Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, February 11, 2013

మహేష్ బాబుకు సరైనా జోడీ కుదిరింది

 ఈ మద్య  పిట్ట మొహలతోను, సొట్ట మొహలతోను సర్దుకుపోతూ నడిపించేస్తున్నా మహేష్ బాబుకు ఇన్నాళ్ళకు సరిజోడైనా హీరోయిన్ దొరికింది. గతంలో నమ్రత , సొనాలి బింద్రే, త్రిషా, అనుష్క  కొంత వరకు ఆ లోటును కవర్ చేశారు కాని మహేష్ కు నిఖర్సైనా సరిజోడు ఇప్పటి వరకు దొరకలేదనే చెప్పాలి. అలానే ఎత్తు తక్కువున్నా , పెర్సనాలిటీ పక్కగా లేకపోయినా మహేష్ ను చూస్తూ హీరోయిన్ లను మన్నించేసినా అభిమానులకు కూడా మహేష్ బాబు విగ్రహానికి తగ్గా నటి ఇంత వరకు కుదరలేదు అన్నా నిరాశ ఏ మూలనో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ లోపం 'శివం' సినిమాతో పూర్తిగా తీరిపోనుందనిపిస్తుంది. 



బిగ్ హీరోలా పక్కన అల్టిమేట్ కాంబినేషన్ గా బాలీవుడ్ జనంతో వేనోళ్ళ పోగిడించుకుంటున్నా సోగ కళ్ళ సోనాక్షి మహష్ తో జతకట్టటానికి ఒప్పుకుని అతణ్ణి ఇష్టపడే వారి బెంగ తీర్చాటానికి సిద్దం అయ్యింది. మాటలవరకే పరిమితం కాకుండా ఈ విషయానికి అధికారిక ద్రువికరణ కూడా తోడవటంతో ఈ జంట ఎలా ఉండబోతుందో... అన్నా ఆసక్తి అంతటా మొదలయ్యింది. ఒకరి కోసం ఒకరేమో అన్నట్టు సరిపడా హైట్ , పర్సనాలిటిలతో మహేష్ - సొనాక్షిలా జోడి చూడా ముచ్చటగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఒకటే ఆశ ఈ జోడితో అన్నా దాదాపు తెలుగు సినిమాలలో కనుమరుగై పోతున్నా హిట్ పెయిర్ అనే పదానికి మళ్లీ జీవం వస్తుందేమో చూడాలి. 


సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయన్ని పక్కన పెట్టి సోనాక్షి నామా జపంతో ప్రచారం మాత్రం మొదలుపెట్టిన దర్శకుడు క్రిష్ 'శివం' సినిమాలో సోనాక్షి రాచఠీవి ఉట్టిపడే మీనాక్షి అనే కుందనపు బొమ్మ పాత్రలో తెలుగు తెరను పావనం చేయబోతుందని ఊరిస్తున్నాడు. సోనాక్షి ఈ సినిమాను ఒప్పుకునే క్రమంలో జరిగినా తతంగాన్ని కధలు కధలుగా బాగానే పబ్లిసిటీ చేస్తున్నా క్రిష్ అసలు మీనాక్షి పాత్రకు సోనాక్షినే స్పూర్తి అని చెబుతున్నాడు. అందివచ్చినా అవకశాలను పద్దతిగా వాడుకుంటూ సినిమా ఫై ఆసక్తి కలిగిస్తున్నా క్రిష్ మహేష్ - సోనాక్షి లా జంటను 'శివం' లో ఎంత వైవిద్యంగా చూపిస్తాడో .. వేచి చూడాలి.  


No comments:

Post a Comment