'మన్మధుడు' రీ - లోడెడ్ ...! రొమాంటిక్ జడిలో తడిసి పోవటానికి... గెట్ రెడీ ఫోక్స్ ....! కింగ్ నాగార్జున తాజా చిత్రం 'గ్రీకువీరుడు' కు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈ సంకేతాలనే బలంగా వినిపిస్తుంది. నాగార్జున పూర్తిగా ప్రత్యేకమైనా లుక్ తో కనిపించిన ఈ టీజర్ అక్కినేని అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది.
టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోలా జమనాకు ఇంకా నాగార్జునానే ప్రాతినిద్యం వహిస్తున్నాడు. 'గ్రీకువీరుడు' తో ఆ సంగతిని మరోసారి నిరూపించుకుని టాలీవుడ్ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరోగా తనకు ఇప్పుడప్పుడే పోటి ఎవరు రారు అన్నా విషయాన్నీ తెలియజెప్పే పనిలో ఉన్నాడు. టీజర్ లో వినిపిస్తున్నా పాటను బట్టి నాగ్ ఫ్రీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా నవ మన్మధుడని అర్ధం అవుతుంది. అలానే పాటను చిత్రీకరించిన విధానంలో కూడా ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది కాని కొత్త గెట్ తో కనిపిస్తున్నా నాగ్ ముఖంలోనే తాజాదనం కరువైంది. వెరైటీ గడ్డం నాగ్ కు అంతగా నప్పినట్టు కనిపించటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక పొతే ఈ టీజర్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియజేస్తుంది. అందులో ఒకటి విదేశాలలో చిత్రీకరణ జరుపుకున్నా ఈ సినిమా అక్కడి అందాలను విందు చేయనుందని, మరొకటి తమన్ పాటలతో పండగా చేయనున్నాడని..! మొత్తంగా ఫస్ట్ లుక్ కు సంబంధించి పర్వాలేదు మార్కులు వేయించుకున్నా గ్రీకువీరుడు శ్రేయోభిలాషుల నుండి మాత్రం మంచి ప్రశంశలను దక్కించుకుంటున్నాడు.ఏప్రిల్ లో విడుదలకు సిద్దం అవుతున్నా ఈ గ్రీకువీరుడు పాటలు మార్చిలో విడుదల కానున్నాయి.
గ్రీకువీరుడు ఫస్ట్ లుక్ టీజర్ ...

No comments:
Post a Comment