'జాక్సన్ కా బాప్ ' అమ్మో.. అంత పెద్దమాటే...! కనీసం జాక్సన్ తో పోల్చటానికే వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటారు, చివరికి ప్రభుదేవా అంతటి డాన్సర్ నే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే పదానికే పరిమితం చేశారు. అలాంటిది ఒక హీరోకు జాక్సన్ కా బాప్ అని కాంప్లిమెంట్ రావటం మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ప్రశంశను దక్కించుకుని ప్రస్తుతం వార్తల్లో విహరిస్తున్నా వ్యక్తీ మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
చరణ్ తోలి హిందీ చిత్రం జంజీర్ సినిమా కోసం 'ముంబై కె హీరో ' అనే పాటలో చెర్రీ చేసిన డాన్సింగ్ మూమెంట్స్ చూసి థ్రిల్ అయిపోయిన ఈ చిత్ర దర్శకుడు అపూర్వ లకియా ఈ కామెంట్ చేసి బాలీవుడ్ లో కలకలానికి తెర లేపాడు. దాంతో హిందీ సినిమా పరిశ్రమలో చరణ్ గురించి అసక్తికరమైనా అంచనాలు మొదలవుతుంటే.. అతనికి దక్కుతున్నా మన్ననలను చూసి రాష్ట్రములో మెగా అభిమానులు పులకించి పోతున్నారు.
అలానే మరో వైపు కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏ దర్శకుడి సినిమా ఆ దర్శకుడికి నచ్చటంలో గొప్పేముంది. చరణ్ జాక్సన్ కా బాప్ అన్నా కామెంట్ లో నిజమెంత ఉందొ రేపు సినిమా విడుదల అయిన తరవాత కదా తెలిసేది, అప్పుడు చూద్దాం...! అని కొందరు మూతి విరుస్తున్నారు. అది సంగతి.. ! మొత్తానికి చరణ్ కు దక్కిన ఈ ఊహించని ప్రశంశలో నిజాయితీ ఏ మాత్రం ఉందో రేపు ఏప్రిల్ నెలలో తేలుతుంది.
ఇకపోతే చిత్ర జంజీర్ దర్శకుడు చరణ్ గురించి చేసి కామెంట్ 'Just wrapped a kick ass song for #zanjeer "Mumbai Ke Hero" with Charan.... He killed it... Jackson ka baap hai who boss...'
జంజీర్ లోని 'ముంబై కె హీరో ' పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నా చరణ్.....


No comments:
Post a Comment