చాలా మంది తమిళ హీరోలు తెలుగును సెకండ్ మార్కెట్ జోన్ గా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే ఓ తమిళ హీరో మాత్రం పాటగాడిగా తెలుగులో తిష్ట వేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అందుకోసం అతను వేసిన తోలి అడుగు చిన్నదే అయిన రెండో అడుగు మాత్రం ఎన్టీఆర్ తో కలిసి ఘనంగానే వేస్తున్నాడు.
ఆ క్రమంలోనే ఇప్పుడు శింబు తన స్వరాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు అరువిచ్చి సరికొత్త అధ్యాయానికి తెర తీశాడు. ఈ మద్యనే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కోసం ఓ పాట పాడి తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ సిన్నోడు వెంటనే NTR కోసం పాటపాడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి తెలుగులో సెటిల్ అవటం కోసం పూనది బాగానే వేసుకున్నాడు.
NTR హీరోగా తెరకెక్కుతున్నా బాద్ షా సినిమా కోసం స్వరపరిచిన 'డైమండ్ గర్ల్..' పాటను తమన్ శింబుతో పాడించిఅందరిని ఆశ్చర్యపరిచాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కోసం శింబు పడిన జగడ . జగడ .. పెద్దగా ఆసక్తి కలిగించలేదు కాబట్టి ఫోకస్ అంత బాద్ షా వైపుకు తీరిగే అవకాశం ఉంది. చూద్దాం... బాద్ షా శింబును గాయకుడిగా టాలీవుడ్ లో ఎంత వరకు నిలబెడుతుందో...!
No comments:
Post a Comment