Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 10, 2012

నెక్లెస్ రోడ్ ను వ్రాయించుకుంటున్నా రామ్ చరణ్


..అంటే నాన్న కేంద్ర మంత్రి కాబట్టి కట్నంగానో... కానుకగానో.... అని ఊహించుకుని ముక్కుకి వేళ్ళకి పని చెప్పవద్దు.... ! జస్ట్ తన సినిమాలకు సంబంధించి ఫంక్షన్లను భారి ఎత్తున్న జరుపుకోవటానికి  నక్లేస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాను  శాశ్వత అడ్డగా ఎంచుకున్నట్టు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

వినాయక్ దర్శకత్వంలో చెర్రి నటిస్తున్న నాయక్ సినిమాకు సంబందించిన పాటల విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 15 న భారి ఎత్తున నిర్వహించ తలపెట్టారు. తొలుత శిల్పకళ వేదిక లో కార్యక్రమాన్ని పూర్తీ చేద్దాం అనుకున్నప్పటికి ఆ వేదిక సరిపోదని అభిమానుల నుండి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి  నెక్లెస్ రోడ్ కు మకాం మార్చారు. గతం లో కూడా రచ్చ సినిమా కోసం ఎక్కడెక్కడో వేదికలు వెతికి చివరికి ఇక్కడికే చేరారు. క్రౌడ్ ను అపరిమితంగా కవర్ చేయగల కెపాసిటీ కలిగిన పీపుల్స్ ప్లాజా లో సినిమా వేడుకలు చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటిది వరసగా తన పంక్షన్లను అక్కడే జరుపుకోవటం చూస్తుంటే... ఆ ప్లేస్ ను తన పర్మనెంట్ వేదికగా కబ్జా చేయటానికే చెర్రి డిసైడ్ అయ్యినట్టు అర్ధం అవుతుంది.  

సినిమా సినిమాకు అశేషంగా అభిమానులను పెంచుకుంటూపోతున్నా రామ్ చరణ్ ఈ సంక్రాంతి పండక్కి నాయక్ తో సందడి చేయనున్నాడు. ఈ లోపు వచ్చే వారం విడుదల కానున్న పాటల  కోసం మెగా అభిమానులు ఆతురతగా వేచి ఉన్నారు. రామ్ చరణ్ కోసం తోలి సారి పనిచేస్తున్న తమన్ ఎటువంటి పాటలు సృస్టించాడో... చూడాలని  సర్వత్ర ఆసక్తి నెలకుంది. ఆ ఆసక్తికి కొంత ఉత్సాహాన్ని జోడిస్తూ నాయక్ పాటల ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది... వాటి కోసం కింద చూడగలరు.

1)  నాయక్ (టైటిల్ సాంగ్)
2)  నేనంటే అంత ..
3)  దేవుడైన ప్రేమకి ...
4)  చిన్నా పెద్ద...
5)  ప్రపంచంలో...
6) శుభలేక వ్రాసుకున్న...(రీమిక్స్ )

      

No comments:

Post a Comment