'వెన్నెల' తో సినిమాలు తియ్యటం మొదలు పెట్టి 'ప్రస్థానం'తో పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి బలమైన పూనదులు వేసుకున్న ప్రవాసాంద్ర దర్శకుడు దేవా కట్టా తన సినిమా కెరీర్ లో మరో ప్రస్థానానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కొత్తవాళ్ళు, మరుగున పడిన స్టార్లు, బుల్లి స్టార్లను మాత్రమే డైరెక్ట్ చేసిన దేవా త్వరలోనే 'యాక్షన్..!" అంటూ వెంకటేష్ బాబుతో నటవిన్యాసాలు చేయించాటానికి సన్నద్ధం అవుతున్నాడు.
అయోమయంగా ఉన్నా ఆటోనగర్ సూర్య భవితవ్యాన్ని భగవంతునికి వదిలేసి తరవాత ఏ చిత్రం చెయ్యాలి అన్నా విషయం ఫై దేవా కట్టా తీరికలేకుండా ఉన్నట్టు తెలిసినవాళ్లు చెబుతున్నా సమాచారం. ఆ క్రమంలోనే దేవా నానితో సినిమా చేస్తున్నాడననే వార్తలు ఈ మద్య వినిపించాయికాని వాటిని ఎవరు నిర్ధారించలేదు. ప్రస్తుతం ఫిలింనగర్ నుండి అందుతున్నా సంకేతాలను బట్టి వెంకటేష్ తో దేవా కట్టా సినిమా దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అడ్డాలా చంటి నిర్మించతలపెట్టారని భోగట్టా...!కధ చర్చల దశలో ఉందని చెబుతున్నా ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన తొందర్లోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఒక పక్క మల్టిస్టారర్ మరో పక్క సోలో చిత్రాలను నడిపిస్తూ జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నా వెంకి, రామ్ తో కలిసి విజయభాస్కర్ దర్శకత్వంలో హిందీ బోల్ బచ్చన్ రీమేక్ లో నటిస్తూనే సమాంతరంగా ఈ సినిమా పూర్తిచేస్తాడు అని తెలుస్తుంది. వెంకితో సినిమా ఒకే కాని దేవా కట్టా ఏంతో అత్తారు బోత్తంగా రూపొందించుకున్నా 'ఆటో నగర్ సూర్య ' గురించి చెప్పాల్సి వస్తే మాత్రం ఇప్పుడప్పుడే ఆ సినిమా స్టోర్ రూం గడప దాటే సూచనలు లేవని చెబుతున్నారు.

No comments:
Post a Comment