Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 1, 2013

గంగ్ నమ్ స్టైల్ ట్రై చేసిన ఎన్టీఆర్ ...?


బాద్ షా కోసం ఎన్టీఆర్ గంగ్ నమ్  స్టైల్ ట్రై చేశాడా ...? సంకేతాలను చూస్తుంటే బుజ్జి ఎన్టీఆర్ గంగ్ నమ్ స్టైల్ తో ఒక ఆట అడుకున్నట్టే తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ఈ స్టైల్ ను చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాడు అని ఆధారాలు లేని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన అనుమానాన్ని పెద్దది చేయటానికి ఒక ఆధారం అధికారికంగా బయటకు వచ్చింది. 

ఈ రోజు సంగీత దర్శకుడు తమన్ బాద్ షా కు సంబందించిన సరికొత్త వాల్ పేపర్ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా గంగ్ నమ్  స్టైల్ లో నర్తిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కంటే కూడా వెనుక ఉన్న డాన్సర్ ఆ స్టైల్ ను స్పష్టంగా అనుకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఫైనా ఉన్న ఫోటోను పరిశీలనగా చూస్తూ... గంగ్  నమ్ పాటను గుర్తుకుతెచ్చుకుంటే  పోలికలు తప్పక తడతాయి ప్రయత్నించండి. అలానే పాపులారిటి ఉన్న విషయాలను భలే గమ్మతుగా కాపి కొట్టే నైజం శ్రీను వైట్ల సొంతం. సో.. ఈ  స్టైల్ ను తనదైన స్టైల్ లో బాద్ షా లో చూపించి ఉంటాడు అని అభిప్రాయపడొచ్చు. 

 డాన్సులకు రారాజు అయిన చిన్నాఎన్టీఆర్ గత కొన్ని సినిమాలుగా మూస స్టెప్పులతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ఆ కొరతను ప్రపంచాన్ని ఒక  ఊపు ఊపిన ఈ స్టైల్ తో తీర్చటానికి సిద్దం అవుతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. మనసుపెట్టి చేస్తే ఎన్టీఆర్ కు లొంగని స్టైల్ అంటూ ఉండదు. అలాంటి ఎన్టీఆర్ ఇష్టపడి గంగ్ నమ్  స్టైల్ ను చేసి ఉంటే కనుకా... అబ్బో.. ఆ దృశ్యాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఏమాటకామాటే..ఎన్టీఆర్ ఈ పోస్టర్ లో పూర్తి ఫ్రెష్ గా కనిపిస్తూ మతిపోగోడుతున్నాడు. యమదొంగ తరవాత అంతా  ఫ్రెష్ గా , అంత గ్లామర్ గా కనిపిస్తుంది బాద్ షా లోనే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా మీద అంచనాలు వీపరీతంగా ఉన్నాయి. ఇలాంటి ఫొటోలే మరి కొన్ని బయటకు వచ్చాయంటే.. ఆ తరవాత  బాద్ షా ఫై  జనాలలో పెరిగే ఆసక్తికి ఆనకట్టలు వేయటం కష్టమే అవుతుంది.

    

No comments:

Post a Comment