నిన్న విడుదలైనా మిర్చి సినిమాలో బొద్దు బేబి రిచా గంగోపద్యాయ్ అవతారాన్ని చూస్తే చాలా భాద అనిపిస్తుంది. లీడర్ సినిమాలో అమాయకంగాను, ఫ్రెష్ గాను కనిపించి ఆకట్టుకున్న రిచా ఆ తరవాత తనకు మాత్రమే పరిమితమైనా ప్రత్యేకతను కనబరచలేదు. అసలు ప్రత్యేకత సంగతి పక్కనుంచి సినిమా సినిమాకు చూపరులకు విసుగు పుట్టించే స్థాయికి పతనం అవుతుంది. రిచా పతనావస్థకు పరాకాష్టగా అనిపించింది మిర్చిలో ఆమె కనిపించిన తీరు...!
మిరపకాయ్ తరవాత తమిళనాడుకు వలస వెళ్ళినా రిచా అక్కడ చేసింది రెండు సినిమాలే అయినా తెలుగులో సంపాయించుకొలేనంత పేరు తమిళ్ లో దక్కించుకుంది. తెలుగులో ఆమె నటనను గుర్తించుకోతగ్గా పాత్ర ఇంతవరకు రాలేదనే చెప్పాలి. కాని తమిళ్ లో ఎప్పటికి గుర్తుండి పోయే ఒక మంచి పాత్రను చేసింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన మైక్కమ్ ఎన్నా .. చిత్రంలో యామినిగా నటించి సర్వత్ర అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది.ఆ పాత్రను దృష్టిలో పెట్టుకుంటే రిచా లో టాలెంట్ లేదు అని అనటానికి ఆస్కారమే లేదు. మరి ఆ టాలెంట్ తెలుగు సినిమాలలో ఎందుకు కనిపించటం లేదు...?
ఎందుకంటే..అందరు సెల్వ రాఘవన్ లు కాదు కాబట్టి..! అని కొంటే కామెంట్ వినిపించవచ్చు కాని అది సరైనా సమాదానం కాదు. అందుకు ప్రధానమైనా కారణం ఏమిటంటే .. తెలుగులో హీరోలను ప్రత్యేకంగా చూపించాలన్నా తపన హీరోయిన్ లా విషయంలో దర్శకులకు తక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ తేడానే తెలుగులో మహా నటీమణులు కాదు..కాదు.. అంత పెద్ద పదం వాడలేం.. నటీమణులు అన్న పదానికి ఎవరు వేయకుండానే ముసుగు పడి కేవలం ప్రాణం ఉన్నా రబ్బరు బొమ్మలు మాత్రమే వెండితెర మీద కనిపించాటానికి కారణం అయ్యింది. ఆ కారణం చేతనే ఇప్పుడు రిచా ఎక్కువమంది ఇష్టపడని నటిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఏర్పడింది.
అందుకు నిదర్శనం మిర్చి లోనే చూద్దాం . ఆ సినిమాలో అబ్బాయైనా ప్రభాస్ ను అందంగా చూపించటానికి జరిగిన ప్రయత్నంలో పావువంతు కూడా రిచాకు సంబంధించి జరగలేదు. అరే ... ఎక్స్ ప్రెషన్స్ సంగతి తరవాత కనీసం ఆమె నవ్వుతుంటే పళ్ళు బయట పడి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అన్నా సంగతిని కూడా పట్టించు కోకుండా కెమెరా లో చుట్టేసి సినిమాలో చూపెట్టేశారు. ఇదంతా ఎందుకంటే నిజంగా అనుకుంటే ఎంత చాండాలన్నైనా సినిమా అందంగా చూపించగలదు. అలాంటిది మరీ తీసిపారేయలేనంత టాలెంట్ ఉన్న రిచాను సరిగా వాడుకోవటం లేదనే విచారం.
అంటే ఈ ఆర్టికల్ రిచా మీద సానుభూతితోనో.. ప్రత్యేకమైనా అభిమానంతోనో వ్రాసారేమో అనుకోవద్దు ..అది పొరపాటు.. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ లా షార్టేజ్ దృష్ట్యా తెల్ల తోలు ఉండి సరిపడా ఒడ్డు పొడుగుతో కంటికి అనితే చాలు హీరోయిన్ గా నడిపించేస్తున్నారు. ఈ దారిలోనే ఉన్న రిచా నటన గిటన అనే విషయాలను పట్టించుకోకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. అలాంటి పరిస్థితిలో ఇష్టంలేక పోయినా ఆమెను భరించాల్సిన పరిస్థితి ప్రేక్షకులది. అలా కాకుండా అమ్మడిలో మూలాన పడిపోతున్నా టాలెంట్ ను గుర్తిస్తే ఆ భాదలు ఉండవు కదా అన్నా ఉద్దేశమే ఈ కధనం అని గ్రహించాలి.



No comments:
Post a Comment