సఖి తరవాత పెద్ద పెద్ద ఎవ్వరాలను సినిమాలుగా చేసుకుంటూ పోయి కుర్రకారును పట్టించుకోవటం మానేసిన మాస్టర్ పిస్ సినిమాల దర్శకుడు మణిరత్నం మళ్లీ ఇన్నాళ్ళకు యూత్ మంత్రాన్ని జపిస్తూ 'కడలి' సినిమాతో ఈ వారం దియేటర్లకు వచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాను వ్యాపారంగా కాకుండా 'కళ 'గా మాత్రమే భావించే... దేశం గర్వించ తగ్గ ఉత్తమమైన సినిమా సేవకుడు మణిరత్నం. ఎన్ని పరాజయాలు ఎదురైనా సినిమాలతో ప్రయోగాలు చేయటం మాత్రం మానని ఈ సినిమాతపస్వి 'కడలి' చిత్రంలో ఎటువంటి ప్రయోగం చేశాడో..మన సమీక్షలో చూద్దాం .
కధ :
బైబిల్ ను క్షుణ్ణంగా అవపోసన పట్టిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తీ యేసును నమ్మితే మరో వ్యక్తీ సైతాను ఫై నమ్మకం పెంచుకుంటాడు. వాళ్ళే ఫాదర్ సామ్(అరవింద్ స్వామి), మీసాల దోరగా పిలవబడే బర్గ్స్ మాన్ (అర్జున్). దేవుని కోసం భోగభాగ్యాలను వదులుకుని సన్యాసిలా బ్రతుకుతుంటాడు సామ్. పేదరికంలో పుట్టి ఆకలిని జయించటం కోసం భోగభాగ్యాలను వెతుక్కుంటూ సైతాను బాట పడతాడు మీసాల దొర. సామ్ మూలంగానే మీసాల దొర ఆ వైపు నడవాల్సి వస్తుంది. అందుకని కర్కోటకుడిలా మారిన మీసాల దొర సామ్ ఫై విషం కక్కే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు.
అలానే అనుకోకుండా ఇద్దరు మత్స్యకారులతోనే వారి జీవితాలను పెనవేసుకుంటారు. సామ్ వారిని సంస్కరించాటానికి ప్రయత్నిస్తూ ఉంటే మీసాల దొర వారిని దోచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే అనాధ అయిన థామస్ (గౌతమ్ ) ను చేరతీసి మంచి బుద్ది నేర్పిస్తాడు సామ్. కాని మీసాల దొర తన ప్రతికారంలో భాగంగా సామ్ ఫై నింద మోపి అతన్ని జైలుకు పంపి మంచివాడిగా ఉన్నా థామస్ ను పాపాల రొంపిలోకి దింపుతాడు. ఆవేశపడి తప్పులు చేసి పాపాభీతితో ఉన్న థామస్ ను ప్రియ(తులసి) తన సాంగత్యం తో తిరిగి మంచివాడిగా మారుస్తుంది. ఈ విషయాన్నీ తట్టుకోలేక అరాచకం సృస్టించటానికి పూనుకున్న మీసాల దొరను థామస్ ఎలా ఎదుర్కున్నాడు అన్నది ఆ ఫై మిగిలిన కధ.
విశ్లేషణ :
ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన సవరణ ఏమిటంటే... ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కాదు. ఒక పరిపక్వతతో కలిగిన బలమైన డ్రామా. ఆ దృష్టితో చూస్తే సినిమా పర్వలేదును మించి బాగుందనిపిస్తుంది. అలాకాకుండా యూత్ ఫుల్ కోణంలో చూస్తే మాత్రం పర్వలేదుకు తగ్గి బాగాలేదనిపిస్తుంది. ప్రచారంలో ఈ విషయాన్నీ స్పష్టం చేయకుండా యూత్ ఫుల్ కోటింగ్ ఇవ్వటం సినిమాకు నష్టాన్ని కలిగించింది. ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే మణిరత్నం సినిమాగా ఈ చిత్రంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో.. కొన్ని పొరపాటులు ఉన్నాయి.
