అభిమానం పలు రకాలు , అందునా సినిమా అభిమానం లెక్క లేనన్ని రకాలు..! వెర్రాభిమానం, వీరాభిమానం, భీభాత్సాభిమానం, పవనాభిమానం. ప్రత్యేకంగా పవనాభిమననేదే ఒక రకం.. ఎందుకంటే పవన్ ను అభిమానించటానికి కారణం అవసరం లేదు కటౌట్ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి అభిమానులు ఇతర హీరోలకు ఉండటం చాలా అరుదు. అలాంటిది ఓ అరుదైనా అభిమానిని దక్కించుకున్నా నితిన్ బోర్డర్ దాటినా అభిమానం ఇచ్చే కిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇంజినీరింగ్ చదువుతున్నా ఆ అభిమాని అసలు ఏమి చేశాడంటే..... బుద్దిగా పరీక్షవ్రాయరా.. అని పేపర్ ఇస్తే.. సమాధానాలు గుర్తుకు రాలేదో ఏమో.... ? శ్రద్దాగా తను అభిమానించే హీరో నితిన్ బొమ్మ గీసి చక్కా వచ్చాడు. ఈ కుర్రాడి టాలెంట్ ను గుర్తించిన మాస్టారు వెరీ గుడ్ అని మెచ్చుకుంటూ ఓ పేద్దా గుండుసున్నా వేశారు. ఈ ఘనకార్యాన్ని సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ వేదికగా ప్రచారానికి ఉపక్రమించిన కుర్రాడి ప్రయత్నం మొత్తానికి నితిన్ ను చేరింది. విషయం తెలుసుకుని ఉబ్బి ఉప్పుబస్తా అయిన నితిన్ ఆ అభిమానిని సున్నితంగా మందలించాడు. కాని జూనియర్ పవన్ కళ్యాణ్ అంటుంటే మురిసిపోతున్నా నితిన్ ఆయనకు ఉన్నటువంటి అభిమానే తనకు దొరకటాన్ని ఆనందంగానే ఎంజాయ్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది.
కాకపోతే ఇలాంటి శృతి మించిన అభిమానం వల్ల హీరోలకు ఒరిగేదేమీ ఉండదు మహా అయితే ఒక రోజు పబ్లిసిటీ దొరుకుద్ది, కాని అభిమాని ప్రయత్నం వికటిస్తే... జీవితం నాశనం అవుతుంది ఆలోచించుకోండి..!
No comments:
Post a Comment