సెన్సార్ బోర్డ్ తో కలిసి ప్రభుత్వం కొత్తగా తీసుకుచ్చిన కొన్ని మార్పులు గీత దాటుతున్నా సినిమాలకు పరీక్షలు పెడుతున్నాయి. 'ఎ' రేటింగ్ సినిమాలకు దియేటర్లలో పిల్లలకు ప్రవేశం లేదని చెప్పటమే కాకుండా ఆ రెంటింగ్ సినిమాలు టివి లో కనిపించాలంటే అభ్యంతరకర సన్నివేశాలు తొలగించి ప్రదర్శించాలంటుంది చట్టం. ఈ పాయింట్ ను పట్టించు కోకుండా పరిది మీరిన సినిమాలు శాటిలైట్ హక్కులు అనబడే కష్టం లేని రాబడిని వదులుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజగా ఈ సంకట స్థితిని ఎదుర్కుంటుంది 'బస్ స్టాప్ ' సినిమా.
క్రిందటి దసరా సెలవులకు విడుదలై ద్వంద్వార్ధ వినోదంతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని కమర్షియల్ గా ఘన విజయాన్ని సాదించిన 'బస్ స్టాప్' సాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవటానికి ఏ టివి చానెల్ ఆసక్తి చూపించటం లేదని సమాచారం. సినిమాను టివిలో ప్రదర్శించాలంటే రూల్స్ ప్రకారం 50 శాతం కోత పడే అవకాశం ఉందన్నా కారణంగా చానెల్స్ ఈ సినిమాకు దూరంగా ఉంటున్నాయని తెలుస్తుంది. కాని ఈ సినిమా రూపకర్తలు మాత్రం టివిల వాళ్ళను ఒప్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పట్లో సినిమా విడుదలైనా రెండు వారలా తరవాత కుర్రోళ్ళ ఊపు తగ్గిపోవటం గమనించి సినిమాకు ఫ్యామిలీ రంగు పులమలాని రూపకర్తలు ప్రయత్నించారు కాని వర్కౌట్ అయినా దాఖాలాలు మాత్రం కనిపించలేదు. కాని అప్పుడు బస్ స్టాప్ ను ఫ్యామిలీ సినిమాగా ఒప్పించలేక పోయిన దర్శకనిర్మాతలు కలకండ లాంటి శాటిలైట్ హక్కులను దక్కించుకోవాలంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని కుటుంబ కధ చిత్రంగా నిరుపించుకోవల్సినా పరిస్థితి వచ్చింది. దీని మూలంగా మరో విషయం కూడా తేట తెల్లం కానుంది, అదేమంటే.. ఈ సినిమా టివి వాళ్ళను ఒప్పించుకుని బుల్లి తెర మీద కనపడింది అంటే దర్శకుడు మారుతీ గతంలో చెప్పినట్టు బస్సు స్టాప్ సినిమాలో ఫ్యామిలీ అంశాలు కూడా ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది, లేదంటే... ఈ సినిమాను బూతు సినిమాగా అధికారికంగా అంగీకరించినట్టు అవుతుంది. ఆ ఫై ఏమి జరుగుతుందో వేచి చూద్దాం ..!
No comments:
Post a Comment