విశేషాల విషయానికి వస్తే మంచి చెడుల మద్య జరిగే సంఘర్షణ ఇతివృత్తం కావటం, సముద్ర తీరాన జీవించే మత్స్యకారుల నేపద్యం, పాత్రలకు వన్నె తెచ్చిన నటి నటులు , మణిరత్నం మార్క్ టేకింగ్, ముచ్చట గొలిపే రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ, హాట్స్ ఆఫ్ అనాలనిపించే సాంకేతిక నైపుణ్యం, రెహమాన్ బ్యాక్ స్కోర్ ఇవి ప్రధానంగా ఈ సినిమాను మిగత సినిమాలకు చాలా దూరంగా పెట్టి చూపిస్తాయి. అలానే కధ , కధనాల పరంగా బలమైన అంశాలను వదిలేసి బలహీనమైన పాయింట్స్ పట్టుకుని సినిమాను నడిపించటం ఈ సినిమాలో జరిగిన పెద్ద తప్పు. నాయకుడు సినిమాకు ఉన్నంత పోటెన్షియాల్ కడలి కధకు ఉంది. కాని ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమాను నాయకుడు తో ఏ రకంగాను పోల్చలేం.
అలా అని మరి తక్కువ చేసి చూడాల్సిన సినిమా కాదు. మణిరత్నం మనో ఫలకం నుండి తెర ఫైకెక్కిన కొన్ని అద్భుత సన్నివేశాలు ఈ సినిమాలోనూ ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు సినిమా మొదటి సగం కనిపిస్తాయి. మీసాల దొర, సామ్ ల పరిచయం పగగా మారే క్రమం, హీరో చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే అమ్మ చనిపోతే దిక్కు లేని ఆమెకు అంత్య క్రియలు జరిగపేప్పుడు నడిచే హృదయాన్ని ద్రవింప చేసే సన్నివేశాలు, హీరోకు, సామ్ కు పరిచయం జరిగే విధానం, మత్స్యకారుల జీవన విధానాన్ని చెప్పిన వైనం, సామ్ ఫై మీసాల దొర పగ తీర్చుకునే పద్దతి ఇలా విశ్రాంతి ముందు వరకు దాదాపు అన్ని సన్నివేశాలను గొప్పగా చూపించారు మణి . అంతే కాదు విశ్రాంతి సమయానికి సినిమాలోని పాత్రలకే కాదు ఎమోషనల్ గా ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తి కలిగిస్తారు.
కానీ ఊహించని పరిణామాలతో సినిమా డ్రాప్ అవటం మొదలవుతుంది రెండో సగంలో.. . దానికి కారణం ఇంటర్వెల్ ముందు వరకు ప్రధాన పాత్రలన్నిటికి ఒక చాలెంజ్ ను కల్పించిన కధ... రెండో సగంలో వాటిని మర్చిపోయి సందేశాలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయటమే..! తనను అప్రతిష్టపాలు చేసిన మీసాల దొరను దేవుని సాయంతో గెలుస్తానని సవాలు చేసిన సామ్ ఆ వైపుగా ప్రయత్నాలు చేయకుండానే చివరి ఏమి చేయలేక అతని ఫై తిరగబడతాడు. అలానే తనను ఎవరు ఏమి చేయకపోయిన సినిమాను ముగించటం కోసం అకస్మాత్తుగా మంచి వాళ్ళందరి మీద దాడి మొదలు పెట్టి తన్నులు తిని ఓడిపోయానని ఒప్పుకుంటాడు మీసాల దొర. ఇక రెండో సగం లోనే చిగురులు వేసిన హీరో హీరోయిన్ ల మద్య ప్రేమలో మణిరత్నం మార్క్ రొమాన్స్ మిస్ అవ్వటం నిరాశ పరుస్తుంది. వీటన్నిటి కంటే తట్టుకోలేని విషయం గుంజుకున్నావ్.. పాటకు సినిమాలో చోటు ఇవ్వకపోవటం. ఆ పాటను చిత్రీకరించకుండా హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే వెనక బ్యాక్ స్కోర్ లా మాత్రమే వినిపించటం భాధ పెడుతుంది.
విభాగాలు
|
రేటింగ్
| |||||
అభినయం :
ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ సినిమాలో.. అలానే నటినటులందరూ బాగా నటించారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది అర్జున్ గురించి. ప్రతినాయకుడిగా అర్జున్ అద్భుతమైన నట ప్రదర్శన చేశాడు. క్రూరత్వాన్ని, ద్రోహాన్ని తన భావాల్లో మహా గొప్పగా పలికించాడు. అరవిందస్వామి పాత్రకు తగ్గట్టు బాగానే నటించాడు. గౌతమ్ లో ఈజ్ ఉంది, చాలా బాగా నటించాడు. కొత్త నటుణ్ణి చూస్తున్నాం అన్నా ఫీలింగ్ ఎక్కడ కనిపించదు. అసలు థమసె కనిపిస్తాడు కాని ఎక్కడ గౌతమ్ అనిపించడు. తులసి బాగుంది.కాకపోతే బొద్దుగా ఉండటం గ్లామర్ ను తీనేసింది. ఆమె నవ్వు స్పెషల్ గా అనిపిస్తుంది. నవ్వుతుంటే మాత్రం చాలా అందంగా ఉంది. మిగత నటినటులందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.
