరి మద్య కుదిరిన కెమిస్ట్రీ ఎంతబాగుందో... చెప్పటం కాదు కాని ఓ సారి చూసి ఆస్వాదించండి మీకే తెలుస్తుంది. నాని వరుణ్ పాత్రలో జీవించాడు. కాకపోతే ఇది నాని బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పలేం.. అందుకంటే నాని కొత్తగా కాకుండా ఎప్పుడు నటించేలానే కనిపించాడు. సమంతా మాత్రం బుర్ర బద్దలగోట్టేసే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. స్క్రీన్ మీద తను కనిపిస్తున్నంత సేపు ఫుల్ డామినేషన్ ప్రదర్శించింది. నిత్య పాత్ర స్వభావరిత్య  చూపించాల్సిన షేడ్స్ ను చాల స్పష్టంగా చూపెట్టింది. ఈ సినిమాతో సమంతా నటిగా ఓ నాలుగు మెట్లు ఎక్కినట్టే. ఇక అందం విషయంగా... నిజం చెబుతున్నాను  ఆమె మీద మనసు పారేసుకుంటారు కావాలంటే ట్రై చేయండి. కృష్ణుడు కామెడీ చెయ్యాలని బాగా కృషి చేసి కొంతమేరే సఫలం అయ్యాడు. మిగత నటి నటులు వారి పాత్రలకనుగుణంగా బాగానే చేశారు.     
  దర్శకత్వం:





3/5 
గౌతమ్ మీనన్ గురించి ఇండస్ట్రి లో ఒక నానుడు ఉంది. అయన చేసే సినిమాను ఇంటర్వెల్ వరకే అలోచించి షూటింగ్ కు వెళ్లిపోతాడని...! ఇక మిగత సగాన్ని దాని అదృష్టనికే వదిలేస్తాడని...! ఈ సినిమాలో కూడాఆ ఛాయలు ఉన్నాయని క్లైమాక్స్ ఎపిసోడ్ నీ బట్టి అర్ధం చేసుకోవచ్చు. సాంకేతికంగా అన్ని విభాగాలను అయన ఎంత బ్రిలియంట్ వాడుకుంటారో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అ నైపుణ్యం సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.        
 రచన :








2.75/5
 కధ
           కధనం
మాటలు  
రొటీన్ గానే అనిపించే చాలా సింపుల్ కధ. కాని నిత్య , వరుణ్ పాత్రలను మలచిన విధానం ఆకట్టుకుంటుంది.  2.75/5 
 కధనం కొన్ని చోట్ల చాలా వైవిద్యంగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల అద్వానంగా కనిపిస్తుంది. కాని మంచిగా  కనిపించే సన్నివేశాలు మాత్రం కట్టిపడేస్తాయి. 3/5
 పెద్ద గొప్పగా ఏమి అనిపించవు. అలా అని తీసిపారేసేట్టు ఉండవు. ఓకే నడుస్తాయి..! 
2.5/5
సంగీతం 










3.5/5
 పాటలు 
      నేపధ్య సంగీతం 
    డాన్సులు 
 మాస్ట్రో ఈ సినిమాకు పెద్ద హైలైట్. వినటానికి మాములుగా అనిపించినా చూస్తుంటే.. ఒకదాని తరవాత ఒకటి కనెక్ట్ అయిపోయి మన గుండెల్లో తిష్ట వేసేస్తాయి. అన్ని పాటలు అలరించాయి. 3.5/5 

 పాటల కంటే కూడా బ్యాక్ స్కోర్ తో ఇళయరాజా అద్భుతమే చేశారు. కొన్ని సన్నివేశాల్లో  అయన టైమింగ్ సినిమా మీద మన టోటల్ అభిప్రాయాన్నే మార్చేస్తుంది. ఒక సీన్లో హీరోయిన్ తన లవ్ ప్రపోజ్ చేస్తుంది అప్పుడు హీరో వైపు నుండి ఎక్స్ ప్రెషన్ బ్యాక్ లో ' ఏది... ఏది.. కుదురేది..' అనే పాట. ఆ ఆలోచన ఎంత బాగుందంటే... మాస్ట్రో కు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే...! 4/5     

 డాన్సులకు పెద్ద  స్కోప్ లేకపోయినా  అన్ని పాటలను చాల చక్కగా చిత్రికరించారు. 

3/5
సాంకేతికం 








2.75/5
 కెమెరా
ఎడిటింగ్ 


 సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మూడ్ కు తగ్గట్టు ప్లెజెంట్ గా ఉంది. 

3/5 

  సినిమాలో లెంగ్త్ ఎక్కువున్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మరింత షార్ప్ గా కత్తెరకు పనిచేబితే బాగుండేది. 2.75/5 




తులాభారం





3/5
           హెచ్చులు 
తగ్గులు 
  •  ఇళయరాజా సంగీతం 
  • నాని, సమంతా జోడి 
  • ఫస్ట్ హాఫ్ 


  •  కొన్ని లెంగ్తి సన్నివేశాలు 
  • కామెడీ లేకపోవటం 




                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  3/5

కొసమెరుపు: 

యూత్ ను అందులోను ప్రేమికులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ సహా ఓ మూడు నాలుగు సన్నివేశాలు మినహా సినిమా అంత చాలా బాగుంటుంది. టైం పాస్ కో , సరదాకో ఫ్రెండ్స్ తో ఒకసారి ట్రై  చెయ్యవచ్చు. అలాగే ఇళయరాజా అంటే ఇష్టం ఉంటే మాత్రం ఈ సినిమాను అసలు మిస్ అవ్వొద్దు.

సూచన:

క్లైమాక్స్ , దానికి ముందు జరిగే అరగంటలో విషయమే ఉండదు. కావాలంటే వచ్చేయ్యొచ్చు. కాదు కూడదు అనుకుంటే ఆ అరగంట మంచి కునుకేయ్యండి..! సినిమా అయిపోగానే  'లాయి...లాయి..ఇలా ఈ హాయి నిదే సుమా.!' అంటూ ఇళయరాజా నిద్రలేపుతారు చక్కా ఇంటి కొచ్చేయండి.         




       

  

               

No comments:

Post a Comment