కమిడియన్ గా ఉన్నప్పుడు అనుభవించు రాజా ...! అంటూ కులాసాగా కాలాన్ని ఎంజాయ్ చేసిన సునీల్ ఇప్పుడు హీరోగా మారి కొత్త టెన్షన్ లు పడుతున్నాడు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో టెన్షన్ లు కామనే.. కాకపోతే రేపు సినిమా విడుదల అంటే ఈ రోజు ఉండే టెన్షన్ చూడండి.... అబ్బో... పిచ్చేక్కించేస్తుందండి బాబు...! అంటున్నాడు ఈ భీమవరం చిన్నోడు.
సునీల్ టెన్షన్ కు అర్ధం ఉంది. ఎందుకంటే ఈ మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలో మనోడు కొన్ని ప్రయోగాలు చేశాడు, వాటిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అని ప్రధానంగా టెన్షన్ పడుతున్నాడు. తన కున్నా ఫాలోయింగ్ కు బిన్నంగా కొంచెం సెంటిమెంట్ ను వర్క్ అవుట్ చేయటానికి ప్రయత్నించిన సునీల్ బాగానే చేసాడని అంతర్గత వర్గాలు సమర్దిస్తున్నప్పటికి ఆడియన్స్ తీర్పే అల్టిమేట్ కాబట్టి ఈ టెన్షన్ అని ఈ కామెడీ బాబు కలవరాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.
సునీల్ వరుకే కాదు హిందీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కధ పరంగా కూడా కొన్ని అనుమానాలను కలిగిస్తుంది. తను వెడ్స్ మను మాస్ టచ్ ఉన్నా క్లాస్ సినిమా. అది అక్కడ కూడా అందరిని అలరించిన సినిమా ఏమి కాదు. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ప్రేక్షకుల ఆమోదంతోనే హిట్ అనిపించుకుంది. కాని ఇక్కడ అందుకు పూర్తీ భిన్నం, సునీల్ మల్టి ప్లెక్స్ ల హీరో కాదు.. మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ, అలాంటిది ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎలాంటి మార్పులు చేశారన్నదే సినిమా విజయానికి కీలకం కానుంది.
ఈ సినిమా దర్శకుడు దేవి ప్రసాద్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం రీమేక్ లను ఫ్రెష్ గా ప్రెజెంట్ చేసే చరిత్రే..! అందువల్ల దేవి ప్రసాద్ సమయస్పూర్తి, సునీల్ చలాకితనం సమపాళ్ళలో మిళితం అవుతే సినిమా విజయం సాదించటం లంచానమే...! కాని తేడా జరిగితే మాత్రం పరాజయం కూడా లంచానమే...! చూద్దాం ... ఈ కొత్త పెళ్ళికొడుకు (హీరో గా ) ఎటువంటి ఫలితాన్ని దక్కించుకొబొతున్నాడో...!

No comments:
Post a Comment