Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 13, 2013

నమ్మండి ప్లీజ్..! అంటున్నా పవన్ కళ్యాణ్ నిర్మాత


నమ్మండి ప్లీజ్ అని అర్ధం వచ్చేలా పవన్ కళ్యాణ్ ప్రాణం పోసిన నిర్మాత బండ్ల గణేష్ చేసిన వేదన భరిత విజ్ఞప్తిని చదువుతుంటే మనసు మంచులా కరిగిపోతుంది. సినిమా పరిశ్రమ అంటే కష్టాలుంటాయి.. ఫేమ్ వస్తే మ్యాజిక్ లు జరుగుతాయి.. ఉన్నపళంగా కోట్లకు పడగలెత్తుతారు. ఇది జగమెరిగిన సత్యం. ఇలా అన్ని తెలిసి కూడా వేదనలకు దిగటం భాద కలిగిస్తుందని గణేష్ బాబు కలవరపడుతున్నాడు. 

ఇంతకీ ఈ కలవరానికి కారణం ఏమిటంటే నిన్న గణేష్ బాబు ఫై వాణిజ్య పన్నుల శాఖ దాడులు జరిపి పన్ను కట్టని సంపాదనను కనిపెట్టి కోటి రూపాయల వరకు టాక్స్ వసూలు చేసేందుకు సిద్దం అయ్యిందని సమాచారం. ఆ భాదను దిగమింగలేకే  ఎవరో రాజకీయ లబ్ది కోసమే బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గణేష్ బాబు. కాకపోతే ఇక్కడే ఒక చిన్న అనుమానం.. సంపాదనకు తగ్గట్టు ప్రభుత్వానికి చట్టా ప్రకారం పన్ను కట్టమనటం రాజకీయ లబ్ది ఎలా అవుతుందో.. అర్ధం కాలేదు. అలానే కస్టపడి ఎదిగిన వాడిని నమ్మదు లోకం. అదే దౌర్భాగ్యం అని తెగ భాదపడుతున్నాడు. అదే నిజం అయితే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, అంబానీల వంటి వారిని ఎందుకు నమ్ముతుందో ఈ వెర్రి లోకం..!   

తన భాదను వివరంగా విపులికరిస్తూ... ఓ నోట్ ను విడుదల చేశాడు గణేష్ బాబు. అందులోని సారాంశాన్ని ఎవరికీ తోచినట్టు వారు అర్ధం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాడు.అంటే కొన్ని విషయాలు చదువుతుంటే నమ్మాలనిపిస్తుంది.మరికొన్నిటిని చూస్తుంటే భుజాలు తడుముకుంటున్నాడు అనిపిస్తుంది. మీరు కూడా చదివి ఆ వేదనలో నిజాయితీ ఎంతుందో కనిపెట్టండి. 



No comments:

Post a Comment