Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, February 23, 2013

వెరైటీ టైటిల్ తో పవన్ సంచనలం


పవన్ కళ్యాణ్ కు సంబందించినదిగా  చెప్పుకుంటున్నా ఓ సినిమా టైటిల్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో సంచలనం సృష్టిస్తుంది. ఓరినీ అసాద్యంకూల.. టైటిల్ కే సంచలనం ఏమిటి అని తీసి పారేయొద్దు.... మీరూ కూడా ఆ టైటిల్ వింటే ముందు బ్లాంక్ పేస్ పెడతారు తరవాత బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు.

అవునుమరీ...  అంత విశేషం ఉంది ఆ టైటిల్లో..! నాన్చింది చాలు ఇంతకీ ఆ పేరేంటి ..? అని మీకు నిలదీసే ఛాన్స్ ఇవ్వకుండానే చెప్పేస్తున్నాను..... 'కో ... బలి (నరుకు... బలి)' ..! మీరు సరిగానే చదివారు,నేనూ ఒళ్లుదగ్గర పెట్టుకునే వ్రాసాను. ఈ టైటిల్ రీసెంట్ గా ఫిలిం చాంబర్ లో పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్  ఫై రిజిస్టర్ అయ్యింది, ఈ వార్త అబద్దం కాదు నిజం అని నమ్మించటానికి ఇంతకు మించిన అధికారిక ఆధారం మరోటి అవసరంలేదు. 

ఇంతవరకు బానే ఉంది కాని.. అసలు ఆ టైటిల్ అర్ధం ఏమిటి..? దానిని ఎందుకు కోసం నమోదు చేశారు అన్న విషయం మాత్రం పెద్ద ఫాజిల్ గా తోస్తుంది. పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా ఈ టైటిల్ గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ  'కో ... బలి (నరుకు... బలి)'  పేరు వెనుక ఉన్నా రహస్యం ఏమిటో పవన్ తలుచుకుంటే కాని బయటకు వచ్చే సూచనలు కనిపించటంలేదు. అందుమూలంగా  తెలియజేసేదేమంటే... ఈ పేరుకు సంబందించి పవర్ స్టార్ రేకెత్తించిన కుతూహలాన్ని కొన్నాళ్ళ పాటు ఎంజాయ్ చేస్తూ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తూ ఉండండి..! 

No comments:

Post a Comment