ఢిల్లీ అత్యాచార ఘటన తరవాత కామందులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు రావాలని యావత్ భారతదేశం కోరుకుంది. అందుకు అనుగుణంగానే ఒక కమిటి ఏర్పడి కొన్ని శిక్షలను ప్రతిపాదించింది. కాని ఆ శిక్షలకు ఇంకా చట్టబద్దత రాలేదు. ఈ లోపు నిపుణులు సూచించిన శిక్షలు దుర్మార్గులను మనుషులగా గుర్తిచేందుకు అనుకూలంగా ఉన్నాయని, వారు మనుషులు కాదు రాక్షసులు కాబట్టి ఈ సరళమైన శిక్షలు(జీవిత ఖైదు, జీవితాంతం జైలు,ఉరి ) కాకుండా ఇంకా కఠినమైన శిక్షలు వేయాలని కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో సినీ నటి త్రిష కూడా అలాంటి దుర్మార్గులకు కొత్తరకం శిక్షలు వేయాలని సూచిస్తుంది.
మనసున్నా ప్రతి మనిషిని కలచివేసిన ఢిల్లీ ఘటన ఫై చాలా మంది చాలా రకలైనా అభిప్రాయాలను వెలిబుచ్చారు. కాని త్రిష సూచించిన మార్గంలో శిక్ష కఠినంగా అమలు కావటమే కాదు జీవకారుణ్య కోణం కూడా దాగుంది. ఇంతకీ త్రిష ఏమి చెబుతుందంటే ... అమాయకమైనా నోరులేని జీవాలను ప్రయోగాల పేరుతొ ప్రయోగశాలలో నానా హింసలు పెడుతున్నారు, వాటి బదులు ఆడవారి ఫై అమానుషానికి ఒడిగడుతున్నా మనుషులనే మృగాలను ఆ ప్రయోగాల కోసం వాడుకోవచ్చుగా అని తన అభిప్రాయాన్ని బహిర్గతం చేసింది. త్రిష ప్రతిపాదనలో ఉన్నా వాస్తవాన్ని విస్మరించలేం కాని ఎంత దుర్మార్గుడైనా మనిషి మనిషే... పశువు పశువే,,,! మరి ఇలాంటి పరిస్థితుల్లో త్రిష సలహాను పరిగణలోకి తీసుకోవటం కష్టమే కాని ఆమె అభిప్రాయం మాత్రం గౌరవించతగ్గది.
No comments:
Post a Comment