|
3.5/5
| |||||
దర్శకత్వం :
మణిరత్నం కధ , కధనాల పరంగా కొంత నిర్లక్ష్యం వహించినప్పటికీ పాత్రలను మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అలానే ఆయనకు మాత్రమే సాద్యం అయిన కొన్ని అంశాలతో సన్నివేశాలను వైవిద్యంగా తెరకేక్కించారు. ఇక సాంకేతిక విభాగాలను అయన ఉపయోగించుకున్నా తీరును ఎంత పొగిడిన తక్కువే.
|
3.5/5
| |||||
రచన
| ||||||
కధ:
పవర్ ఫుల్ కధే కాని మొదటి సగం లో ఉన్న పటుత్వం రెండో సగంలోకనిపించక పోవటం సినిమాను తెల్చివేసింది. 2.5/5
| ||||||
కధనం:
కధలో జరిగిన పొరపాటు కారణంగా మొదటి సగంలో కనిపించినంత వైవిద్యం రెండో సగంలోకనిపించలేదు. 2.5/5
|
2.75/5
| |||||
మాటలు :
శ్రీ రామకృష్ణ వ్రాసిన మాటలు కధకు తగ్గట్టు చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో చిన్న పిల్లడిగా ఉన్నప్పటి మాటలు చాలా సహజంగా అనిపిస్తాయి. 3/5
| ||||||
సంగీతం
|
2.75/5
| |||||
పాటలు :
రెహమాన్ బాణీలు.. అందుకు వనమాలీ సాహిత్యం బాగున్నాయి. ముఖ్యంగా గుంజుకున్నావ్.. పాట. కాని ఈ పాటలు అందరిని ఆకట్టుకునేవి మాత్రం కాదు. 2.75/5
| ||||||
నేపధ్య సంగీతం:
రెహ్మాన్ స్టైల్ లో బ్యాక్ స్కోర్ చాలా బాగా వచ్చింది ఈ సినిమాకు.. ! 3/5
| ||||||
డాన్సులు:
బృంద మాస్టర్ కోరియోగ్రఫీ లో మణిరత్నంను ఇంప్రెస్స్ చెయ్యాలనే తపన కనిపించింది కాని కొత్తగా ఏమి కనిపించలేదు. 2.5/5
| ||||||
సాంకేతికం
|
3.5/5
| |||||
కెమెరా:
రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆ అనుభూతిని అనుభవించాలే కాని ఇలా ఉంది అని చెప్పలేం. 4/5
| ||||||
ఎడిటింగ్ :
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఏంతో రమ్యంగా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ అర్జున్ ను కలవటానికి వెళ్తూ గతాన్ని గుర్తుకు తెచ్చుకునే సన్నివేశాలను భలే కూర్చారు. 3.5/5
| ||||||
ఆర్ట్ :
శశిదర్ కధకు తగ్గ వాతావరణాన్ని ఏంతో అందంగా సృష్టించారు. మత్స్యకారుల వాడా , షిప్స్, చర్చ్ మొదలైన వాటిని బాగా నెలకొల్పారు. 3.5/5
| ||||||
గ్రాఫిక్స్ :
విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించవు కాని క్లైమాక్స్ కోసం సముద్రం లో తుఫాను వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు. 3.5/5
| ||||||
ఫైట్స్ :
కన్నల్ కన్నన్ , కెచా పోరాటాలను బాగా డిజై చేశారు. ముఖ్యంగా కెచా నేతృత్వంలోని క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా వచ్చింది. 3.5/5
| ||||||
తులాభారం
|
2.5/5
| |||||
హెచ్చులు :
| ||||||
తగ్గులు:
| ||||||
మారుతీ టాకీస్ రేటింగ్ : 3/5
| ||||||
కొసమెరుపు:
చివరిగా చెప్పే దేమిటంటే కడలి ప్రశాంతంగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో... కల్లోలంగా ఉన్నప్పుడు అంత కలవర పెడుతుంది. అలానే ఈ సినిమా మొదటి సగం ఎంత బావుంటుందో.. రెండో సగం అంత నిరాశపరుస్తుంది. కాని మణిరత్నం చిత్రాలను ఇష్టపడే వారిని మాత్రం కడలి తప్పక ఆకట్టుకుంది.

No comments:
Post a Comment