Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 28, 2013

జబర్దస్త్ కు బ్యాండ్ బజ్ గయా ..!

విడుదల అయ్యి టాక్ బయటకు వచ్చాకా  జబర్దస్త్ సినిమా గురించి రెండు రోజుల క్రితం వరకు హీరో సిద్దార్థ్ మినహా మిగత వాళ్ళు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు తన గురించి ఎవరు మాట్లాడుకోవటంలేదని తానే సొంతంగా కొన్ని వివాదాలను సృష్టించుకుని తన బ్యాండ్ ను తానే బజాయించుకుంటుంది ఆ సినిమా. 

అయినా కూడా రెస్పాన్స్ రాకపోవటంతో ఈ సినిమా గురించి ఈ వారం  తరవాత మాట్లాడుకునే వాళ్ళే కరువైపోయే పోయే పరిస్థితి ఏర్పడనుంది. బ్యాండ్ బాజా బారత్ సినిమాకు కాపి అనే వివాదానికి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవటం, ఆ సినిమాను నాని తో తెలుగులో రిమేక్ చెయ్యలనుకున్న యష్ రాజ్ వాళ్ళు కూడా సినిమా ప్లాప్ అన్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని దాని గురించి పెద్దాగా పట్టించుకోక పోవటం, అన్ని చోట్ల సినిమాకు వసూళ్ళు తగ్గటం ఇవన్నీ కలిసి జబర్దస్త్ కు ఘనంగానే బ్యాండ్ బజాఇస్తున్నాయి. 
    
అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో విషయం లేక పోవటమే...! మరో కారణం... ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్నా ఒక్కగానొక్క దర్శకురాలు నందిని రెడ్డి రెండో సినిమాకే అతి విశ్వాసాన్ని ప్రదర్శించి లేనిపోని సమస్యలను జబర్దస్త్ గా తలకెత్తుకుంది. అక్కడి తో అగాకుండా వాటిని దీటుగా ఎదుర్కుంటూ తనలో ఉన్నా రెబెల్ తత్వాన్ని బహిర్గతం చేసింది. ఫలితం పేరు ఖరాబు చేసుకోవటమే కాని ఒరిగేది ఏమి లేదు. సిద్దు లెక్కల ప్రకారం (సిద్దు అభిప్రాయం ) నిర్మాత సేఫ్ అవుతాడు కాని ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టపోయేది సినిమాకు పనిచేసిన వాళ్ళే...  అందునా ఎక్కువ నోరు పారేసుకున్నా వాళ్లే ...! ఇలా కొన్ని తెలిసి...  చాలా తెలియక జరిగిన పొరపాట్లు కారణంగా ఈ సినిమా కొంతమందికి బ్యాండ్ బజాయించటానికి రెడీ అయ్యింది. దాని ఫలితాలు త్వరలోనే బయటకు వస్తాయి.. మనం చూస్తాము కూడా...! 

No comments:

Post a Comment